Sun 13 Feb 02:03:31.099433 2022
Authorization
ఆకాశాన్ని గుప్పిటలో బంధించలేము
సముద్రాన్ని పుక్కిట పట్టలేము
గాలిని దోసిట దాచలేము
నేలను చాపలా చుట్టలేము
అగ్నిని అరచేత ధరించలేము
లత గాన మాధుర్యాన్ని
ఎన్ని లక్షల హృదయ
స్పందనలతోనూ
కొలవలేము
ఒక సూర్యుడు
ఒక చంద్రుడు
ఒక లతఇదంతా నేను ఏది పాడినా వింటున్న ప్రజల అభిమానమే, ఆశీర్వాదమే. వారే లేకుంటే నేనెక్కడీ ఐయామ్ నథింగ్'' అని వినమ్రంగా చెప్పే లత జీవిత సారాంశం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం. 1929 సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పుట్టిన ఆమె స్వరం 2022 ఫిబ్రవరి 5న ముంబైలో మూగవోయింది పుట్టుక, మరణం మాత్రమే ఆమెది. జనన మరణాల మధ్య ఉన్న మధ్య చరిత్ర అంతా దేశానిది.
ఎప్పుడో ముపై ఏండ్ల క్రితం లతా మంగేష్కర్ స్వర సముద్రంలో తలా మునకలుగా మునిగి తూలుతున్నప్పుడు రాసుకున్న ఆ నాలుగుమాటలు గాన వసంతం శాశ్వతంగా శిశిరాన్ని భువికి ప్రసాదించి దివికి వెళ్లిపోయిందన్న వార్త తెలిసాక అనివార్యంగా గుర్తొచ్చాయి. అప్రయత్నంగా దేహాన్నంతా ఒక కన్నీటి చుక్కను చేసి కను కోలాకుల నుంచి జార్చడం తప్ప ఏ అభిమాని అయినా ఆమెకు ఇవ్వగల నివాళి ఏముంటుంది? ఒక వ్యక్త గాన మాధుర్యాన్ని అలవోకగా శ్రోతల హృదయాలలోకి ఒంపగల అనితర సాధ్యమైన ఆల్కెమీ ఏదో ఆమెకు తెలుస . స్వర మంత్ర కవాటాలు తెరచి ప్రతి శ్రోతనూ ఆహ్వానించి ఆమె ఎనభయి ఏండ్లుగా చేసిన ఒక జుగల్బందీ ఆగిపోయిం దంటే చెమ్మగిల్లని నయనం ఉంటుందా ?
లతగా అశేష జనావళి హృదయాలలో ఉన్నత స్థానాన్ని అధిరోహించిన ఆమె హేమగా పుట్టింది. ఇంటిపేరు హర్దీకర్. హర్దీకర్ అంటే పూజలుచేసే అర్చకుడు అని అర్ధం. అసలు వాళ్ళ స్వస్థలం గోవా లోని మంగేషి. ఆమె పుట్టేనాటికే తండ్రి దీనానాధ్ బాగా పేరున్న నటుడు. ఆయన వేసే నాటకాలలో భావ బంధన్ బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నాటకం. అందులో ఒక పాత్ర పేరు లతికా. ఆ లతికను కాస్తా లత చేసి పూర్వీకుల స్వస్థలమైన మంగేషిని కలిపి హేమను లతా మంగేష్కర్ చేసాడు దీనా నాధ్. తల్లి గుజరాతీ, తండ్రి మరాఠీ. ఆమె హిందీ సంగీత సామ్రాజ యాన్ని ప్రపంచాన్ని అప్రతి హతంగా పాలించింది.
''ఈ సుదీర్ఘ ప్రయా ణం అంతా నాకు గుర్తుంది. ఆ నటి చిన్నారి లత నాలో ఇంకా అలాగే వుంది. ఆమె ఎక్కడికీ పోలేదు కొంతమంది నన్ను సరస్వతిగా భావిస్తారు. ఆ తల్లి ఆశీస్సులు నాకు వున్నాయి అంటారు. ఇంకా ఏవేవో చెప్తారు. కానీ ఇదంతా నేను ఏది పాడినా వింటున్న ప్రజల అభిమానమే, ఆశీర్వాదమే. వారే లేకుంటే నేనెక్కడీ ఐయామ్ నథింగ్'' అని వినమ్రంగా చెప్పే లత జీవిత సారాంశం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం. 1929 సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో పుట్టిన ఆమె స్వరం 2022 ఫిబ్రవరి 5న ముంబైలో మూగవోయింది పుట్టుక, మరణం మాత్రమే ఆమెది. జనన మరణాల మధ్య ఉన్న మధ్య చరిత్ర అంతా దేశానిది.
