Sun 03 Oct 03:51:57.432201 2021
Authorization
సాఫ్ట్ స్కిల్స్ అలవడిన వ్యక్తులు ప్రదర్శించే పరిపూర్ణత్వం ఎంతో అపురూపంగా ఉంటుంది. ఆ పరిపూర్ణత సదరు వ్యక్తులకే కాకుండగా తమ చుట్టూతా ఉండే సమాజానికీ బదిలీ అవుతుంది. ఒక మంచి సంస్కారవంతమైన గుణాత్మకమైన సమాజ ఆవిష్కరణకు సాఫ్ట్ స్కిల్స్ ఎంతగానో తోడ్పడతాయి. ఐతే ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ గురించి ఇంత లోతుల్లోకి వెళ్లి ఎవరూ ఆలోచించడం లేదు.మార్కెట్ దష్టితోనే చూస్తున్నారు. కేవలం ఈ 'సెల్ టెక్' లో ఎవరికైతే ప్రావీణ్యం ఉంటుందో వాళ్లు వత్తి ఉద్యోగ వ్యాపార అవస్థాపనా రంగాలతో పాటు జీవితంలో రాణించగలరనే సాధారణ, వ్యక్తి కేంద్రీకత ఆలోచన చుట్టే అందరూ పరిభ్రమిస్తున్నారు.
ఒక ఇల్లు దేదీప్యమానంగా వెలుగొందుతుం దన్నా, ఒక కంపెనీ దినదినాభివద్ధి చెందుతుందన్నా, ఒక సంఘం నిత్య నూతనంగా ఉంటుందన్నా అందుకు కారణం ఆ ఇంట్లో, ఆ కంపెనీలో, ఆ సంఘంలో గుణవంతులు పనిమంతులు ఉండటమే అంటారు మన పెద్దలు. ఇప్పుడు వ్యక్తిత్వ వికాస నిపుణులు గుణవంతుల గుణగణాలను 'సాఫ్ట్ స్కిల్స్ Soft Skills)' అని, పనిమంతుల శక్తి సామర్థ్యాలను 'హార్డ్ స్కిల్స్ (Hard Skills)' అని సరికొత్త పేర్లతో సంబోధిస్తున్నారు.
తెలుగులో సాఫ్ట్ స్కిల్స్‌ను మదు నైపుణ్యాలు అని, హార్డ్ స్కిల్స్‌ను పని నైపుణ్యాలు అని పిలుస్తున్నాం. పని నైపుణ్యాలు భౌతిక విషయంలో అవసరమవుతాయి. మదు నైపుణ్యాలు వ్యక్తిత్వ నిర్మాణంలో మనస్సుకు ఆలంబనగా వుంటాయి. వత్తి నిర్వహణపై సైతం విస్తత ప్రభావాన్ని కనబరుస్తాయి. అందుకే వ్యక్తిత్వ వికాస విద్యలో సాఫ్ట్ స్కిల్స్ అత్యంత ప్రాధాన్యత కలిగున్నాయి. వ్యక్తులు సాధించే అసమాన విజయాలకు సాఫ్ట్ స్కిల్సే చోదకశక్తిగా ఉంటాయి. అందుకే “Soft skills an essential ingredient for success” అంటూ వ్యక్తిత్వ వికాస నిపుణులు అభివర్ణించారు. విద్యా పరంగా బోధనాభ్యసన వత్తం(పి ఎల్ సి)లో కేవలం ఉద్యోగ లబ్ధం (Employability Quotient) గానే కాకుండా వ్యక్తుల మనోవైఖరులకు పునాదిగా ఉంటూ అభ్యసనానికి సంబంధించిన ఇతర భాగస్వామ్య వ్యవస్థలకు సాఫ్ట్ స్కిల్స్ నిరంతరం మద్దతునిస్తాయం టారు బెంగుళూరుకు చెందిన ప్రముఖ కాలమిస్టు 'లెర్నింగ్ మాటర్స్' సంస్థ కో-ఫౌండర్
శ్రీమతి సరస్వతీ రామమూర్తి. వ్యక్తి వికాసానికి అవసరమైన నైపుణ్య సముదాయం (స్కిల్ సెట్)లో సాఫ్ట్ స్కిల్స్ అద్వితీయమైనవి . ఇవి 1.కమ్యూనికేషన్, 2.ఎథిక్స్, 3.లీడర్ షిప్, 4.టీమ్ వర్క్, 5.ఎంపతీ, 6. క్రియేటివిటీ. వీటినే సంకేతాక్షరాల్లో సీఈఎల్టీఈసీ (సెల్ టెక్)గా మోటివేషనల్ స్పీకర్లు సూత్రీకరించారు ఇవి హార్డ్ స్కిల్స్ వలె ప్రాక్టికల్‌గా ఇతరుల నుంచి లేదా పుస్తకాల నుంచి నేర్చుకోవడం ద్వారా సులభంగా అలవడేవి కాదు. వివిధ పరిస్థితులలో రకరకాల వ్యక్తుల నుంచి అనేక సంఘటనల మధ్య , స్వీయ అనుభవంతో మానసిక ఎదుగుదలతో తార్కికంగా తాత్త్వికంగా పరిపక్వతతో భావనా పరిధిలోంచి ప్రయత్నపూర్వకంగా అందిపుచ్చుకునేవి. అందువల్లనే సాఫ్ట్ స్కిల్స్‌ను