Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఏటీఎం కార్డులు మార్చి నగదు స్వాహా..వ్యక్తి అరెస్ట్‌
  • కామారెడ్డి‌...ఇండ‌క్యా‌ష్ ఏటీఎంలో చోరీ
  • ఆపరేషన్‌ చేసి కుట్లు మరిచారు
  • ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మనుగడ కోల్పోతున్న మానవుని ఆదిమ ఆవాసాలు | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

మనుగడ కోల్పోతున్న మానవుని ఆదిమ ఆవాసాలు

Sun 20 Mar 06:55:01.192225 2022

            మానవ మనుగడకు సంబంధించిన తొలి అడుగుల ప్రస్థానం అడవుల నుండే ప్రారంభమైంది. సృష్టి ఆరంభం నుండి మానవునితో పాటు, జీవకోటి మనుగడ ఎంతో విలువైన పాత్రను పోషించిన అడవులు మునుపెన్నడూ లేనంత సంకటస్ధితిని ఎదుర్కొంటున్నాయి. మానవ నాగరికతల నిర్మాణంలో ఎంతో విలువైన పాత్రను పోషించిన అడవులు ఆధునిక మానవుని వినియోగ దృష్టి సోకి అత్యంత వేగంగా అంతరించి పోతున్నాయి. సమస్త జీవరాశికి ప్రాణవాయువులు అందించిన అడవులు నేడు తమ ఆయువును కోల్పోయే దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. అత్యంత పురాతనమైన జీవవైవిధ్య కేంద్రాలుగా పరిఢవిల్లిన అరణ్యాలు నేడు జీవరహిత కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఇదే విధానం ఇలాగే కొనసాగితే అడవులను కోల్పోయిన భూమి బిడ్డల్ని కోల్పోయిన గొడ్రాళ్లుగా మారిపోక తప్పదు.

అందాల తనువెల్ల వంపుకున్న అడవి

అలరించి తలపించె ఆకు పచ్చని కడలి
నిడివన్నెదె లేని నీలి గగనం కింద
పారుటాకుల వలువ పంచుతున్నది సలువ
- గోరటి వెంకన్న

            ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు అనుసరిస్తున్న విధ్వంసకర ఆర్ధిక అభివృద్ధి విధానాలే ప్రకృతి, పర్యావరణం, సహాజవనరుల ఎదుర్కొంటున్న దుస్థితికి కారణం. ఏ మాత్రం ముందు చూపు లేకుండా అభివృద్ధి పేరుతో ప్రపంచ దేశాలు కొనసాగిస్తున్న విధ్యంసం వల్ల లక్షలాది ఎకరాల్లో అడవులు ధ్వంసమయ్యాయి. కోట్లాది జీవుల మనుగడకు ప్రశ్నార్ధమయ్యింది. సహాజవనరులన్నీ తమ సహాజత్వాన్ని కోల్పోయి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడానికి ఏటా వేలాది ఎకరాల్లో అడవులు నరికివేతకు గురవుతున్నాయి. మానవుని ఆహార అవసరాలు తీర్చడానికి వేల ఎకరాల్లో అడవులను ధ్వంసం చేసి వాటిని వ్యవసాయ క్షేత్రాలుగా మార్చి వేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి ఇబ్బడిముబ్బడిగా రసాయిక ఎరువులు వినియోగించటం వల్ల పర్యావరణ పరిరక్షణలో, మానవ మనుగడలో ఎంతో విలువైన పాత్రను పోషించిన వృక్ష, జంతు జాతులు నశించిపోయాయి. పారిశ్రామికీకరణ, నగరీకరణ, ప్రాజెక్టుల నిర్మాణం, రైల్వే, రోడ్డు నిర్మాణాల వంటి కార్యక్రమాల వల్ల ప్రపంచవ్యాప్తంగా అడవులన్నీ ధ్వంసమైపోతున్నాయి. 1990 నుండి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 420 మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అడవులు అంతరించిపోయాయని గ్లోబల్‌ ఫారెస్ట్‌ అసెస్‌మెంట్‌ తాజా నివేదిక తెలియచేస్తుంది. మానవుని స్వార్ధపూరిత చర్యల వల్ల ప్రతి సంవత్సరం 10 మిలియన్‌ హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అడవులు అంతరించి పోతున్నాయి. పర్యావరణాన్ని రక్షించాల్సిన ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయకపోవటం వల్లే అడవులు నేడు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నాయని పర్యావరణవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. వేలాది ఎకరాల్లో ఉన్న అటవీ భూములను కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టటం వల్ల ఆ అడవుల మీద ఆధారపడి బతికే జీవులు, ఆదివాసులు తమ ఆవాసాన్ని కోల్పోతున్నారు. నిత్యం కార్పొరేట్‌ శక్తుల యంత్రాల పదఘట్టనల కింద అనంతమైన జీవరాశికి ఆలవాలమైన అడవులు నలిగి నశించిపోతున్నాయి. రాజకీయ నాయకుల అభివృద్ధి విధానాలను ఆలస్యంగా అర్ధం చేసుకున్న ప్రజలు చేసిన పోరాటాల ఫలితంగా ప్రభుత్వాల వైఖరిలో కాస్త మార్పు వచ్చింది. తత్ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు అడుగులు పడ్డాయి. తమ జీవితాలతో, జీవన విధానంతో ముడిపడిన అడవులను కాపాడుకోడానికి నేటికీ ప్రపంచవ్యాప్తంగా నేడు పెద్దయెత్తున పోరాటాలు జరుగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణలో అడవులు పోషించే పాత్రను గుర్తించిన ఐక్యరాజ్యసమితి ప్రజలలో అడవుల సంరక్షణ పట్ల అవగాహాన కల్పించడానికి ఏటా మార్చి 21వ తేదిన ప్రపంచ దేశాలన్నీ అటవీ దినోత్సనాన్ని నిర్వహించాలని 2012వ సంవత్సరం నవంబర్‌ 28న ఒక తీర్మానం చేసింది, దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవం నిర్వహిస్తున్నారు.
భారతదేశంలో అడవుల అభివృద్ధి...
            ఏ దేశానికైనా అడవులు ప్రకృతి ప్రసాదించిన వరం. దేశ విస్తీర్ఱంలో సుమారు 33 శాతం భూభాగంలో అడవులు ఉంటే ఆ దేశంలో పర్యావరణ సమతుల్యత ఉంటుంది. అడవుల విస్తీరణం ఆయా దేశాల్లోని భౌగోళిక, వాతావరణ పరిస్థితులనై ఆధారపడి ఉంటుంది. వర్షపాతం, ఉష్ణోగ్రతలతో పాటు ఆర్ధిక అభివృద్ధిలో కూడా అడవులు చాలా విలువైన పాత్రను పోషిస్తాయి. మన దేశంలో వాతావరణ పరిస్థితులు అన్ని ప్రాంతాలలోను ఒకేలా ఉండవు. అందువల్ల అడవులు, వృక్ష సంపద వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. భారతదేశ సహాజ వృక్ష సంపద ఉష్ణ, సమశీతోష్ణ మండల రకానికి చెందినది. భారతదేశంలో అడవులను ప్రధానంగా సతత హారితారణ్యాలు, ఆకురాల్చే అడవులు, సమశీతోష్ణ అడవులు, మడ అడవులు, చిట్టడవులు, పర్వత ప్రాంత అడవులుగా వర్గీకరిస్తారు.