లత పదమూడేండ్ల వయసులో 1942లో తండ్రి దీనానాధ్ మంగేష్కర్ హఠా త్తుగా మరణించడంతో కుటుస్త్ర బభారం అంతా ఆమె మీదే పడింది. ఆ భాధ్యతను ఇష్ట పూర్తిగా స్వీకరించిన ఆమె తండ్రి మరణించిన సంవత్స రమే మాస్టర్ వినాయక్ తన మంగళ గౌరీ అనే మరాఠీ చిత్రంలో కధానా యకురాలి చెల్లెలు పాత్రకు ఆమెను ఎంపిక చేసాడు. అందులో ఆమె రెండు పాటలు కూడా పాడింది. ఆ తరువాత మరికొన్ని చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో నటించింది కానీ ఆమె ద్యాస అంతా పాట మీదే ఉండేది. తండ్రి చనిపోతూ నువ్వు దేశం గర్వించే గొప్ప నాయకురాలివి అవుతావు అని చెప్పిన మాట ఆమె హృద యంలో నాటుకు పోయింది. ఆమెకు గావన్. మాస్టర్ వినాయక్ 1948లో దేహ యాత్ర ముగించడంతో ఆమె 1948లోనే అవకాశాలు వెతు క్కుంటూ ముంబై చేరుకుంది. నూర్జహాన్, సురయా అప్పటికే ప్రసిద్ధ గాయనులుగా ఒక వెలుగు వెలుగు తున్నారు. వాళ్ళని చిత్ర సీమకు పరిచయం చేసిన గులాం హైదర్ దృష్టి లత మీద పడింది. ఆమె గాత్రం, పట్ల ఆయనకు గొప్ప నమ్మకం. లత గొంతు పీలగా వుంది. సినిమాకు ఆమె పనికి రాదు అని కొంత మంది సంగీత దర్శకులు అంటే ''ఏదో ఒక రోజు నిర్మాతలు, దర్శకులు ఆమె ఇంటి ముందు క్యూ కడతారు. తమ చిత్రంలో పాడమని పాదాలు పట్టుకుని బతిమాలతారు. చూస్తూ వుండండి'' అని జోస్యం చెప్పారు. తండ్రి ఆశీర్వాదం, గులాం హైదర్ నమ్మకం వృధాగా పోలేదు.
మరాఠీ గొంతులో ఉర్దూ, ఉర్దూలా ఎలా వినిపిస్తుంది అన్న దిలీప్ కుమార్ సందేహానికి జవాబుగా అనిల్ బిస్వాస్ అసిస్టెంట్ షఫీ దగ్గర ఉర్దూ నేర్చుకుంది. దిల్ మేరా తోడా, ముఝే కహీ కా నా చోరా పాటతో లతకు మొదటి హిట్ ఇచ్చారు హైదర్. 2013లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన ప్రతిభపై తన కంటే ఎక్కువ నమ్మకాన్ని ఉంచిన వ్యక్తి హైదర్ అని ఆమె కృతజ్ఞతగా స్మరించుకుంది
దేశ విభజన నేపధ్యంలో నూర్జహా పాకిస్థాన్ వెళ్లి పోయారు. సురయా వ్యక్తిగత ఇబ్బందులలో పడిపోయింది. షంషాద్ బేగం పారితోషికం ఎక్కువ కావడంతో నిర్మాతల దృష్టి అనివార్యంగా లత మీద పడింది. ఖేమచంద్ ప్రకాష్ మహల్ సినిమాలో ''ఆయేగా ఆనేవాలా ఆయేగా'' అనే పాటను లతతో పాడించారు. ఆ పాటకు ఆమె ఎన్ని టేకులు తీసుకుందో చెప్పలేము. కానీ సినిమా విడుదల అయిన తరువాత ఆ పాటలో లత గాత్రము, మధుబాల నటన ఒక మ్యాజిక్ చేసి ఒక చరిత్రనే సృష్టించాయి. మహల్ విడుదల అయిన సంవత్సరమే అందాజ్, బర్సాత్ కూడా రిలీజ్ అయి లత మార్క్ గానానికి తలుపులు తెరిచాయి. అన్ని వైపులా నుంచీ పాట ఆమెను ఆహ్వానించింది.