interpersonal, intra-personal skills అని కూడా అంటారు. వీటి సాధనకు విద్యా ప్రయోజనాల్లోని 'ప్రజ్ఞా లబ్ధి (Intelligence Quotient)” , మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిలోని ఉద్వేగ లబ్ధి (Emotional Quotient)” యువతీయువకులకు అవసర మవుతాయి. సాఫ్ట్ స్కిల్స్ అలవడిన వ్యక్తులు ప్రదర్శించే పరిపూర్ణత్వం ఎంతో అపురూపంగా ఉంటుంది. ఆ పరిపూర్ణత సదరు వ్యక్తులకే కాకుండగా తమ చుట్టూతా ఉండే సమాజానికీ బదిలీ అవుతుంది. ఒక మంచి సంస్కారవంత మైన గుణాత్మకమైన సమాజ ఆవిష్కరణకు సాఫ్ట్ స్కిల్స్ ఎంతగానో తోడ్పడతాయి. ఐతే ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ గురించి ఇంత లోతుల్లోకి వెళ్లి ఎవరూ ఆలోచించడం లేదు. మార్కెట్ దష్టితోనే చూస్తున్నారు. కేవలం ఈ ఃసెల్ టెక్ః లో ఎవరికైతే ప్రావీణ్యం ఉంటుందో వాళ్లు వత్తి ఉద్యోగ వ్యాపార అవస్థాపనా రంగాలతో పాటు జీవితంలో రాణించగలరనే సాధారణ,
వ్యక్తి కేంద్రీకత ఆలోచన చుట్టే అందరూ పరిభ్రమిస్తున్నారు. ఒకప్పుడు బ్రెజిల్, మెక్సికో, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా,దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్, డెన్మార్క్, స్వీడన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇంగ్లాండ్, సింగపూర్, ఫిన్లాండ్, నార్వే వంటి అభివద్ధి చెందిన దేశాల్లో మాత్రమే సాఫ్ట్ స్కిల్స్ పాఠ్యాంశంగా ఉండేవి. పారిశ్రామికీకరణ నాల్గో దశ ఊపందుకున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ సాఫ్ట్ స్కిల్స్ మీద దష్టి సారించాయి.ఈ క్రమంలోనే సిలబస్‌లో ప్రధాన సబ్జెక్టులకు అనుసంధానంగా సాఫ్ట్ స్కిల్స్ బోధన మనదేశంలో రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైంది.
నైపుణ్యాల నిర్ధారణ విషయంలో సాంకేతికత తికమక పెడుతున్న క్రమంలో “Soft skills are skills,abilities and traits that pertain to personality, attitude and behaviour” అనే నైఘంటిక నిర్వచనం విద్యార్థులందరికీ తప్పక తెలియాల్సివుంది. సాఫ్ట్ స్కిల్సే సక్సెస్ స్కిల్స్ కాబట్టి, పనిచేసే చోట మంచి వేతనంతో పాటు, వ్యక్తిగత జీవితంలోనూ సమాజం నుంచి అమితాదరణ లభిస్తున్న దరిమిలా సాఫ్ట్ స్కిల్స్ కోచింగ్ తీసుకునేందుకు యువతీయువకులు ఇంతక్రితం కంటే ఇప్పుడు మరింత ఆసక్తిగా ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయంగా అంతర్జాతీయంగా సాఫ్ట్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్, సాఫ్ట్ స్కిల్స్ ప్లాట్ ఫాంలు, సాఫ్ట్ స్కిల్స్ గ్రంథాలు, మేగజైన్లకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. సాఫ్ట్ స్కిల్స్ అందించడం విద్యాసంస్థలకూ, సముపార్జించడం యువతకూ అనివార్య సంస్థాగత కార్యక్రమం అయ్యింది. ఇవాళ భూగోళమ్మీద ప్రతి చిన్న సమాజం విశ్వ సమాజంలో అంతర్భాగమై మనుగడ సాగిస్తున్న విషయం మనకు ఎరుకున్నదే . ఇదే ప్రపంచీకరణ తెచ్చిన కీలక మార్పు. అయినా ఏ సమాజానికి ఆ సమాజం ప్రతి తరంలోనూ ప్రతిష్ఠించుకునే ప్రమాణాలు, విలువలు ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని సమీకత ప్రమాణాలుగా విలువలుగా మార్చటానికి నెలకొల్పడానికి ముందస్తుగా ఆయా సమాజాల్లో సరిపడా ఆలోచనలు భావనలు పరికల్పనల ఉత్పాదకత జరగాల్సి వుంది. మనోవ్యవస్థలో తటస్థించే ఈ ఆలోచనలు భావనలు పరికల్పనలను అర్థంచేసుకుంటూ జీవితానికి అన్వయించుకుంటూ నూత్న విధానాలను, సిద్ధాంతాలను, ప్రయోగాలను ప్రతిపాదించే మేధోవర్గం ప్రతి సమాజానికీ అవసరం. అందుకనే మేధావులకు 'ఐడియా జనరేటర్స్' అనే పేరుంది. సాఫ్ట్ స్కిల్సే అప్లైడ్ స్కిల్స్ కూడా కనుక , సాఫ్ట్ స్కిల్స్ లేనిదే ఐడియా జనరేటింగ్ సాధ్యం కాదు.కొన్ని సార్లు మేధోవర్గం సష్టించే వినూత్న కల్పనల్లో సుకతులతో పాటు, వికతులు కూడా భలే ముచ్చటేస్తుండటం చూస్తుంటాం. అందుకే ''రమ్యాణాం వికతిరపి శ్రియం తనోతి'' అన్నారు మన ప్రాచీన పండితులు.అంటే ''స్వభావ సుందరులకు వికతి కూడా ఒక అందమే ''అని అర్థం. సాఫ్ట్ స్కిల్స్ స్వభావ సౌందర్యం కిందకే వస్తాయి.సాఫ్ట్ స్కిల్స్ ద్వారా సిద్ధించే స్వభావ సౌందర్యానికి forming,storming,norming, performing,adjourning అనే ఐదు దశలూ ప్రకతులూ ఉంటాయి. ఈ ఐదింటి మదింపు మేరకు పనిని, స్థలాన్ని, సమయాన్ని, సామర్థ్యాన్ని, అనుభవాన్నిబట్టి వ్యక్తుల సాఫ్ట్ స్కిల్స్ విజయవంతం అవుతాయి.
ఈ జమానా యువతీ యువకుల్లో కొందరు సాఫ్ట్ స్కిల్స్ మాట విన్నప్పుడల్లా ఇదో 'రొటీన్ హేమరింగ్' అంటూ నిర్లక్ష్యం చేస్తున్నవాళ్లూ అలసత్వం ప్రదర్శించేవాళ్లూ ఉన్నారు.ఈ తరహా విద్యార్థులు ఇక్కడ నేను ప్రస్తావిస్తున్న నిపుణుల వ్యాఖ్యల్ని తప్పక గమనిస్తారని భావిస్తున్నాను. ఐఐయం బెంగుళూరుకు చెందిన
'సైకోథెరపి కౌన్సిలర్',' “Soft Skills: Interpersonal & Intra-personal Skills Development” గ్రంథ రచయిత్రి సీమా గుప్తా మాట్లాడుతూ వ్యక్తులందరికీ 'సైకో-సోషల్ ఎబిలిటీస్' సమకూర్చగలిగేది ఒక్క సాఫ్ట్ స్కిల్స్ మాత్రమే అంటారు. సాఫ్ట్ స్కిల్స్ ద్వారా మాత్రమే విద్యార్థులకు 'సరియైన నైపుణ్య సముదాయ (Right Set Of Skills)” లభ్యత జరుగుతుందంటారు బిట్స్ పిలానీ ఆచార్యులు “ Soft Skills: An Integrated Approach to maximize Personality” గ్రంథ కర్త గజేంద్ర సింగ్ చౌహాన్. ఏ అకడమిక్ సంస్థైనా తమ వద్ద ప్రవేశం తీసుకున్న విద్యార్థులందరికీ 360-డిగ్రీల విద్యనందించగలగాలని, ఇది సాఫ్ట్ స్కిల్స్ బోధన ద్వారా మావిద్యనుత్రమే సాధ్యమంటారు అమెరికాలోని 'వెస్టర్న్ కెంటకీ విశ్వవిద్యాలయం ఆచార్యులు,లైఫ్ కోచ్'Soft Skills for Everyone పుస్తక రచయిత జెఫ్ బట్టర్‌ఫీల్డ్. నిన్ను నువ్వు తెలుసుకుంటూ ప్రపంచాన్ని తెలుసుకోవటానికి సాఫ్ట్ స్కిల్స్ ఎంతగానో ఉపయోగపడతాయంటారు తన విపుల రచన “Soft Skills: Know Yourself And Know The World” లో తిరుచిరాపల్లికి చెందిన డా.కె.అలెక్స్. మరింకెందుకు ఆలస్యం? యువతీ యువకులారా! కాస్త సాఫ్ట్ స్కిల్స్ పై మనసు పెట్టరూ.
గొప్పవని చెప్పిన 'సెల్ టెక్' ను కలుపుకొని ఏ టు జడ్
మదునైపుణ్యాలను అలవరచుకోరూ.
- డా.బెల్లి యాదయ్య, 98483 92690