Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి అరెస్ట్‌
  • ఏటీఎం కార్డులు మార్చి నగదు స్వాహా..వ్యక్తి అరెస్ట్‌
  • కామారెడ్డి‌...ఇండ‌క్యా‌ష్ ఏటీఎంలో చోరీ
  • ఆపరేషన్‌ చేసి కుట్లు మరిచారు
  • ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
న‌ట‌శేఖ‌రుడు కృష్ణ‌ | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

న‌ట‌శేఖ‌రుడు కృష్ణ‌

Sun 29 May 00:12:42.866495 2022

                 ఆయనలో అందరికీ కనిపించే విషయం ఆయన మంచితనం. నిరాడంబరంగా కనిపించే విధానం. కల్లబొల్లి మాటలు తెలీవు. మాయా మర్మం చేతకాలేదు. మనసులో ఏది అనుకొంటే అది బయటకు చెప్పేయడమే. తన స్టామినా తెలుసు. తన లోపాలూ తనకు తెలుసు. దర్శకుడు చెప్పిన కథ నచ్చకపోతే బాలేదు. ఈ సినిమా పోతుంది.. అని చెప్పేసే తెగువ, మన సినిమా వసూళ్లు బాలేవట గదా... డబ్బాలు రేపే తిరిగొచ్చేస్తాయట కదా.. అని చెప్పగలిగే ధైర్యం కలిగిన అఖండుడు. అసాధ్యుడు. ఉంగరాల జుట్టుతో, ఊరించే కన్నుల అందగాడు ఘట్టమనేని  కృష్ణ‌.. ఆయన హేమహేమీలయిన ఎన్టీఆర్‌, అక్కినేనిలు చలనచిత్ర పరిశ్రమని ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా, పట్టుదలే సోపానంగా, ఓటమే విజయానికి పునాదిగా నమ్మి.. అంచలంచలుగా సూపర్‌స్టార్‌ స్థాయికి ఎదిగిన సుకుమారుడు, నటశేఖరుడు, పద్మవిభూషణుడు కష్ణ. తెలుగు చలనచిత్ర రంగంలో నూతన ఒరవడి సష్టించి, అధునాతన సాంకేతిక విలువలకు పట్టం కట్టి, సినిమాలు నిర్మించి నష్టపోయి, పడిలేచిన కెరటంలా విజంభించి, నాలుగు దశాబ్దాల పాటు తనదైన ముద్రతో 340 పైచిలుకు సినిమాల్లో నటించి అభిమానులను అలరించిన కష్ణ... మే 31న 80వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి నవతెలంగాణ ''సోపతి'' పాఠకుల కోసం ప్రత్యేక కథనం.
                 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు  కృష్ణ‌ జన్మించాడు. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామ కష్ణమూర్తి. (సినిమాల్లోకి వచ్చాక దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు శివరామ  కృష్ణ‌మూర్తి పేరును కష్ణగా కుదించాడు.) కృష్ణ‌ తల్లిదండ్రులకు పెద్ద కొడుకు, అతనికి ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. తల్లిదండ్రులు కష్ణను ఇంజనీరును చేయాలన్న కోరికతో ఇంటర్మీడియట్‌లో ఎం.పి.సి. సీటు కోసం గుంటూరు కళాశాలలో ప్రయత్నించి, అక్కడ దొరకక పోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో చేర్పించారు. అక్కడ మూడు నెలలే చదివిన ఆయన ఏలూరులోని సి.ఆర్‌.రెడ్డి కళాశాలకు మారి, అక్కడ ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి తర్వాత డిగ్రీ పూర్తి చేశాడు. ఏలూరులో సి.ఆర్‌.రెడ్డి కళాశాలలో  కృష్ణ‌ డిగ్రీ చదువుతుండగా నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వర రావుకు పౌరసత్కారం జరిగింది. అక్కడ అక్కినేనికి అభిమానులు పట్టిన నీరాజనాలు, అందించిన గౌరవ సత్కారాలు చూసి, తను కూడా ఒక మంచి నటుడిగా ఎదిగితే ఎంత బాగుంటుంది అనే ఆలోచనలో పడ్డారు. డిగ్రీ పూర్తి చేశాకా ఇంజనీరింగ్‌ కోసం ప్రయత్నించినా  కృష్ణ‌కు సీటు రాలేదు. దాంతో  కృష్ణ‌ విద్యార్థి జీవితం ముగిసింది.
సినిమాల్లోకి...