            భారతదేశంలో మొదటి అటవీచట్టం స్వాతంత్య్రానికి ముందు బ్రిటీషు వలస పాలన కాలమైన 1927లో రూపొందింది. స్వాతంత్య్రానంతరం భారతదేశం 1952లో మొదటి జాతీయ అటవీ విధానానికి రూపకల్పన చేసింది. ఈ అటవీ విధానం పర్యావరణ పరిరక్షణకు అంతగా ప్రాధాన్యతను ఇవ్వలేదు. కేవలం అడవులను పెంచడం ద్వారా లభ్యమయ్యే కలపను, ఇతర అటవీ ఉత్పత్తులను పారి శ్రామిక, నగరీకరణ అవసరాలకు ఎలా వినియో గించు కోవాలన్న లక్ష్యంతోనే ఈ విధానం పని చేసింది. అడవులను విని యోగించుకో వటంతో పాలు వాటిని సంర క్షించు కోడానికి వీలుగా 1980 లో భారత అటవీ చట్టం చేయ బడింది. దీని ప్రకారం దేశంలో తరిగిపోతున్న అటవీ వనరులను సంరక్షించు కోవ టంతో పాటు, కోల్పో యిన అడవు లను తిరిగి పునరుద్ధ రించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టా లని రాష్ట్ర ప్రభుత్వాలకు భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం అడవులు ఉండేలా అడ వులను అభివృద్ధి చేయాలని ఈ చట్టం తెలియ చేస్తుంది. ఆ తర్వాత మరింత సమర్ధవంతంగా అడవులను రక్షించడానికి 1952 అటవీ విధానంలో లోపాలను సరిచేస్తూ 1988లో నూతన జాతీయ అటవీ విధానాన్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అడవుల సంరక్షణకు భారత రాజ్యాంగంలో కూడా కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. అడవులను జాతీయ సంపదగా భావించిన భారత రాజ్యాంగం అటవీ పరిరక్షణ అంశాన్ని ఉమ్మడి జాబితాలో ఉంచింది. దీని ప్రకారం అడవుల సంరక్షణ అనేది కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి బాధ్యత. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా అటవీ భూములను ఇతర అవసరాలకు వినియోగించే అధికారం రాష్ట్రాలకు లేదు. ఎన్ని చట్టాలు చేసినా పాలకులలో చిత్తశుద్ధి లేకపోతే ప్రయోజనం శూన్యం. భారతదేశంలో ఏటా లక్షల ఎకరాల్లో అడవులు ధ్వంసమై పోతున్నాయి. బాక్సైట్‌ వంటి ఖనిజ లోహాలను వెలికి తీయడానికి, పారిశ్రామిక అవసరాలు తీర్చడానికి అటవీ భూములను విదేశీ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారు. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు అనేక పోరాటాలు చేస్తున్నారు. నిజానికి భారతదేశ విస్తీర్ణం ప్రకారం దేశం భూభాగంలో 700 నుండి 800 లక్షల హెక్టార్లలో అడవులు ఉండాలి. అయితే వాస్తవంలో కేవలం 680 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం మాత్రమే మనకు ఉంది. ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం గడిచిన రెండు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 2,261 చదరపు కిలో మీటర్ల మేర అడవుల విస్తీర్ణం పెరిగిందని తెలిపింది. దీంతో దేశ భౌగోళిక విస్తీర్ణంలో 24.62 శాతం అడవుల విస్తీరణం పెరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశంలో అడవుల అభివృద్ధి చెందాల్సిన 33 శాతానికి ఇంకా ఆమడ దూరంలోనే ఉంది.
సగం అడవులన్నీ ఐదు దేశాల్లోనే...
            సుమారు 4 బిలియన్‌ హెక్టార్ల విస్తీర్ణంలో భూమ్మీద అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లో సగానికి పైగా ఐదు ప్రధాన దేశాల్లో విస్తరించి ఉన్నాయి. భూమ్మీద ఉన్న మొత్తం అడువుల్లో సగానికి పైగా అంటే సుమారు 54శాతం అడవులు రష్యా, బ్రెజిల్‌, కెనడా, అమెరికాతో పాటు చైనాలో విస్తరించి ఉన్నాయి. రష్యా తన మొత్తం భూభాగంలో సుమారు 815 మిలియన్‌ హెక్టార్లలో అడవిని కలిగి ఉంది. రష్యా భూభాగంలో సుమారు 45 శాతం భూభాగంలో అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం కలిగిన దేశాల్లో రష్యా మొదటిస్ధానంలో ఉంది. అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన దేశాల్లో రష్యా తర్వాత బ్రెజిల్‌ రెండస్ధానంలో ఉంది. బ్రెజిల్‌ తన భూభాగంలో 497 మిలియన్‌ విస్తీర్ణంలో అడవులున్నాయి. 347 మిలియన్‌ హెక్టార్లలో అడువులని కలిగి ఉన్న కెనడా అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన దేశాల జాబితాలో 3వ స్ధానంలో ఉంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం అడవులో 9 శాతం వాటా కెనడా కలిగి ఉంటుంది. మొత్తం తన భూభాగంలో 310 మిలియన్‌ హెక్టార్లు అటవీ విస్తీర్ణం కలిగి అమెరికా నాలుగవ స్ధానంలో నిలబడింది. ఆ తర్వాతి స్ధానాల్లో చైనా (220 మి.హె.), ఆస్ట్రేలియా (134 మిలియనం హెక్టార్లు), భారత్‌ (72 మిలియన్‌ హెక్టార్లు) తర్వాతి స్ధానాల్లో కొనసాగుతున్నాయి.
