Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే..
  • చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి
  • తిరుమలలో పెరిగిన రద్దీ.. టీటీడీ కీలక సూచన
  • శ్రీశైలాన్ని సందర్శించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి
  • నడుస్తున్న కారు డోరు తెరిచిన వ్యక్తి.. ద్విచక్రవాహనాదారుడు మృతి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
సినీ పోస్టర్‌కు కొత్త అందాలు సృష్టించిన ఈశ్వర్‌ | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

సినీ పోస్టర్‌కు కొత్త అందాలు సృష్టించిన ఈశ్వర్‌

Sun 26 Sep 04:45:08.516228 2021

 

'సాక్షి' సినిమా కలర్‌ పోస్టర్లు, లోగోలను ఈశ్వరే తీర్చిదిద్దారు. ఈ సినిమాతో పబ్లిసిటీ డిజైనర్‌గా ఈశ్వర్‌ ప్రయాణం ప్రారంభమైంది ఃపాప కోసంః సినిమా కోసం బ్రష్‌ వాడకుండా నైఫ్‌ వర్క్‌తో పోస్టర్ల రూపొందించారు. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పెద్దపెద్ద నిర్మాణ సంస్థలకూ, నటులకూ ప్రీతిపాత్రుడైన పబ్లిసిటీ ఆర్టిస్టుగా ఎదిగారు. విజయ ప్రొడక్షన్స్‌, ఏవీయం, జెమినీ, అన్నపూర్ణ, గీతా ఆర్ట్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌, వైజయంతి మూవీస్‌ తదితర నిర్మాణ సంస్థలకు ఆయన పబ్లిసిటీ డిజైనర్‌గా పని చేశారు. పలు ప్రముఖ నిర్మాణ సంస్థల లోగోలను ఆయన డిజైన్‌ చేశారు. అలా 40 ఏళ్ల పాటు నిర్విరామంగా పనిచేశారు. 2,600లకు పైగా చిత్రాలకు పని చేశారు. 2000 సంవత్సరంలో విడుదలైన కోడి రామకష్ణ ఃదేవుళ్ళుః చిత్రానికి ఈశ్వర్‌ ఆఖరుగా వర్క్‌ చేశారు.
      స్వయంకషితో ఎదిగిన చిత్రకారుడు... ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం... భారతదేశపు సినీ ప్రముఖులందరితో కలిసి పనిచేసిన వైభవం... నడిరోడ్డు మీద జనాలని నిలబెట్టి... పోస్టర్లకేసి చూసేలా చేసిన కళా మాంత్రికుడు... జు - అన్న ఒక్క అక్షరం చాలు ఆయనెవరో తెలుసుకోడానికి...! ఆయనే ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌.
     ప్రకటనా చిత్రకళలో కళని నిలువెత్తునా నిలబెట్టి పోస్టర్‌ పోట్రయిట్‌ స్థాయికి పెంచి చూపేట్టిన కలర్‌ మాంత్రికుడు.. అని బాపు కొనియాడిన పబ్లిసిటీ ఆర్టిస్టు ఈశ్వర్‌ రావు ఆర్థిక కారణాలతో పాలిటెక్నిక్‌ చదువు ఆగిపోవడంతో, ఆయన మద్రాసు రైలెక్కారు. టూరింగ్‌ టాకీస్‌ దగ్గర వాల్‌ పోస్టర్లను చూసి బొమ్మ లేసిన అనుభవం, కేతాగారి దగ్గర ఉద్యోగం ఇప్పించింది. ఐదేండ్ల తర్వాత ''ఈశ్వర్‌'' సంతకంతో సొంతంగా డిజైన్‌ చేయడం ప్రారంభించారు. తొలి చిత్రం బాపూ రమణల ''సాక్షి'' నాలుగు దశాబ్దాలలో ఆయన తెలుగు, కన్నడ, తమిళం, హిందీ తదితర భాషలకు పని చేశారు. రెండున్నర వేల చిత్రాలకు పోస్టర్లు డిజైన్‌ చేశారు. ఇక సినిమా పోట్రయిట్స్‌లో అయితే ఆయన తర్వాతే ఎవరైనా. తన సుదీర్ఘ అనుభవాల్ని ''సినిమా పోస్టర్‌'' పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు. పాలకొల్లు నుంచి చెన్నపట్నం దాకా... ''సాక్షి'' నుంచి ''దేవుళ్ళు'' దాకా... తన జీవిత, సినిమా అనుభవాలను ఈ పుస్తకంలో వివరించారు.