డిగ్రీ పూర్తై, ఇంజనీరింగ్‌ సీటు రాకపోవడంతో అప్పటికే సినిమాల్లో హీరో కావాలని ఆశిస్తున్న కృష్ణ‌ తన తండ్రి అనుమతి తీసుకుని సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కృష్ణ‌ ఇష్టాన్ని అంగీకరించిన అతని తండ్రి రాఘవయ్య చౌదరి తనకు తెలిసిన సినిమా వారికి పరిచయం చేస్తూ ఉత్తరాలు రాసిచ్చి మద్రాసు పంపాడు. అప్పటి తెలుగు సినీ రంగానికి కేంద్రమైన మద్రాసులో తన స్వంత ప్రాంతమైన తెనాలి పట్టణానికి చెందిన సినీ ప్రముఖులు కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, చక్రపాణి వంటివారిని కలిసి తన ఉద్దేశాన్ని చెప్పాడు. అప్పటికి  కృష్ణ‌ వయసు రీత్యా చిన్నవాడు కావడంతో, కొంతకాలం ఆగి మద్రాసుకు తిరిగిరమ్మని వారు సలహా ఇచ్చారు. దాంతో కృష్ణ‌ నాటకాల్లో నటించి అనుభవం సంపాదించాలని ప్రయత్నిం చాడు. మద్రాసులోనే ''చేసిన పాపం కాశీకి వెళ్ళనా?'' నాటకంలో శోభన్‌బాబుతో కలిసి నటించాడు. తర్వాత గరికపాటి రాజారావు దర్శకత్వంలో ప్రజానాట్యమండలి వారు విజయవాడ జింఖానా మైదానంలో ప్రదర్శించిన 'చైర్మన్‌' నాటకంలో చైర్మన్‌ కుమారుడి పాత్ర పోషించాడు. తిరిగి మద్రాసు వచ్చి ప్రయత్నాలు ప్రారంభించగా ఎల్వీ ప్రసాద్‌ తీస్తున్న 'కొడుకులు కోడళ్ళు' సినిమాలో ఒక పాత్రకు ఎంపిక చేశారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మద్రాసులో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. గంటల తరబడి అద్దం ముందు నిలబడి నటన ప్రాక్టీసు చేయమని స్నేహితులు సలహా ఇస్తే వేషాల కోసం కష్టాలు పడడం ఏమిటి? అదష్టం ఉంటే వేషాలే వెతుక్కుంటూ వస్తాయని కొట్టిపారేసేవాడు. సినిమా ప్రయత్నాలు చేస్తున్న దశలోనూ ఇబ్బందులేమీ పడలేదు. ఎప్పుడు డబ్బు అవసరమైనా ఇంటికి ఉత్తరం రాస్తే,  కృష్ణ‌ తల్లి కావాల్సినంత డబ్బు పంపేది. రోజూ సెకండ్‌ షో సినిమాలు చూస్తూ, పగలు సినిమాల్లో వేషాల కోసం తెలిసిన వారిని కలుస్తూ ప్రయత్నాలు చేశాడు. కొంగర జగ్గయ్య 1962లో నిర్మించిన పదండి ముందుకు సినిమాలో చిన్న పాత్ర పోషించాడు. ఆ తరువాత కులగోత్రాలు, పరువు ప్రతిష్ఠ, మురళీ కృష్ణ‌ సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. 'కాదలిక్క నేరమిల్లై' అన్న తమిళ సినిమా కోసం దర్శక నిర్మాత సి.వి.శ్రీధర్‌ కొత్త నటులను వెతుకుతూ  కృష్ణ‌ను కథానాయకుడిగా ఎంపిక చేశాడు. అయితే  కృష్ణ‌కు తమిళం రాకపోవడంతో ఆ అవకాశం చేజారిపోయింది. దీనితో  కృష్ణ‌ తిరిగి తెనాలి వెళ్ళిపోయాడు. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్ళతో తాను తీస్తున్న 'తేనె మనసులు' సినిమా కోసం కొత్త నటులు కావాలని ఇచ్చిన పత్రికా ప్రకటనకు స్పందించి  కృష్ణ‌ తెనాలి నుంచి తన ఫొటోలు పంపించాడు. పలు వడపోతల తర్వాత కష్ణను మద్రాసు పిలిపించి, స్క్రీన్‌ టెస్ట్‌ చేసి  కృష్ణ‌ను ఇద్దరు కథా నాయకుల్లో ఒకడిగా ఆదుర్తి ఎంపిక చేసి, సంభాషణలు చెప్పడం, డ్యాన్స్‌ చేయడం వంటి పలు అంశాల్లో శిక్షణనిచ్చాడు. దీనితో పాటు ఆదుర్తి తీయబోయే తదుపరి సినిమాలో కూడా నటించేలా కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. కొత్త నటులుగా  కృష్ణ‌, రామ్మోహన్‌, సుకన్య, సంధ్యా రాణి నటించిన 'తేనె మనసులు' సినిమాకి కలర్‌లో చిత్రీకరించిన తొలి తెలుగు సాంఘిక చిత్రంగా కూడా ప్రత్యేకత ఉంది. ఈ సినిమా సాగుతుండగానే రషెస్‌ చూసిన పంపిణీదారులు  కృష్ణ‌ నటన బాగాలేదని తొలగించెయ్యమని ఒత్తిడి తెచ్చినా ఆదుర్తి సుబ్బారావు తన నిర్ణయం మార్చుకోలేదు. 