Sun 12 Jun 05:56:34.590055 2022
Authorization
బాలనటిగా హిందీ సినీ పరిశ్రమలో ప్రవేశించి నటిగా, నేపథ్య గాయనిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, నవరసాల నటన, నర్తనను ప్రదర్శించిన గొప్ప నాయిక సూరయ్య. ఆమెది గంధర్వ గానం. అందంలో అప్సరస. ఆ రోజుల్లో హిందీ సినీ చిత్ర సీమను మకుటం లేని మహా రాణిగా ఏలి, నిర్మాతలకు కల్పవక్ష మైంది. నాటి యువకుల హదయ సామ్రాజ్జిగా నిలి చింది. అత్యంత పారి తోషికం తీసుకునే కథా నాయకురాలిగా ఉంటూ, ఒక హీరో ప్రేమను చూరగొని, ప్రేమకు మతాలు అడ్డు గోడలైన కారణంగా సినీ జీవితాన్ని వదులు కోవడం కాకుండా, విపల ప్రేమికురాలై, జీవితాంతం అవివాహితగా ఉండి పోయిన భగ ప్రేమికురాలు. అందాల తార, గాయని సూరయ్య.
సూరయ్య జమాల్ షేక్ 1929 వ సంవత్సరం జూన్ 15 వ తేదీన అవిభక్త భారతదేశంలోని కరాచీ ''గున్ వాలా'' లో ముంతాజ్ షేక్, అజీజ్ జమాల్ షేక్ దంపతులకు జన్మించింది. సూరయ్య ఏడాది వయసులోనే వారి కుటుంబీకులు బొంబాయి వలస వచ్చారు. సూరయ్య జె.బి.పెటిట్ బాలికల ఉన్నత పాఠశాలలో పర్షియన్, ఖురాన్ భాషలలో చదువుకుంటూనే ఆరేళ్ళ వయసులో ఆల్ ఇండియా రేడియో పిల్లల కార్యక్రమంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పిల్లల కార్యక్రమంలో పాల్గొనేది. ఆమె పాడిన పాటలు అక్కడికి వచ్చిన సంగీత దర్శకుడు నౌషాద్, రాజ్ కపూర్లను ఆకట్టుకున్నాయి. సూరయ్య సినిమాల్లోకి రావడం యాదచ్ఛికంగానే జరిగింది. 1936లో ''ఉస్నే క్యా సోదా'' చిత్రంలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసిన సూరయ్య జజ్జన్ బాయి ''మేడమ్ ఫ్యాషన్''లో నటించింది. తరువాత, ఒకరోజు ''క్టర్ ఫిలిం కంపెనీ'' లో పని చేస్తున్న తన మేనమామతో కలిసి 'తాజ్ మహల్'' సినిమా షూటింగ్‌కు వచ్చిన సూరయ్యకు అనుకోకుండానే ''తాజ్ మహల్'' చిత్రంలో ముంతాజ్ మహల్ పాత్ర దొరికింది. అదే సమయంలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు నౌషాద్ ఆకాశవాణి కేంద్రంలో తన పాటలతో అలరించిన సూరయ్యతో ''శారద'' సినిమాలో ఓ పాట పాడించి పెద్ద సాహసమే చేశాడు. అయితే ఆ పాట భారతదేశమంతటా మారుమోగింది. దాంతో సూరయ్య ఓవర్ నైట్‌లో స్టార్ అయింది. తెరమీద అభినయించే నటీనటులకు గాయనీ గాయకులు నేపథ్య గానాన్ని అందించే ప్రక్రియ ఇంకా ఆరంభంకాని ఆ దశలో సూరయ్య అందం, అభినయం, సుమధుర గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆ తర్వాత 'తమన్నా', 'స్టేషన్ మాస్టర్' సినిమాలలో బాలనటిగా నటించింది. 1940వ దశకంలో ఆమె హిందీ తెరపై ఒక సూపర్‌స్టార్ అనిపించుకోవడమే కాకుండా, నాటి యువకులకు ఓ ఆరాధ్య దేవతగా నిలిచింది. 