     సీనియర్‌ పబ్లిసిటీ డిజైనర్‌గా సుపరిచితులైన ఈశ్వర్‌ అసలు పేరు కొసనా ఈశ్వరరావు. ఈశ్వర్‌ పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు లో 1938 వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ముత్యమాచార్య, ఈశ్వరమ్మ. వారి పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన నైపుణ్యం కారణంగా ముత్యమాచార్య బంగారు నగలపై డిజైన్‌లు చెక్కడం, లోహపు విగ్రహాలు తయారు చేయడంతో, స్వతస్సిద్ధమైన ప్రతిభ ఉన్న ఈశ్వర్‌ చిన్నతనంలోనే మట్టి బొమ్మలు తయారు చేయడం, కాగితంపై పెన్సిల్‌తో రేఖా చిత్రాలు గీయడం లాంటివి చేస్తూనే, ఆయన నాటకాలు వ్రాసి ప్రదర్శించేవారు. రంగాలంకరణ చేసేవారు. పరిషత్‌ నాటక పోటీలలో పాల్గొని బహుమతులు గెల్చుకున్నారు. ముందు చదువు కోసం, ఆ తర్వాత బతుకు తెరువు కోసం చిత్రకళను నమ్ముకున్నాక నాటకాలని వదిలేశారు కానీ, ఆ రంగంలో ఆయనకు మంచి భవిష్యత్తు ఉండేది అనిపిస్తుంది. గురు ముఖతా కాక చిత్రకళను స్వయంగానే నేర్చుకున్నారు. చిన్నతనంలో సినిమా పోస్టర్లకి నకళ్ళు గీసేవారట.
గాంధీ బొమ్మ వేసి ప్రశంశలు
     చిన్నతనం నుంచే బొమ్మలు గీయడంపై ఆసక్తి పెంచుకున్న ఈశ్వర్‌ తన 10వ ఏట మహాత్మా గాంధీ మరణాంతరం దేశమంతా సంతాప సభలు జరుగుతున్న సమయంలో గాంధీ బొమ్మ వేసి చిన్నతనంలో అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలోనే వంశపారంపర్యంగా వస్తున్న బొమ్మలు గీసే వత్తిలోకి అడుగు పెట్టారాయన. లోహశిల్పుల కుటుంబంలో పుట్టిన ఈశ్వర్‌కు చిన్నతనంలోనే కుటుంబం ఆర్థికంగా చితికిపోవటంతో చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. కాకినాడలో పాలిటెక్నిక్‌ చదువును అర్థంతరంగా ముగించి, పొట్ట చేత పట్టుకుని, చేతిలో ఉన్న బొమ్మలు గీసే కళను నమ్ముకొని మద్రాసు చేరాడు.
మద్రాసులో సొంత పబ్లిసిటీ డిజైనింగ్‌ స్టూడియో
    పబ్లిసిటీ ఆర్టిస్టుగా స్థిరపడాలనుకున్న ఈశ్వర్‌ స్నేహితుడి సాయంతో మద్రాస్‌కు వెళ్లి ప్రముఖ ఆర్టిస్ట్‌ కేతా అధిపతి కేతా సాంబమూర్తి దగ్గర పోస్టర్‌ డిజైనింగ్‌ విభాగంలో మెలకువలు నేర్చుకున్నారు. సరాగం స్టూడియో గంగాధర్‌ చేయూతనిచ్చి ఆదరించారు. ఆఫ్‌సెట్‌ ముద్రణలేని ఆ కాలంలో లైన్‌డ్రాయింగ్‌ పద్ధతితో పోస్టర్లకు సరికొత్త సోయగాన్ని తీసుకొచ్చారు. కొంతకాలం తర్వాత 'ఈశ్వర్‌' పేరుతో సొంత పబ్లిసిటీ డిజైనింగ్‌ స్టూడియోను ఏర్పాటు చేసుకున్నారు.