1965 మార్చి 31న విడుదలై విజయం సాధించింది. ఆరు నెలల తర్వాత ఆదుర్తి సుబ్బారావు ప్రారంభించిన 'కన్నెమనసులు' సినిమాలో ముందస్తు ఒప్పందం ప్రకారం తేనె మనసులోని హీరో హీరోయిన్లతో పాటు  కృష్ణ‌ నటించాడు. హీరోగా రెండో సినిమా అయిన కన్నెమనుసుల్లో నటిస్తున్న సమయంలోనే నిర్మిస్తున్న 'గూఢచారి 116' సినిమాలో హీరోగా కష్ణకు నిర్మాత డూండీ అవకాశం ఇచ్చాడు. తేనెమనసులు సినిమాలో స్కూటర్‌తో కారును ఛేజ్‌ చేస్తూ, స్కూటర్‌ను వదిలేసి కారు మీదికి జంప్‌ చేసే సన్నివేశం చూసి, డూప్‌ లేకుండా కష్ణ ఆ సన్నివేశంలో నటించిన సంగతి తెలుసుకున్న డూండీ తన జేమ్స్‌బాండ్‌ చిత్రానికి హీరోగా ఎంపిక చేశాడు. రెండు సినిమాలూ దాదాపు ఒకే సమయంలో చిత్రీకరణ జరుపుకుని, రెండూ 1966లోనే విడదలయ్యాయి. కన్నెమనసులు జూలైలో విడుదలై యావరేజిగా నిలిచింది. ఆగస్టులో విడుదలైన గూఢచారి 116 సినిమా సంచలన విజయం సాధించి  కృష్ణ‌ కెరీర్‌ మలుపు తిప్పింది. ఇది తొలి తెలుగు జేమ్స్‌బాండ్‌ తరహా సినిమా. ఈ సినిమా సక్సెస్‌తో కష్ణకు ప్రేక్షకుల్లో ఆంధ్రా జేమ్స్‌బాండ్‌ అన్న పేరు వచ్చింది. దీంతో  కృష్ణ‌ ఒకేసారి 20 సినిమాల్లో హీరోగా బుక్‌ అయ్యాడు. 1967లో కృష్ణ‌ నటించిన ఆరు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో 'ఇద్దరు మొనగాళ్లు' అన్న జానపద చిత్రం, బాపు-రమణల తొలి చిత్రం 'సాక్షి'లో విజయనిర్మలతో కష్ణ మొదటిసారి జంటగా నటించాడు. ఈ దశలోనే  కృష్ణ‌ వచ్చిన అవకాశాలన్నీ అంగీకరిస్తూ సినిమాలు చేశాడు. ''ఎవరికి ఏ సినిమా ఎందుకు చేస్తున్నానో చూసుకునే తీరిక కూడా ఉండేది కాదని''  కృష్ణ‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.  కృష్ణ‌కు 'గూఢచారి 116' వల్ల వచ్చిన ఇమేజీ ప్రభావం చాన్నాళ్ళు ఉంది. 2 దశాబ్దాల్లో మరో 6 జేమ్స్‌ బాండ్‌ తరహా చిత్రాలు చేసిన  కృష్ణ‌కు దాదాపు అన్నీ విజయాన్ని సంపాదించిపెట్టాయి.
పద్మాలయా నిర్మాణ సంస్థ ఆవిర్భావం
1970లో పద్మాలయ నిర్మాణ సంస్థను నెలకొల్పి మొదటి ప్రయత్నంగా 'అగ్నిపరీక్ష' చిత్రాన్ని నిర్మించారు. ఆయన సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావులు చిత్ర నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటుంటే  కృష్ణ‌ సొంత సినిమాలు నిర్మిస్తూ ఇతర సంస్థల చిత్రాల్లో నటించేవారు. 1971లో  కృష్ణ‌ రెండో సొంత చిత్రం 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రాన్ని హాలీవుడ్‌ స్థాయిలో నిర్మించారు. తెలుగులో ఇది తొలి కౌబారు చిత్రంగా రికార్డు సాధించింది. ఈ సినిమా సింహభాగాన్ని రాజస్థాన్‌ అడవుల్లో, హిమాచల్‌ప్రదేశ్‌లో తీసారు. ఈ చిత్రంలో కష్ణని అభిమానులు కౌబారుగా చూసుకున్నారు. ఈ సినిమా ఖ్యాతి దేశవిదేశాలకు విస్తరించింది. 'ది ట్రెజర్‌ ఐలాండ్‌' పేరుతో ఇంగ్లిషులోకి అనువదించిన ఈ సినిమాని 125 దేశాల్లో ప్రదర్శించారు. నటుడు ప్రభాకర్‌రెడ్డిని భాగస్తుడిగా చేసుకొని 60 వేల అడుగుల నిడివిగల 'పండంటి కాపురం' సినిమాని కేవలం 45 రోజుల్లో నిర్మించి, క్లైమాక్స్‌ దశ్యాల్ని బందరులో అశేష జనవాహిని మధ్య చిత్రీకరించి కృష్ణ‌ రికార్డు సష్టించారు. ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించడమే కాదు, అందులో నటించిన జమునకు 'రాణీ మాలినీ దేవి'గా గుర్తింపు తెచ్చి పెట్టింది.  