అటవీ పునరుద్దరణలో భారత్‌కు మూడవ స్ధానం...
            ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న అడవులను తిరిగి పునరుద్ధరించడానికి అనేక దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. వివిధ దేశాలు చేస్తున్న కృషి ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెరుగుతుందని ఆయా దేశాలు ప్రకటిస్తున్న తాజా లెక్కల వల్ల తెలుస్తుంది. అడవులను పునరుద్ధరిం చటంలో ముందుకు వెళుతున్న దేశాల జాబితాలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. గడిచిన రెండు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 2, 261 చదరపు కిలో మీటర్ల మేర అడవుల విస్తీర్ణం పెరిగిందని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా రూపొం దించిన ఇండియా స్టేట్‌ ఫారెస్ట్‌ సర్వే రిపోర్టు తెలియచేస్తుంది. దీంతో భారతదేశం మొత్తం భూభాగంలో 80.9 మిలియన్‌ హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయిని, ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో 24.62 శాతమని ఆ నివేదిక తెలిపింది. దేశంలో అటవీ విస్తీర్ణం అధికంగా కలిగిన రాష్ట్రాలలో మధ్యప్రదేశ్‌ మొదటిస్ధానంలో ఉండగా, అరుణాచల్‌ ప్రదేశ్‌ రెండవ స్ధానంలో, చత్తీస్‌ఘడ్‌ మూడు, ఒడిశా నాలుగు, మహారాష్ట్ర ఐదవ స్ధానాల్లో ఉన్నాయి. దేశంలో తీరప్రాంతాల జీవావరణ వ్యవస్ధలో ఎంతో విలువైన పాత్రను పోషించే మడ అడవుల విస్తీర్ణం పెరిగింది. దేశంలో మడ అడవుల విస్తీర్ణం 4, 992 చదరపు కిలోమీటర్లు కాగా, గడిచిన రెండు సంవత్సరాలలో సుమారు 17 చదరపు కిలోమీటర్ల మేర మడ అడవుల విస్తీర్ణం పెరిగిందని ఆ నివేదిక తెలియచేస్తుంది.
అడవులను పెంచటంలో తెలుగు రాష్ట్రాలే టాప్‌...
            భారత ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా అడవుల విస్తీర్ణం పెరిగిన రాష్ట్రాలలో రెండు తెలుగు రాష్ట్రాలు తమ సత్తా చాటుకున్నాయి. అడవుల సంరక్షణతో పాటు, మొక్కలు నాటే కార్యక్రమాలు పెద్దయెత్తున్న చేపట్టటం వల్ల ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలలో అడవుల విస్తీర్ణం పెరిగిందని ప్రభుత్వాలు ప్రకటించాయి. గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 747 చదరపు కిలోమీటర్ల పరిధిలో అడవులు పెరిగాయని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా రూపొందించిన ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్టు 2021 తెలియచేస్తుంది, తెలంగాణాలో 632 చదరపు కిలోమీటర్లు , ఒడిశాలో 537 చదరపు కిలోమీటర్ల మేర అడవులు పెరిగాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అడవుల పెరిగిన రాష్ట్రాల జాబితాలో ఎపి మొదటి స్థానంలో ఉంటే తెలంగాణా రెండవ స్ధానంలో, ఒడిశా మూడవ స్ధానంలో ఉంది. తెలంగాణాలో 33.23 శాతం ఉన్న అడవులు 35.66 శాతానికి పెరిగాయని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తాజా నివేదిక అంచనా వేసింది. దీంతో తెలంగాణా రాష్ట్రంలో దట్టమైన అడవులు 150.05 చదరపు హెక్టార్లు ఉండగా, మధ్యస్త అడవులు 3, 244.05 చదరపు హెక్టార్లు, మైదానపు అడవులు 2, 349.12 చదరపు కిలోమీర్ల మేర విస్తరించి ఉన్నాయని ఆ నివేదిక తెలియచేస్తుంది. 2019తో పోలిస్తే తెలంగాణాలో 3.01 శాతం అటవీ విస్తీర్ణం పెరిగింది.
కర్బన శోషిత కేంద్రాలుగా అడవులు...
            విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న అడవులను భూమికి ప్రకృతి ప్రసాదించిన శ్వాసకోశ అవయవాలుగా పర్యావరణవేత్తలు అభివర్ణిస్తారు. సమస్త జీవరాశి విడుదల చేసిన కార్బన్‌ డై ఆక్సైడ్‌ అనే హరితగృహా వాయువును పీల్చుకుని, జీవరాశి మనుగడకు అతి ముఖ్యమైన ఆక్సిజన్‌ను విడుదల చేయటంలో అడవుల పాత్ర ఆపారమైనది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులు ఏటా 2.9 మిలియన్‌ టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ను శోషించుకుంటాయని ఒక అంచనా. భూమి ఉష్ణోగ్రతలను విపరీతంగా పెంచటంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ పాత్ర చాలా ఎక్కువ, ఈ వాయువును పెద్దయెత్తున్న పీల్చుకోవటం ద్వారా భూ ఉష్ణోగ్రతలను తగ్గించటంలో అడవులు క్రియాశీల కంగా పనిచేస్తాయి. భూ ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల కోట్లాది జీవరాశి యొక్క మనుగడ ప్రమాదంలో పడుతుంది. భూ ఉష్ణోగ్రతలు ఇలాగే పెరిగితే రానున్న 50 సంవత్సరాలలో మూడింత ఒక వంతు జంతు వృక్షజాతులు అంతరించి పోయే ప్రమాదముందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మనుగడ సాగిస్తున్న జీవరాశులలో 2070 నాటికి ఇప్పుడు జీవిస్తున్న జంతు, వృక్ష జాతుల్లో మూడవ వంతు జీవులు శాశ్వతంగా కనుమరుగై పోతాయని వారు హెచ్చరిస్తున్నారు. మరొకపక్క భూ ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల సముద్రమట్టాలు పెరిగి పెద్దయెత్తున వరదలు సంభవిస్తాయి. ధృవప్రాంతాల్లోని మంచు దిబ్బలు కరిగి ఆ నీరంతా తీరప్రాంతాలను ముంచెత్తుతాయి. ఇదే జరిగితే నదీ తీరప్రాంతాలలో నిర్మితమైన పురాతన నగరాలన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి. కోట్లాది మంది మాతృభూములు కోల్పోయి నిరాశ్రయులుగా మారిపోతారు. ఈ ప్రమాదాన్ని ముందే గ్రహించిన పర్యావరణవేత్తలు భూ ఉష్ణోగ్రతలు తగ్గించటంలో ప్రధాన భూమికను పోషించే అడవుల విధ్వంసాన్ని అరికట్టాలని, కోల్పోయిన అడవులను తిరిగి పునరుద్ధరించడానికి తక్షణమే తగిన చర్యలు చేపట్టాని ప్రపంచ దేశాలకు హితవు పలికారు. అడవుల విధ్వంసాన్ని అరికట్టకపోతే జీవ మనుగడతో పాటు, మానవ మనుగడ కూడా ప్రశ్నార్ధకమవుతుందని, అడవులను రక్షించుకోడానికి ప్రపంచదేశాలన్నీ ఉమ్మడి కార్యాచరణను రూపొందిచు కోవాలని క్యోటో వాతావరణ సదస్సు తీర్మానం చేసింది. కానీ ఆర్ధిక ప్రయోజనాల మిషతో ప్రపంచ దేశాలు అడవులను సంరక్షించటంలో చిత్తశుద్ధిని కనబరచకపోవటం వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా 13 మిలియన్‌ హెక్టార్లలో ఉన్న అడవులు క్షీణిస్తున్నాయి. పశ్చిమ ఆఫ్రికా వంటి దేశాలలో 90 శాతం అడవులు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుంటే, దక్షిణ ఆసియా ప్రాంతంలో సతత హరిత అరణ్యాలు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ భూభాగంలో 50 ఏళ్ల క్రితం 14 శాతం ఉన్న సతత హారితారణ్యాలు ఇప్పుడు కేవలం 6 శాతం మాత్రమే మిగిలి ఉన్నాయని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2090 నాటికి సతత హారితా రణ్యాలు పూర్తిగా అంతరించి పోయే ప్రయాదముంది.
చైనాలో 'ప్లాంటింగ్‌ హాలిడే'
            పర్యావరణ పరిరక్షణలో అడవులు పోషించే విలువైన పాత్రను గుర్తించిన ప్రపంచదేశాలు సామాజిక అడవులను పెంచటంపై ప్రత్యేక దృష్టి సారించాయి. చైనా తన ప్రజలను అడవుల పునరుద్ధరణలో భాగస్వాములు చేయడానికి వినూత్నంగా ప్రవేశపెట్టిన 'ప్లాంటింగ్‌ హాలిడే' ప్రపంచదేశాలను విశేషంగా ఆకట్టుకుంది. పారిశ్రామిక అవసరాల కోసం భారీస్థాయిలో అటవీ భూములు కోల్పోయిన చైనాలో కొన్ని సంవత్సరాల క్రితం అక్కడి ప్రభుత్వం ఒక ప్రత్యేక నిబంధనను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం దేశంలోని 11 నుండి 60 ఏళ్ల లోపు ఉన్న ప్రతి పౌరుడు ఏడాదికి కనీసం మూడు మొక్కలని నాటాలని నిబంధన విధించింది. మొక్కలు నాటటంతో పాటు, వాటిని