'సాక్షి'తో చిత్రపరిశ్రమలోకి
    ప్రముఖ దర్శకుడు బాపు 1967 లో తెరకెక్కించిన 'సాక్షి'తో తెలుగు చిత్రపరిశ్రమలోకి ప్రవేశించారయన. 'సాక్షి' సినిమా కలర్‌ పోస్టర్లు, లోగోలను ఈశ్వరే తీర్చిదిద్దారు. ఈ సినిమాతో పబ్లిసిటీ డిజైనర్‌గా ఈశ్వర్‌ ప్రయాణం ప్రారంభమైంది 'పాప కోసం' సినిమా కోసం బ్రష్‌ వాడకుండా నైఫ్‌ వర్క్‌తో పోస్టర్ల రూపొందించారు. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పెద్దపెద్ద నిర్మాణ సంస్థలకూ, నటులకూ ప్రీతిపాత్రుడైన పబ్లిసిటీ ఆర్టిస్టుగా ఎదిగారు. విజయ ప్రొడక్షన్స్‌, ఏవీయం, జెమినీ, అన్నపూర్ణ, గీతా ఆర్ట్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌, వైజయంతి మూవీస్‌ తదితర నిర్మాణ సంస్థలకు ఆయన పబ్లిసిటీ డిజైనర్‌గా పని చేశారు. పలు ప్రముఖ నిర్మాణ సంస్థల లోగోలను ఆయన డిజైన్‌ చేశారు. అలా 40 ఏండ్ల పాటు నిర్విరామంగా పనిచేశారు. 2,600లకు పైగా చిత్రాలకు పని చేశారు. 2000 సంవత్స రంలో విడుదలైన కోడి రామకష్ణ 'దేవుళ్ళు' చిత్రానికి ఈశ్వర్‌ ఆఖరుగా వర్క్‌ చేశారు. సినిమా రంగంలో నిర్మాణ సంస్థ లోగో డిజైన్‌తో ప్రారంభమై,
    సినిమా టైటిల్‌, పాత్రధారుల విగ్గులు, ఆహార్యం, సినిమా టైటిల్‌ కార్డ్స్‌, పత్రికలలో వచ్చే ప్రకటనలు, విడుదల సమయంలో పోస్టర్లూ, హౌర్డింగులూ, వారంవారం మారే ప్రకటనలు, పోస్టర్లు, చివరకు విజయోత్సవం షీల్డులు డిజైన్‌ చేయటం వరకూ పబ్లిసిటీ డిజైనర్ల బాధ్యతలే. కంప్యూటర్లు వచ్చాక ఈ పని బాగా మారిపోయింది. ఒకప్పుడు, చాలా కష్టం, అసంభవం అనుకున్న పనులు ఇప్పుడు అవలీలగా చేయగలుగుతున్నారు. ఈ దశలో అగ్రస్థానంలో కొనసాగాలంటే తాను మళ్ళీ విద్యార్థిగా మారవలసి వస్తుందని, ఆ ఓపికలేక ఈ రంగం నుంచి విరమించుకున్నానని ఒక ఇంటర్వ్యూలో ఈశ్వర్‌ చెప్పారు.
పలు భాషలలో అత్యద్భుతమైన పోస్టర్స్‌
    అలానే అగ్ర కథానాయకుల చిత్రాల రీ-రిలీజ్‌ సమయంలోనూ తనదైన శైలిలో మూవీ పోస్టర్స్‌ను తయారు చేసి, ప్రేక్షకులకు ఆ సినిమాల పట్ల ఆసక్తి కలగడానికి ప్రధాన కారకులుగా నిలిచేవారు.
ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈశ్వర్‌
   ఈశ్వర్‌ జీవితంలో చాలా నాటకీయత ఉంది. ఐశ్వర్యం, దారిద్య్రం, విఫల ప్రేమ, బంధుమిత్రుల ద్రోహాలు, అవమానాలు, వీటన్నిటినీ అధిగమించి సఫలం కావడం, తనను అవమానించిన వారిని సైతం ఆదరించటం యండమూరి, యద్దనపూడిల నవలలా ఉంటుంది ఆయన కథ. ఒక సంక్రాంతి రోజున తమిళంలో విడుదలైన ఆరుగురు పెద్ద హీరోల సినిమాలకూ పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌. అంటే ఆయన సినీ పరిశ్రమలో పబ్లిసిటీ డిజైనర్‌గా ఎంత ఎత్తుకు ఎదిగాడో అర్థం అవుతుంది.
పోస్టర్‌ డిజైనింగ్‌లో ప్రయోగాలు