కృష్ణ‌ 100వ సినిమా 'అల్లూరి సీతారామరాజు' గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 'అసాధ్యుడు' చిత్రంలో సీతారామరాజుగా కనిపించిన  కృష్ణ‌కు, ఆ కథను చిత్రంగా తీయాలనే అభిలాష కలిగింది. స్వాతంత్య్ర సమరాన్ని రక్తాక్షరాలతో లిఖించిన సంగ్రామ సింహంగా, విప్లవాగ్నులు మండించిన వీరాభిమన్యునిగా, స్వేచ్ఛా సమరశంఖమై, బ్రిటీషు సింహాసనపు పునాదుల్లే గజగజలాడించిన విప్లవ ప్రవక్తగా సీతారామరాజుని ఈ సినిమాస్కోప్‌ చిత్రంలో తీర్చిదిద్దారు  కృష్ణ‌. భారీ బడ్జెట్‌ సినిమాలను 13 లక్షల్లో తీయ్యగలిగే ఆ రోజుల్లోనే, కృష్ణ‌ ఈ సినిమాకు 25 లక్షలు ఖర్చు చేశాడు. సినిమా విజయవంతమై మంచి లాభాలను ఆర్జించింది. 1982లో వచ్చిన  కృష్ణ‌ 200వ చిత్రం 'ఈనాడు' కూడా ఒక్క యుగళగీతం లేకున్నా బాగా ఆడింది. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో నిర్మించిన 'తెలుగువీర లేవరా'  కృష్ణ‌కు 300వ చిత్రం. ఆయన 1983లో ప్రభుత్వ సహకారంతో స్వంతగా పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో నెలకొల్పిన  కృష్ణ 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. 'సాక్షి' 'గూఢచారి 16', 'మోసగాళ్ళకు మోసగాడు', 'పండింటి కాపురం', 'దేవుడు చేసిన మనుషులు', 'మాయదారి మల్లిగాడు', 'అల్లూరి సీతారామరాజు', 'భలే దొంగలు', 'కురుక్షేత్రం', 'సింహాసనం', 'ఊరికి మొనగాడు'.. ఇలా తెలుగు చిత్రసీమ సగర్వంగా చెప్పుకొనే మైలురాళ్లన్నీ కష్ణ చలవే. రోజుకు మూడు షిఫ్టుల్లో షూటింగ్‌, ఏడాదికి పద్నాలుగు, పదిహేను సినిమాలు..! ఇవన్నీ ఎవరికి సాధ్యం? అసలు అంత టైమ్‌ ఎక్కడిది? అంత ఓపిక ఎలా వచ్చింది. ''సినిమాలంటే నాకు పిచ్చి ప్రేమ. నచ్చి చేసే పనే కదా..? అందుకే విసుగు రాలేదు. పైగా సినిమా సినిమాకీ వాటిపై ప్రేమ పెరిగింది'' అంటూ ఈ రంగంపై తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు కృష్ణ. ఆయన నటించిన వాటిలో దాదాపు 100 చిత్రాలు వంద రోజులు జరుపుకున్నాయి. అదో రికార్డు.
నిర్మాతల హీరో...
కృష్ణ మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నాడు. క్లుప్తంగా, ముక్కుసూటిగా, నిజాయితీగా మాట్లాడే ఆయన తన సినిమా ఫ్లాప్‌ అయితే నిర్మొహమాటంగా ఆ సంగతి అంగీకరించేవాడు. తన బలాలతో పాటు లోపాలపైనా, తనకున్న పరిమితులపైనా కూడా చక్కని అవగాహన ఉండేది. తనతో సినిమా తీసి నిర్మాత ఆర్థికంగా నష్టపోయినప్పుడు తానే నిర్మాత వద్దకు వెళ్ళి వాళ్ళు దెబ్బ తినకుండా ఉండేందుకు వెంటనే మంచి సినిమా ప్లాన్‌ చేయమని, అడ్వాన్స్‌ అక్కర్లేదని డేట్లు ఇచ్చేవాడు. విడుదలకు ముందు నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే తన పారితోషికం వదులుకునేవాడు. సినిమా ఫ్లాప్‌ అయితే నిర్మాత ఆర్ధికంగా బాగా నష్టపోయాడని తెలిస్తే.. తన పారితోషికాన్ని సైతం వెనక్కిచ్చేసిన సందర్భాలు కోకొల్లలు. అందుకే ఆయన నిర్మాతల హీరో అయ్యాడు.
సినిమాల్లో కొత్తదనాన్ని పరిచయం చేసిన  కృష్ణ‌