సంరక్షించే బాధ్యతను కూడా ప్రజలే తీసుకోవాలని కోరింది. ఈ విధానం ద్వారా 1982 నుండి ప్రతియేటా చైనాలో 1 బిలియన్‌ చెట్లు నాటబడుతున్నాయని చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ చైనాలో మార్చి 12వ తేదిన 'ప్లాంటింగ్‌ హాలిడే'ని నిర్వహిస్తున్నారు. చైనా మాదిరిగా ఇతర దేశాలు కూడా పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగ స్వాములు చేస్తేనే రానున్న రోజుల్లో పర్యావరణాన్ని, అడవు లని, సహాజ వనరులని తిరిగి కాపాడుకోగలుగుతామని పర్యా వరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. భారతదేశంలో జరుగు తున్న మొక్కలు నాటే కార్యక్రమాలు ఒక ప్రహాసనంగా మారి పోయిందన్న అపవాదు ఉంది. కేవలం రాజకీయ నేతల జేబులు నింపుకోడానికే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు, కానీ పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వాలు చిత్తశుద్ధిని ప్రదర్శించటం లేదని పర్యావరణవేత్తలు, సామాజిక కార్య కర్తలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేకపోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణ, అడవుల సంరక్షణ వంటి అంశాలలో చిత్తశుద్ధితో కృషి చేయాలని వారు కోరుతున్నారు.
అడవుల మనుగడ.. మన చేతుల్లోనే...
            అటవీ సంరక్షణలోనే కాదు, పర్యావరణ పరిరక్షణలో కూడా ప్రజల పాత్రే ప్రధానమైనది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణాన్ని రక్షించుకోడానికి ఎంతో మంది పర్యావరణవేత్తలు తమ జీవితాలను, ప్రాణాలను కోల్పోయారు. రేచల్‌కార్సన్‌ వంటి ఉద్యమకారులు తమ రచనల ద్వారా విధ్యంసక అభివృద్ధి నమూనాల వల్ల పర్యావరణం ఎంతగా ధ్వంసమై పోతుందో ప్రజలకు సోదాహరణంగా వివరించారు. ఈ పుస్తకం ద్వారా ప్రజలు చైతన్యమవుతున్నారని గ్రహించిన ఆ దేశ ప్రభుత్వం రేచల్‌ కార్సన్‌ రచించిన సైలెంట్‌ స్ప్రింగ్‌ పుస్తకాన్ని కొంతకాలం నిషేదించింది. భారతదేశంలో పర్యావరణ ఉద్యమాల ప్రస్ధానం అడవులను రక్షించకునే పోరాటాలతోనే ప్రారంభమైంది. 70వ దశకంలో రాజస్ధాన్‌ లో ప్రారంభ మైన బిష్ణోయి ఉద్యమంలో అడవులను కాపాడుకోడానికి అక్కడి ప్రజలు ప్రాణాలకు తెగించి పోరాడారు. బిష్ణోయి తెగకు చెందిన మహిళల నేతృత్వంలో అడవులను, చెట్లను కాపాడుకోడానికి జరిగిన ఈ ఉద్యమంలో సుమారు 363 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. వారి ప్రాణ త్యాగాల ఫలితంగా అక్కడి అటవీ విధ్వంసం ఆగిపోయింది. బిష్ణోయి ఉద్యమం భారతదేశంలో జరిగిన అటవీ మరియు సామాజిక వన సంరక్షణ ఉద్యమాలకు తల్లివేరు వంటింది. ఆ తర్వాత కాలంలో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన చిప్కో ఉద్యమం. కర్ణాటకలో జరిగిన అప్పికో ఉద్యమం, బీహార్‌లో జరిగిన జంగిల్‌ బచావో ఆందోళనలు భారతదేశంలో అటవీ సంరక్షణకు సంబంధించిన అనేక చట్టాల రూపకల్పనకు దోహదపడ్డాయి. కేరళలోని సైలెంట్‌వ్యాలీ ఉద్యమం అభివృద్ధి పేరుతో అడవులను, సహాజవనరులను ధ్వంసం చేయడాన్ని అడ్డుకుంది. వేలాది మంది ప్రజలు సుదీర్ఘకాలం జరిపిన పోరాటం పాలకుల మెడలు వంచింది. ప్రజాగ్రహానికి తలొగ్గిన భారత ప్రభుత్వం ఆనాడు కేరళలోని పశ్చిమ కనుమల్లో నిర్మించ తలపెట్టిన భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని విరమించుకుంది. ప్రపంచంలోనే అత్యంత విస్తారమైన జీవ వైవిధ్య కేంద్రంగా సైలెంట్‌వ్యాలీ నేటికీ కొనసాగుతుందంటే అది అక్కడి ప్రజల పోరాట ఫలితమే. పర్యావరణంలో సంభవించే ఏ విపత్తైనా ప్రస్తుత తరం మీదే కాదు, భవిష్యత్తు తరాల మనుగడపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. భవిష్యత్తు తరాలకు ఒక మంచి పర్యావరణాన్ని, భవిష్యత్తును అందివ్వాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఆ క్రమంలోనే అందరూ అడవులను, సహాజవనరులను, పర్యావరణాన్ని కాపాడుకోడానికి ఉద్యుక్తులు కావాలి. అప్పుడే కోల్పోయిన వనరులను తిరిగి పొందగలుగుతాము.