గొప్ప గొప్ప సంగీత దర్శకులకు లత ప్రిఫరెన్షియల్ షేర్ అయింది. సి రామ చంద్ర ఆమెతో ''ధీరే సి ఆజారే'' అని హృదయ మనోహరంగా పాడించాడు. హేమంత్ కుమార్'' మన్ డోలే మేరా తన్ డోలే'' అని నాగినిలో పాడించాడు. సలీల్ చౌదరి, ఖయ్యం, రవి, సజ్జద్ హుస్సేన్, రోషన్, కళ్యాణ్ జీ-ఆనంద్ జీ, వసంత్ దేశారు, సుధీర్ ఫడ్కే, హన్స్ రాజ్ భేల్, మదన్ మోహన్ ఆమెతో పాడించని సంగీత దర్శకుడు లేడు. ఒక్క ఓ పి నయ్యర్ తప్ప. ''లతా గొంతు కీచుగా, పీలగా ఉంటుంది. నాకు గీతా దత్ లాగా, షంషాద్ లాగా ఉల్లాసవంతంగా వుండే గొంతు కావాలి'' ఐ ఆయనే ఒక చోట చెప్పాడు. ఆ తరువాత 1952లో వచ్చిన ఆస్మాన్‌లో కధానాయకకు కాక మరొక సహనటికి లతతో పండించాలని నయ్యర్ ప్రతిపాదిస్తే లత తిరస్కరించింది. ఓ పి నయ్యర్కి కోపం వచ్చి లతతో ఒక్క పాత కూడా పాడించలేదు ఆమెకు తెలియ కుండానే ఆమె ఒక సంగీత సామ్రాజ్యాన్ని సృష్టించింది. ఆ సామ్రాజ్యంలో ఆమె మహారాణి. ఆమె మాటే శాసనం
''గతంలో పాట పరిమితులలో ఉండేది. ఇప్పుడు లతా వచ్చింది. ఏ స్కేల్లో అయినా, ఏ రేంజ్లో అయినా
చేయవచ్చు. లతా సంగీత దర్శకులను లిబరేట్ చేసింది. గీతంలో భావం, భావంలో గీతం లతా వల్ల వాళ్ళకి సాధ్యం అయింది'' అని ఆమె గానంలో ఉన్న రహస్యాన్ని తెలుగులో మన్ చాహే గీత్ రాసిన మహమ్మద్ ఖదీర్ బాబు విప్పి చెప్పాడు
ఆమె జీవితం ఒక వ్యక్తిత్వ పాఠం అని ఎందుకు అన్నాను అంటే ఆమె సంగీత ప్రపంచంలో తన పాద ముద్రలు మిగల్చడానికి చాలా కష్టపడింది. అందులో కొన్ని కుట్రలు, కొన్ని నియంతృత్వ పోకడలు ఉంటే ఉండవచ్చు. కానీ యుద్దమ్ లోనూ, ప్రేమ లోనూ అన్నీ ఫెయిర్ అనే భావించాలి. కొన్ని, కొన్ని సార్లు నిర్మాతలు, దర్శకులతో యుద్ధం చేసి మరీ తనకోసం పాటలు పెట్టించుకునేది. ఒక అద్భుతమైన సోలో ఒక రఫీ యో, కిశోర్ కుమారో పాడితే అదే సోలో తనకూ కావాలని ఆమె పట్టు పట్టేది. ''దిల్ జో నా కహే'' , '' రిమ్ జిమ్ గిరే సావన్ '' ఆమె అలా పట్టు పట్టి పాడిన సోలో గీతాలే. రాహుల్ దేవ్ బర్మన్ అనిల్ కపూర్, మనీషా స్టారర్ 1942 ఏ లవ్ స్టోరీలో అన్ని పాటలు కవితా కృష్ణమూర్తితో పాడించారు. ఆ సినిమా విడుదల కాకుండానే ఆర్ డి చనిపోతే ఆ తరువాత నిర్మాత కవితా కృష్ణ మూర్తి ి సారీ చెప్పి కుచ్ న కహో పాటను మళ్ళీ లతతో పాడించారు