తెలుగు సినిమా రంగంలో కొత్తదనాన్ని పరిచయం చేయడమే కాకుండా పలు సాంకేతిక మార్పులను ప్రవేశపెట్టడం, విభిన్నమైన జాన్రాలతో ప్రయోగాలు చేసింది కృష్ణ అని చెప్పాలి. తెలుగులో తొలి సాంఘిక రంగుల చిత్రం 'తేనె మనసులు', తొలి జేమ్స్‌బాండ్‌ సినిమా 'గూఢచారి 116', తొలి కౌబారు సినిమా 'మోసగాళ్ళకు మోసగాడు', తొలి స్కోప్‌ సినిమా 'అల్లూరి సీతారామరాజు', తొలి 70 ఎంఎం సినిమా 'సింహాసనం' ఇలా తెలుగు చిత్రసీమ సగర్వంగా చెప్పుకొనే మైలురాళ్లన్నీ కష్ణ చలవే. ఆయన చేసిన ప్రయెగాలు తెలుగు చలన చిత్ర రంగంలో ప్రత్యేక స్థానాన్ని నిలిపి, 1976 -1985 మధ్యకాలంలో ఎవరూ అందుకోలేని స్థాయికి కష్ణ చేరుకున్నారు. 1964-1995 మధ్య ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తిచేసిన నటుడు మరొకరు లేరు.
బాల సుబ్రమణ్యంతో విబేధాలు
సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం అంటే అప్పట్లో ఎవర్‌ గ్రీన్‌. ఆయన పాట పాడని సినిమా లేదు. కొన్ని కారణాల వల్ల 1986 ప్రాంతంలో బాల సుబ్రమణ్యం, కృష్ణకు మనస్పర్థలు వచ్చాయి. ఆ తర్వాత కృష్ణ తన సినిమాలకు కొత్త గాయకుడు 'రాజ్‌ సీతారామ్‌'ను పరిచయం చేశారు. అతడి పాడిన పాటలతోనే 'సింహాసనం' వంటి సూపర్‌ హిట్‌ సినిమా తీశాడు. ఆ సినిమాలో 'ఆకాశంలో ఒక తార.. నా కోసం వచ్చింది ఈ వేళ' అన్న పాటలు పాడించారు. ఈ పాట అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. అలా కొన్ని సినిమాలు వచ్చిన తర్వాత బాలు, కృష్ణ మధ్య సంధి కుదిరింది. ఆ తర్వాత రాజ్‌ సీతారామ్‌ గొంతు మళ్లీ విన్పించలేదు.
మల్టీస్టారర్‌ చిత్రాల్లో నటించిన  కృష్ణ‌
అత్యధిక మల్టీస్టారర్‌ చిత్రాల్లో నటించిన నటుడెవరంటే కృష్ణ పేరు చెప్పాల్సిందే. ఆయన ఎన్టీఆర్‌, అక్కినేని, శోభన్‌బాబు, కష్ణంరాజు వీళ్లందరితోనూ కలిసి సినిమాలు చేశారు. ''మరో కథానాయకుడితో నటించడంలో నాకెలాంటి అభ్యంతరాలు ఉండేవి కావని, అప్పట్లో మా మధ్య మంచి వాతావరణం ఉండేదని, కథలూ కూడా అలాంటివి వచ్చేవి. అందుకే, మల్టీస్టారర్‌ చిత్రాల సంఖ్య అప్పట్లో ఎక్కువగా ఉండేది'' అని చెప్తారు కృష్ణ.
రాజకీయ రంగంలో..
1983 లో ఎన్‌.టి. రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రి కావడంతో తెలుగు నాట కూడా సినిమా రంగంలోని గ్లామర్‌కు రాజకీయాలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. 1982లో కృష్ణ కథానాయకుడిగా విడుదలైన రాజకీయ చిత్రం ''ఈనాడు'' సినిమా అప్పుడే రంగప్రవేశం చేసిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు, ప్రచారానికి అనుకూలంగా ఉండి, తెలుగుదేశం ప్రభంజనంలో తనవంతు చిన్న పాత్ర పోషించింది. అయితే 1984లో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని నాదెళ్ళ భాస్కరరావు కూలదోసి ముఖ్యమంత్రి అయినప్పుడు భాస్కరరావును కృష్ణ అభినందిస్తున్నట్టు ఫుల్‌పేజీ ప్రకటన విడుదల అయింది. ఈ సంఘటన కృష్ణకి, రామారావుకి మధ్య విభేదాలకు కారణమయింది. ఎన్‌.టి.రామారావు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాకా ఈ విభేదాలు రాజుకున్నాయి. 1984 అక్టోబరులో ఇందిరా గాంధీ దారుణ హత్యకు గురైనప్పుడు కృష్ణ ఆమె అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్ళాడు. అదే సమయంలో ప్రధాన మంత్రిగా, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్‌ గాంధీ, కృష్ణ కలిశారు. తెలుగుదేశం పార్టీకి రామారావు మాస్‌ అప్పీల్‌ లాభిస్తోందని, అలాంటి ప్రజాకర్షణ ఉన్న కష్ణ కాంగ్రెస్‌ పార్టీకి ఉపకరిస్తాడని కాంగ్రెస్‌ నాయకులు భావించి, ఆయనను 1984లో కృష్ణ కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకున్నారు. ఆ తర్వాత కృష్ణ తెలుగుదేశం ప్రభుత్వ చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ సినిమాలు చేశాడు. కృష్ణ 80వ దశకంలో పలు రాజకీయ నేపథ్యంలోని సినిమాలు చేయడం వెనుక ఉన్నదీ ఇదే కారణం. 