    'పాపకోసం' చిత్రం కోసం బ్రష్‌ వాడకుండా నైఫ్‌ వర్క్‌తో వాల్‌పోస్టర్లను రూపొందించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. పోస్టర్ల డిజైనింగ్‌లో ఎప్పటికప్పుడు ప్రయోగాలను చేసి కొత్తదనాన్ని తీసుకొచ్చిన ఘనత ఈశ్వర్‌ది. అన్నాదురై చిత్ర పటాన్ని రూపొందించాలని అప్పటి తమిళ నాడు ముఖ్యమంత్రి కరుణానిధి స్వయాన ఈశ్వర్‌ను కోరడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కష్ణ, ఎంజీఆర్‌, శివాజీ గణేషన్‌, జెమినీ గణేశన్‌, చిరంజీవి, బాలకష్ణ లాంటి అగ్ర హీరోల చిత్రాలకు పబ్లిసిటీ డిజైన్లు రూపొందించారు
అరుదైన పుస్తకం 'సినిమా పోస్టర్‌'
    నాలుగు దశాబ్దాలపాటు సినిమాపోస్టర్లని డిజైన్‌ చేసిన ఈశ్వర్‌ తన జీవిత విశేషాల గురించీ, సినిమా పోస్టర్ల గురించి, సినిమా ప్రచారకళ గురించి, చిత్రకళ గురించి ఒక విపులమైన సమాచారంతో 2011లో ఆకర్షణీయమైన పుస్తకం వ్రాశారు. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఫిల్మ్‌ పోస్టర్‌ డిజైనర్స్‌ వివరాలు, సినీ రంగంలోని ప్రముఖ నిర్మాణ సంస్థల విశేషాలు ఈ 'సినిమా పోస్టర్‌' పుస్తకంలో ఉన్నాయి. ఈశ్వర్‌ తీసుకున్న శ్రమ ఈ పుస్తకంలో అడుగడుగునా కనిపిస్తుంది. ముఖ్యంగా వర్ణ, రేఖాచిత్రాల గ్యాలరీ ఈ పుస్తకానికే హైలైట్‌. ఈ పుస్తకానికి ఉత్తమ సినిమా గ్రంథ రచన విభాగంలో 2011లో ''నంది పురస్కారం'' లభించింది. చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను 2015లో ఆయన్ని ''రఘుపతి వెంకయ్య పురస్కారం''తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సత్కరించింది.
సోదరుడితో కలిసి అనూ గ్రాఫిక్స్‌ తెలుగు ఫాంట్లు సష్టి
    ఈశ్వర్‌ సోదరుడు బ్రహ్మం ప్రోద్భలం, పోత్సాహంతో దక్షిణాది భాషల్లోని అక్షరాలను కంప్యూటీకరణకు అనుకూలంగా రాయడం విశేషం. ప్రస్తుతం ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ మీడియా రంగంలో వినియోగిస్తున్న తెలుగు అక్షరాల్లో 90 శాతం వరకు ఆయన తన తమ్ముడు బ్రహ్మంతో కలసి రూపొందించినవే! ఈశ్వర్‌ సహకారంతోనే బ్రహ్మం అనూ గ్రాఫిక్స్‌ తెలుగు ఫాంట్‌లను రూపొందించారు.
సెప్టెంబర్‌ 21న మతి
    ఈశ్వర్‌ అంచెలంచెలుగా ఎదిగి, స్వంత స్టూడియో స్థాపించుకొని, నాలుగుభాషల్లో పెద్దపెద్ద నిర్మాణసంస్థలకూ, నటులకూ ప్రీతిపాత్రుడైన పబ్లిసిటీ ఆర్టిస్టుగా ఎదిగారు. 2000 సంవత్సరంలో ''దేవుళ్ళు'' చిత్రం తర్వాత, విశ్రాంత జీవితం గడుపుతున్న ఈశ్వర్‌ 2021, సెప్టెంబర్‌ 21న చెన్నైలో అనారోగ్యంతో మరణించాడు. ఈశ్వర్‌ భార్య పేరు వరలక్ష్మి, వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారులిద్దరూ విజరుకుమార్‌, శశికుమార్‌లు చెన్నైలోనే ఉంటుండగా, కుమార్తెలు వనజ, రేఖలు అమెరికాలో స్థిర పడ్డారు.
- పొన్నం రవిచంద్ర, 9440077499
సీనియర్‌ జర్నలిస్టు, సినీ విమర్శకులు