తన గాత్రాన్ని క్షణం క్షణమ్ మెరుగు పెట్టుకుంటూనే ఆమె చిత్ర సీమలోని ఇతర అంశాలపై దృష్టి సారించింది. ఆ రోజులలో గ్రామఫోన్ రికార్డులపై నేపధ్య గాయకుల పేర్లు వేసేవాళ్ళు కాదు. పాడింది అంటూ ఆ చిత్రంలో నటించిన నటుల, నటీమణుల పేర్లు వేసే వాళ్ళు. పైగా పాట పాడినందుకు ఇచ్చే రెమ్యూనరేషన్ తప్ప రాయల్టీ వచ్చేది కాదు. ఈ రెండు అంశాల మీదా దృష్టి పెట్టిన ఆమె ఒక పెద్ద ఉద్యమమే చేసింది. ఆ ఉద్యమంలో కలసి రానందుకు
ఆమె మహమ్మద్ రఫీతో మూడేండ్ల పాటు పాట కాదు కదా మాట కూడా మాట్లాడలేదు. డబ్బు కోసం ఏ పాట పడితే ఆ పాట పాడలేదు. పాట తనలో భాగం అనుకున్నది కనుక తన పాట కూడా తనంత స్వచ్ఛంగా, శుభ్రంగా ఉండాలి అనుకుంది. రాజ్ కపూర్ మొహమాట పెట్టి, బలవంతం చేసి '' మై క్యా కరూ రామ్ ముఝే బుడ్డా మిల్ గయా పాడిస్తే ఆ పాట పాడినందుకు తనను తాను జీవితాంతం క్షమించుకోలేదు. రాజ్‌కపూర్‌ను క్షమించలేదు
1964లో తెలుగులో విజయవంతం అయిన ఎన్టీఆర్, సావిత్రిల ''నాదీ ఆడ జన్మే'' సినిమాను హిందీలో '' మై భీ లడ్కీ హు'' పేరుతో హిందీలో తీశారు. ఆ సినిమాలో విజయవంతం అయిన ''చిన్నారి పొన్నారి పువ్వూ, నిను చూసి నను చూసి నవ్వు ''అన్న పాటను లతతో పాటు దక్షిణాది ప్రముఖ గాయకుడు పి.బి శ్రీనివాస్‌తో పాడించాలని సంగీత దర్శకుడు, నిర్మాత అనుకున్నారట. దానిని ఆమె వ్యతిరేకించింది. ''ఒక మద్రాసీ గొంతులో హిందీ ఎలా పలుకుతుంది? అతడితో నేను పాడటమా?'' అని అగ్గి మీద గుగ్గిలం అయిందట. ఆ సినిమాలో ధర్మేంద్ర హీరో. న్యాయంగా అయితే ధర్మేంద్రకి రఫీ పాడాలి. కానీ రఫీకి, లతా కి మాటల్లేవు'' ఏం చేయమంటారు మేడం. మీరు రఫీ కలసి పాడటం లేదు కదా అని సంగీత దర్శకుడు నసిగితే, '' రఫీ లేకపోతే ముఖేష్ లేరా? మన్నాడే లేరా''? అని ఆమె ప్రశ్నించిందట. ఒకప్పుడు దిలీప్ కుమార్ మరాఠీ గొంతులో ఉర్దూ ఎలా పలుకుతుంది అని తనను అన్న మాట ఆమె మర్చి పోయి ఉంటుంది. అయిష్టంగానే ఆమె పి.బి శ్రీనివాస్‌తో పాడటానికి ఒప్పుకుంది. ఆ పాట '' చందా సి హోగా ప్యారా'' . పాట పాడిన తరువాత లత కి పి.బి సత్తా ఏమిటో తెలిసింది. ఆ తరువాత ఆమె పి.బిని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేసింది కానీ అవేవీ ఫలించినట్టు లేదు. పి.బి శ్రీనివాస్‌కు లతా అంటే చాలా ఇష్టం. అందుకే తన కూతురుకి స్వర లత అని పేరు పెట్టుకున్నాడు. లతా సిల్వర్ జూబ్లీ జరిగినప్పుడు