'సింహాసనం' సినిమాలో ప్రతినాయక పాత్రల్లో ఒకటైన కైకాల సత్యనారాయణ పాత్రకు అప్పటి రామారావు శైలిలో కాషాయం కట్టించి, రామారావును వ్యంగ్యంగా అనుకరించే కొన్ని డైలాగులు చెప్పించారు. ఆ తరువాత 'నా పిలుపే ప్రభంజనం' సినిమా పూర్తిస్థాయి విమర్శగా తీశాడు. సినిమాలో ప్రతినాయక పాత్ర అయిన కోదండరామయ్య త్రిలింగ దీవి అన్న రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటాడు. ముక్కుసూటిగా ఉండే పెద్ద అల్లుడు, జిత్తులమారి చిన్న అల్లుళ్ళ సలహాలతో కోదండరామయ్య ఇష్టారాజ్యంగా పరిపాలిస్తూంటాడు. కృష్ణ సినిమాలో డీసీపీ పాత్ర పోషించాడు. రాజకీయంగా తిరుగుబాటు రావడం క్లైమాక్స్‌. ఈ విధంగా కోదండరామయ్య పాత్ర రామారావును, పెద్ద అల్లుడి పాత్ర రామారావు పెద్ద అల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చిన్న అల్లుడి పాత్ర చంద్రబాబులను పోలి వుంటుంది. ఈ సినిమాను అడ్డుకోవడానికి రామారావు అభిమానులు థియేటర్ల యజమానులపై చేసిన దాడి డిస్ట్రిబ్యూటర్లు ఏకం కావడంతో విఫలమైంది. విజయనిర్మల దర్శకురాలిగా, కృష్ణ కథానాయకుడిగా ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని, రామారావు చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ 'సాహసమే నా ఊపిరి' సినిమా తీశారు. ఈ సినిమాలు మంచి విజయాన్ని సాధించి చాలా మంది రాష్ట్ర మంత్రులను, శాసన సభ్యులను కలవరపరిచాయి. 1989లో కృష్ణ‌ కాంగ్రెస్‌ తరఫున ఏలూరు లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించాడు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కష్ణ గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం కోరుకున్నా తిరిగి ఏలూరులోనే పార్టీ పోటీ చేయించింది. ఆ ఎన్నికల్లో కృష్ణ ఓటమి పాలయ్యాడు. 1991లో తనకు సన్నిహితుడు, రాజకీయాల్లో తనను ప్రోత్సహించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ దారుణ హత్యకు గురికావడం, తాను కోరిన గుంటూరు నియోజకవర్గం కాంగ్రెస్‌ ఇవ్వకపోవడంతో ఏలూరులో ఓటమి చెందడం వంటి కారణాలతో  కృష్ణ‌ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం విరమించుకున్నాడు. 2009 ఎన్నికల్లో వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్‌ పార్టీకి కృష్ణ కుటుంబం నైతిక మద్దతు అందించింది.
పురస్కారాలు
 కృష్ణ‌ సుదీర్ఘ నట జీవితంలో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారాలు పెద్దగా పొందలేదు. కానీ, లెక్కలేని కమర్షియల్‌ విజయాలు మాత్రం అందుకున్నారు అల్లూరి సీతారామరాజు సినిమాలో అల్లూరి పాత్రలో చేసిన నటనకు 1974లో ఉత్తమ నటునిగా నంది పురస్కారం ఒక్కటే అందుకున్నారు. 1976లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి కె.వి. రఘునాథరెడ్డి చేతుల మీదుగా  కృష్ణ‌ ''నటశేఖర'' బిరుదును అందుకున్నాడు. ఈ పరంగా అతని సేవలను గుర్తిస్తూ 1997లో ఫిల్మ్‌ఫేర్‌ సౌత్‌ 'జీవిత సాఫల్య పురస్కారం', 2003లో 'ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం', 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం 'గౌరవ డాక్టరేట్‌', 2009లో భారత ప్రభుత్వం 'పద్మభూషణ్‌ పురస్కారం' వంటి గౌరవాలు కృష్ణకు లభించాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం  కృష్ణ‌ను గౌరవిస్తూ ఓ పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేసింది.