 

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

న‌ట‌శేఖ‌రుడు కృష్ణ‌
ధరలు ఆకాశంలో... ప్రజలు పాతాళంలో...
సెలవులందు వేసవి సెలవులు వేరయా!!
మనసు కవి.. మన సుకవి.. ఆచార్య ఆత్రేయ
కామ్రేడ్‌ మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య
రంజాన్‌ - రోజా - జకాత్‌
ఎండాకాలం - జాగ్రత్తలు
సంఘటిత శక్తి..అంకాపూర్‌
అరుణోద్యమ కెరటం మా మల్లు స్వరాజ్యం
మనుగడ కోల్పోతున్న మానవుని ఆదిమ ఆవాసాలు

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
10:04 PM

సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే..

09:53 PM

చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి

09:42 PM

తిరుమలలో పెరిగిన రద్దీ.. టీటీడీ కీలక సూచన

09:38 PM

శ్రీశైలాన్ని సందర్శించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి

09:30 PM

నడుస్తున్న కారు డోరు తెరిచిన వ్యక్తి.. ద్విచక్రవాహనాదారుడు మృతి

09:20 PM

అమ‌లాపురం అల్లర్ల ఘటన.. వాట్సాప్ మెసేజ్ గుర్తింపు..!

09:08 PM

పంజాబ్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహితలకు రాజ్యసభ సీటు..!

09:01 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

08:57 PM

మహిళతో యువకుడు వివాహేతర సంబంధం.. ఇద్దరికీ పెండ్లి చేసిన గ్రామస్తులు

08:45 PM

పిచ్చోడి చేతిలో రాయిలా.. బండి సంజయ్ చేతిలో బీజేపీ : వైఎస్ షర్మిల

08:40 PM

అనుమానాస్పదంగా టీఆర్ఎస్ యువ నాయకుడు మృతి

08:26 PM

పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్రావ‌త‌ర‌ణ వేడుక‌లు

08:20 PM

ఆర్టీసీతో ఎన్టీఆర్ అనుబంధాలను గుర్తు చేసుకున్న సజ్జనార్

08:02 PM

ఎన్టీఆర్‌కు ఎదురెళ్లడం నా దురదృష్టకరం : మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు

07:55 PM

దేశంలో పెరుగుతున్న బీఏ.4, బీఏ.5 కరోనా కేసులు

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.