1943లో ప్రముఖ నటి, బాంబే టాకీస్ అదినేత దేవికారాణి స్వంత చిత్రం ''హమారీ బాత్'' లో సూరయ్య తన నటనతో ప్రత్యేకమైన ముద్ర వేసింది. ఈ చిత్రంలో ఆమె యుగళ నత్యం చేసి, అరుణ్ కుమార్‌తో కలిసి ''బిస్టార్ బిచా దియా హై తేరే ఘర్ కే సామ్నే'' పాడిన పాట బాగా ప్రాచుర్యం పొందింది. ఈ సినిమా తర్వాత దేవికారాణి నెలకి 500 రూపాయల పారితోషికంతో 5 సంవత్సరాల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సూరయ్యకు ఇతర నిర్మాతల చిత్రాలలో అవకాశాలు రావడంతో దేవికారాణి పెద్ద మనసుతో సూరయ్యతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత బాలీవుడ్‌ను నట గాయనీమణులైన సూరయ్య, నూర్జహాన్, ఖుర్షీద్ బానోలు ఏలేవారు. అయితే దేశ విభజన తర్వాత నూర్జహాన్, ఖుర్షీద్ బానోలు పాకిస్తాన్‌కు వెళ్లిపోగా, సూరయ్యకు తిరుగు లేకుండా పోయింది. మధురాతి మధురంగా గానం... అద్భుతమైన నటన... పాలరాతి శిల్పం లాంటి అందమైన సూరయ్య, క్రమేణా నిర్మాతల పాలిటి కల్పవక్షమయ్యింది. 1945 నుండి 1961 దాకా అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా సూరయ్య నిలిచింది. ఆ రోజుల్లో కె. ఆసిఫ్ 'ఫూల్' చిత్రానికి ఆమెకు 40 వేల రూపాయలు చెల్లించడం అందరినీ విస్మయపరిచింది. ఈ చిత్రంలో పథ్వీరాజ్ కపూర్ హీరోగా నటించారు. 1943లో జెకె నందా చిత్రం ''ఇషారా''లో పథ్వీరాజ్ కపూర్ సరసన కథానాయికగా నటించింది. 1945 లో కెఎల్ సైగల్ సిఫారసు మేరకు ''తద్బీర్' చిత్రంలో ఆమె కథానాయికగా నటించింది. తర్వాత వరుసగా ''యతీమ్, ఒమర్ ఖయ్యుమ్, విద్య, జగబిటి, అన్మోల్ ఘడీ, జీత్, దాస్తాన్, సనమ్, అఫ్సర్, దునియా, అమర్ కహానీ, షాన్, ఖిలాడి, రాజపుత్, ప్యార్ కీ జీత్, మీర్జా గాలిబ్, బిల్వా మంగల్, సనమ్, కాంచన్, మాలిక్, ట్రాలీ డ్రైవరు, నిలి'' తదితర సినిమాలలో నటించింది. ఈ సినిమాలు సూరయ్యకు మంచి పేరును, నిర్మాతలకు డబ్బును తెచ్చిపెట్టాయి. సూరయ్య నటుడు దేవానంద్‌ను సిఫార్సు చేసి, ప్రోత్సాహాన్ని అందించింది. ఆయన సరసన చాలా చిత్రాలలో నటించి, ఉత్తమ జంటగా గుర్తింపు పొందింది. 1948లో వచ్చిన 'ప్యార్ కీ జీత్', 1949లో వచ్చిన 'బడీ బెహన్', 'దిల్లగీ' సినిమాలు బాక్సాఫీసును బద్దలుకొట్టాయి. సొహ్రబ్ మోదీ దర్శకత్వంలో వచ్చిన ''మీర్జా గాలీబ్'' సినిమా సూపర్ హిటయ్యింది. ఆ సినిమా రెండు జాతీయ అవార్డులను కూడా గెల్చుకుంది. సినిమా చూసిన ఆనాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ సూరయ్యను 'మీర్జా గాలిబ్' లో ఆమె చౌద్వీన్ పాత్ర పోషించడమే కాకుండా, ఆమె పాడిన గాలిబ్ గజళ్ళు విని, ''నీవు గాలిబ్‌ను పునరుజ్జీవింప చేశావు'' (yశీబ ష్ట్రaఙవ bతీశీబస్త్రష్ట్ర్ baషస +ష్ట్రaశ్రీఱb ్‌శీ శ్రీఱటవ) అని ప్రశంసించారట. సూరయ్య స్వర్ణయుగపు నటులు కె.ఎల్. సైగల్, పథ్వీరాజ్ కపూర్, షమ్మీ కపూర్, పైడి జైరాజ్ తదితర నటుల సినిమాలలో నటిగా, గాయనిగా పేరు ప్రఖ్యాతులు గడించింది. ''బాడి బెహెన్'' చిత్ర ప్రీమియర్ సందర్భంగా సినిమా హాలులోకి వస్తున్నప్పుడు అభిమానులు సూరయ్య దుస్తులను లాగడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయవలసి వచ్చింది. దీంతో ఆ తర్వాత, సూరయ్య తన చిత్రాల ప్రీమియర్లకు వెళ్లడం మానేసింది.