విశేష ప్రజాదరణ
 కృష్ణ‌ ఏ ప్రజాదరణను ఆశించి సినిమా రంగంలోకి వచ్చాడో దాన్ని పూర్తిగా అనుభవించాడు. ఆయన నట జీవితంలో పొందిన ప్రజాదరణకు ఒక ఉదాహరణగా 1986లో సింహాసనం సినిమా వందరోజుల సభ నిలుస్తుంది. మద్రాసులోని విజిపి గార్డెన్స్‌లో నిర్వహించిన 'సింహాసనం' చిత్ర శతదినోత్సవానికి 400 బస్సుల్లో 30 వేలమంది అభిమానులు ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరలి రావడాన్ని చూసిన తమిళనాడు ప్రభుత్వాధికారులు ఆశ్చర్యపోయారు. 1970ల చివర్లో ప్రముఖ సినీ వారపత్రిక 'జ్యోతిచిత్ర' ప్రతీ ఏడాది సూపర్‌ స్టార్‌ ఎవరూ...? అని కూపన్‌ ద్వారా ఓటింగ్‌ నిర్వహించేదీ. ప్రతి ఏటా కష్ణే గెలిచేవాడు. 'సూపర్‌ స్టార్‌' బిరుదుకు తగ్గ వ్యక్తిని ప్రజలే ఎన్నుకునేలా పోటీ పెడితే ప్రతీ ఏటా  కృష్ణ‌నే ఎన్నికయ్యేవాడు. నాలుగేళ్ళు వరుసగా కష్ణనే ఎంపిక కావడంతో ఇక 'జ్యోతిచిత్ర' పత్రిక ఆ పోటీని విరమించే దశకు అభిమానులు తెచ్చారు. తెలుగు సినీ పరిశ్రమలో  కృష్ణ‌కు 2500 అభిమాన సంఘాలు ఉండేవి. ఊరూరా ఉన్న అభిమాన సంఘాలు వందల సంఖ్యలో ఉండేవి. కృష్ణ‌ పుట్టినరోజును స్వచ్ఛందంగా ఘనంగా నిర్వహించి, వార్తా పత్రికల్లో సాధారణంగా ఉండే పేజీలకు రెట్టింపు సంఖ్యలో వచ్చే స్థాయికి అభినందన ప్రకటనలు ఇచ్చేవారు. అటువంటి  కృష్ణ‌ అభిమాన సంఘాలు, నటవారసుడిగా వచ్చిన మహేష్‌ బాబు అభిమాన సంఘాలు 2008లో విలీనమైపోయి సూపర్‌ స్టార్‌ మహేష్‌  కృష్ణ‌ సేనగా ఏర్పడ్డాయి.
కుటుంబం
 కృష్ణ‌కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, ఆయన కుటుంబం నుంచి కుమారులు మహేష్‌ బాబు, రమేష్‌ బాబు, కుమార్తె మంజుల, చిన్న అల్లుడు సుధీర్‌ బాబు సినిమా రంగంలోకి వచ్చారు. తొలుత ఇందిరను వివాహం చేసుకున్నప్పటికి ఇరు కుటుంబాల పరస్పర అంగీకారంతో 1969లో ప్రేమించిన తోటి నటి విజయనిర్మలను రెండవ పెళ్ళి చేసుకున్నాడు. కష్ణ పెద్ద కుమారుడు రమేష్‌ బాబు మొదట్లో నటుడుగా సినిమాల్లోకి వచ్చిన సక్సెస్‌ లేక నిర్మాతగా మారాడు. ఇక రెండవ కుమారుడు మహేష్‌ బాబు పలు విజయాలు అందుకుని ప్రేక్షకుల నుంచి సూపర్‌ స్టార్‌ అన్న తండ్రి బిరుదు పొందాడు. విజయ నిర్మల అత్యధిక చిత్రాలు దర్శకత్వం వహించిన మహిళా దర్శకులిగా నిలిచింది. ఇటీవలే విజయనిర్మల,  కృష్ణ‌ పెద్ద కుమారుడు రమేష్‌ బాబు మరణించడం ఆయనను తీవ్ర మనోవేదనకు గురి చేసింది.
సాధించిన దానితో తప్తి పడడం, ఆ విజయాలను భావి తరాలకు కానుకలుగా అందించడం గొప్పవాళ్ళ లక్షణం. కృష్ణ కూడా అంతే. ఆయన నట ప్రయాణం సాఫీగా సాగిపోయింది. ఎత్తుపల్లాలున్నా పరాజయాలు బాధించినా విమర్శలు ఎదుర్కొవలసి వచ్చినా అలుపెరుగని బాటసారిగా ప్రయాణం సాగించారు. చివరకి విజయతీరాలకు చేరారు. 2010 దశకంలో  కృష్ణ‌ సినిమాలకు దూరంగా నటనను విరమించుకుని విశ్రాంతి జీవితం గడుపుతున్నాడు. మరోవైపు తనయుడు మహేష్‌ బాబు సాధిస్తున్న విజయాల్ని చూసి ఆయన తండ్రి హదయం గర్విస్తోంది. ఇప్పటికీ ఆయనలో నటించాలన్న కోరిక మంచి పాత్ర వస్తే తనదైన శైలి చూపించాలన్న తపన ఉన్నాయి. అందుకే.. ''నాకు సరిపడే పాత్రలు వస్తే, మనవడు గౌతంతో కలిసి నటించాలని ఉంది'' అంటూ ఈ మధ్య తన మనసులోని మాట బయటపెట్టారు  కృష్ణ‌.