- డాక్టర్‌ కె. శశిధర్‌,
  94919 91918.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మాదక మత్తుతో తప్పదు ముప్పు
భ‌గ్న‌ ప్రేమికురాలు అలనాటి అందాల తార గాయని సూరయ్య
నేల తల్లిని కాపాడుకుందాం...
న‌ట‌శేఖ‌రుడు కృష్ణ‌
ధరలు ఆకాశంలో... ప్రజలు పాతాళంలో...
సెలవులందు వేసవి సెలవులు వేరయా!!
మనసు కవి.. మన సుకవి.. ఆచార్య ఆత్రేయ
కామ్రేడ్‌ మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య
రంజాన్‌ - రోజా - జకాత్‌
ఎండాకాలం - జాగ్రత్తలు

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:33 AM

ఏటీఎం కార్డులు మార్చి నగదు స్వాహా..వ్యక్తి అరెస్ట్‌

09:21 AM

కామారెడ్డి‌...ఇండ‌క్యా‌ష్ ఏటీఎంలో చోరీ

09:08 AM

ఆపరేషన్‌ చేసి కుట్లు మరిచారు

08:47 AM

ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

08:34 AM

ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

08:25 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:17 AM

నేడు ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితాలు

08:13 AM

భూపాలపల్లి అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం

08:08 AM

జూపలి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు

08:02 AM

కోహ్లి, శ్రేయస్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు...

07:57 AM

జులై 3న అల్పపీడనం...

07:49 AM

బావిలో దూకి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

07:39 AM

గొర్రెల స్కీం పేరుతో 8 కోట్ల మోసం

07:27 AM

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌కు కరోనా పాజిటివ్‌

07:22 AM

సీజ్‌ చేసిన వాహనాల వేలం

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.