''సప్త స్వర సుందరి'' శీర్షికతో ఒక ప్రశంసా గీతం రాసి రికార్డ్ చేసి ఆమె పంపించాడట. ఇదంతా ప్రముఖ కాలమిస్ట్ ఎంబీఎస్ హాసం పత్రికలోనో. మరెక్కడో రాస్తే చదివాను నేను. దక్షిణాది గాయకులు ఎవరూ ఉత్తరాదిన నిల దొక్కుకోలేదు. తదనంతర కాలంలో ఒక్క ఎస్.పి. బాలసుబ్రహమణ్యం తప్ప. బాలు నిలదొక్కుకోవడంలో కూడా బాలూ ప్రతిభ కంటే బాలూలో వున్న ఎక్కడ ధూపం అక్కడ వేసే లౌక్యమే ఎక్కువ పనిచేసింది అనుకుంటాను
సి. రామచంద్ర మొదట్లో లతను ఇష్టపడ్డాడు అని ఒక రూమర్ ఉంది అదెంత నిజమో తెలియదు. అలాగే ఆమె అప్పట్లో ప్రముఖ క్రికెటర్ రాజ్ సింగ్ దుంగార్‌పూర్‌ని ఇష్టపడిందనీ ఆ ఇష్టం కాస్తా పెళ్లి దాకా వచ్చేసరికి రాజ్ సింగ్ దుంగార్పూర్ ఇంట్లో ''ఒక పాటలు పాడే స్త్రీ''ని కోడలుగా తెచ్చుకోవడానికి ఇష్టపడలేదని పైగా ఆమెను అడ్డు తొలగించుకోవడానికి స్లో పాయిజనింగ్ చేయించారని కూడా చాలా వదంతులు వున్నాయి. కానీ వాటిలో నిజా నిజాలు తెలియదు. కాక పోతే లతా, రాజ్ సింగ్ దుంగార్పూర్ ఇద్దరూ జీవితాంతం అవివాహితులుగానే మిగిలి పోవడం ఆ వదంతులలో నిజం ఉన్నదేమో అన్న అనుమానం కలిగించే వాస్తవం. లతా స్వరం మీద విష ప్రయోగం జరిగినప్పుడు ఆమెకు అండగా నిలబడింది మజ్రుహు సుల్తాన్ పురీ. ఆయన సేవలవల్లే ఆమె త్వరగా కోలుకుంది. ప్రతి సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లి ఆమె కధలూ, కవిత్వమూ వినిపించి ఆమె డిప్రెషన్లోకి వెళ్లకుండా చూసేవాడు. ఆ నాలుగు రోజులూ ఆమె ఇచ్చే ఆహారాన్ని తాను టెస్ట్ చేశాకే ఆమెకు ఇచ్చేవాడు . అలా ఒకసారి మృత్యువును జయించిన లతా ఇప్పుడు కరోనాను మాత్రం జయించలేక పోయింది
1978లో రాజ్ కపూర్ దర్శ కత్వంలో వచ్చిన ''సత్యం శివం సుంద రం'' సినిమాలో టైటిల్ సాంగ్ సత్యం శివం సుందరం ఆ సంవత్సరంలోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది.
1970వ దశకం చివర్లో, 1980వ దశకం మొదట్లో ఆమె రెండవ తరం సంగీత దర్శ కులతో పనిచేశారు. 60ల నాటి ప్రముఖ స్వరకర్తల కుమారు లతో 80లలో ఆమె ఎన్నో హిట్ పాటలకు పనిచేశారు. రాహుల్ దేవ్ బర్మన్ (సచిన్ దేవ్ బర్మన్ కొడుకు), రాజేష్ రోషన్ (రోహన్)
- వంశీకృష్ణ, 9573427422