- పొన్నం రవిచంద్ర,
   9440077499

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మాదక మత్తుతో తప్పదు ముప్పు
భ‌గ్న‌ ప్రేమికురాలు అలనాటి అందాల తార గాయని సూరయ్య
నేల తల్లిని కాపాడుకుందాం...
ధరలు ఆకాశంలో... ప్రజలు పాతాళంలో...
సెలవులందు వేసవి సెలవులు వేరయా!!
మనసు కవి.. మన సుకవి.. ఆచార్య ఆత్రేయ
కామ్రేడ్‌ మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య
రంజాన్‌ - రోజా - జకాత్‌
ఎండాకాలం - జాగ్రత్తలు
సంఘటిత శక్తి..అంకాపూర్‌

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
10:58 AM

టీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి అరెస్ట్‌

09:33 AM

ఏటీఎం కార్డులు మార్చి నగదు స్వాహా..వ్యక్తి అరెస్ట్‌

09:21 AM

కామారెడ్డి‌...ఇండ‌క్యా‌ష్ ఏటీఎంలో చోరీ

09:08 AM

ఆపరేషన్‌ చేసి కుట్లు మరిచారు

08:47 AM

ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

08:34 AM

ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

08:25 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:17 AM

నేడు ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితాలు

08:13 AM

భూపాలపల్లి అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం

08:08 AM

జూపలి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు

08:02 AM

కోహ్లి, శ్రేయస్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు...

07:57 AM

జులై 3న అల్పపీడనం...

07:49 AM

బావిలో దూకి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

07:39 AM

గొర్రెల స్కీం పేరుతో 8 కోట్ల మోసం

07:27 AM

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌కు కరోనా పాజిటివ్‌

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.