గాయనిగా సూరయ్య
సూరయ్య మొదటిసారి నౌషాద్ స్వరపరిచిన ''నయి దునియా'' చిత్రంలో బాల గాయనిగా ''బూట్ కరున్ మెయిన్ పోలిష్ బాబు'' మొదటి పాట పాడింది. 1942లో నటి మెహతాబ్ కోసం శారద, కానూన్ చిత్రాలలో, నౌషాద్ కోసం సంజోగ్‌లో పాడింది. తరువాత సోహ్రాబ్ మోడీ నిర్మించిన తన చిత్రం ''షామా' తో సూరయ్య బిజీ కథానాయికగా మారినప్పుడు మెహతాబ్ తన పాటల డిస్క్ వెర్షన్లను రికార్డ్ చేయమని అభ్యర్థించడంతో మెహతాబ్ కోసం సూరయ్య ఆమె చిత్రాలలో పాడింది. సూరయ్య తొలిసారి మన్నా డే తన మొదటి హిందీ చిత్రం 'జాగో ఆయే ఉష' లో, 'సాజన్ ఘర్ అయే' 'స్టేషన్ మాస్టర్'' చిత్రాలలో నటించి పాడారు. 1943లో ''ఏక్ తు హూ, ఏక్ మెయిన్ హూన్'' అనే పాటను నౌషాద్ స్వరపరిచారు, కానూన్ చిత్రంలో, ఇది బాంబే సంగీత పరిశ్రమలో మొట్టమొదటి పాట, హమారీ బాత్ చిత్రానికి అరుణ్ కుమార్‌తో కలిసి సూరయ్య యుగళగీతం పాడిన ''బిస్టార్ బిచా లియా హై తేరే దార్ కే సామ్నే ఘర్ హమ్ నే లే లియా హై తేరే ఘర్ కే సామ్నే'' పాట పెద్ద విజయాన్ని సాధించింది. అనంతరం కొన్ని సంవత్సరాల తరువాత, గాయకుడు, నటుడు, కె.ఎల్. సైగల్‌ను సురయ్య పాటలు ఎంతగానో ఆకట్టుకోవడంతో 'తద్బీర్' చిత్రంలో తన సరసన హీరోయిన్గా, గాయకురాలిగా ఉండటానికి అతను సంసిద్ధత వ్యక్తం చేశాడు. ఈ చిత్రంలో ''రాణి ఖోల్ దే దావార్ మిల్నే కా దిన్ ఆ గయా'' పాటను సూరయ్య సైగల్తో కలిసి పాడింది. సైగల్ తిరిగి సూరయ్యను తన కథానాయికగా 'ఒమర్ ఖయ్యామ్', 'పర్వానా' చిత్రాలలో గాయకురాలిగా ఎంచుకున్నాడు. 'పర్వానా' సైగల్ చివరి చిత్రం అతని మరణం తరువాత విడుదలైంది. ఆ తరువాత, సూరయ్య కొన్ని చిత్రాలలో సంగీత దర్శకుడు నౌషాద్తో కలిసి పనిచేయడం కొనసాగించింది. 1946లో నటి నూర్జెహతో కలిసి అన్మోల్ ఘాడీలో సహనటుడిగా, నౌషాద్ సంగీత దర్శకుడిగా కనిపించారు. ఈ చిత్రంలో ఆమె మూడు పాటలు పాడింది, అందులో 'మ్యాన్ లెటా హై అంగై' పాట దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. సూరయ్య తన పాటలు, నటనతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 22 సంవత్సరాల వ్యవధిలో, నౌషాద్ కోసం ఆమె సుమారు 51 పాటలు పాడి, అనేక విజయాలను అందించింది. సూరయ్య తన తీపి గొంతుతో ''వో పాస్ రహీన్, యా డోర్ రహీన్'', ''తేరే నైనో నే చోరి కియా'', ''తు మేరా చాంద్, మెయిన్ తేరి చాందిని'', ''యాద్ కరుణ్ తోరి బాటియా'', ''మ్యాన్'' మోర్ హువా మాత్వాలా '''' నైన్ దేవానే, ఏక్ నహిన్ మానే ''తో పాటు ఆల్ టైమ్ ఫేవరెట్ గీతాలను ఆలపించారు. సంగీత దర్శకులు ఖుర్షీద్ అన్వర్ మూడు చిత్రాలు ''ఇషారా, పర్వానా, సింగార్'' లలో సూరయ్య 13 పాటలు పాడింది. సంగీత దర్శకుడు ద్వయం, హుష్ లాల్ భగత్రంతో, సూరయ్య ప్యార్, జీ జీత్, ఆజ్ కి రాత్, నాచ్, బాలం, బారి బెహెన్, అమర్ కహాని, సనమ్, షామా పర్వానా, కాంచన్ ట్రాలీ డ్రైవర్ 10 చిత్రాలలో పాడింది. 'ప్యార్ కి జీత్' లోని ''ఓ, డోర్ జనేవాలే, వాడా నా భుల్ జన'' పాట 1948 లో భారతదేశం అంతటా విజయవంతమైంది. సంగీత స్వరకర్త సచిన్ దేవ్ బర్మన్ మూడు సినిమాలు 'విద్యా, అఫ్సర్, లాల్ కున్వర్' లలో మాత్రమే పాడింది. సూరయ్య ఇతర స్వరకర్తల చిత్రాలలో పాడిన పాటలు సైతం అలరించాయి. సూరయ్య తన సినీ కెరీర్లో 1936 నుండి 1963 వరకు 67 చిత్రాల్లో నటించి, 338 పాటలు పాడింది.
దేవానంద్‌తో విఫలమైన ప్రేమ
1948 నుంచి 1951 మధ్య సూరయ్య దేవానంద్ సరసన ఏడు చిత్రాలలో కలిసి నటించింది. ''విద్యా, జీత్, షాయిర్, సనమ్, అప్సర్, దోసితారే, నిలి' వంటి సినిమాలలో నటించి హిట్ పేరు తెచ్చుకున్నారు. ''విద్యా'' సినిమా షూటింగ్ జరుగుతున్నపుడు ''కినారె కినారె చలె జాయెంగే'' పాట చిత్రీకరణ సమయంలో పడవలో ఉన్న సూరయ్య నదిలో పడటంతో దేవానంద్ ప్రాణాలోడ్డి రక్షించారు. ఈ సంఘటన తర్వాత సూరయ్య దేవానంద్ ఇద్దరు ప్రేమలో పడ్డారు. ''జీత్'' చిత్రం చిత్రీకరణ సమయంలో దేవ్ ఆనంద్ తన ప్రేమ వ్యక్త పరిచాడు. కొన్నాళ్ళ పాటు వారి ప్రేమ వ్యవహారం రహస్యంగానే ఉండింది. వీరి ప్రేమకు సూరయ్య తల్లి సానుకూలమయినా, హిందువయిన దేవానంద్‌తో పెళ్లేమిటని సూరయ్య అమ్మమ్మ తీవ్రంగా వ్యతిరేకించింది. దేవ్ఆనంద్ ఫోన్ చేస్తే పరుషంగా మాట్లాడి, దేవ్ మనసును గాయ పరిచింది. అయినా దేవ్, సినీఛాయా చిత్రకారుడు దివేదా ద్వారా సురయ్యాకు 3000 రూ.లు ఖరీదు చేసే వజ్రపుటుంగరాన్ని పంపితే సురయ్య మహదానంగా స్వీకరిస్తే, తన కథ సుఖాంతమని భావించాడు దేవ్. చనిపోతామని బెదిరించి, సురయ్య ప్రేమకు ఆమె బంధుగణం అడ్డు వచ్చింది. భగ హదయురాలైన సూరయ్య, దేవ్ పంపిన ఉంగరాన్ని సముద్రంలో విసిరేసింది. అలా తన ప్రేమను చంపుకుని, జీవితాంతం అవివాహత గానే మిగిలి పోయింది. దేవానంద్ ను ప్రేమించిన సూరయ్య మరొకరితో జీవితాన్ని పంచుకోలేక ఒంటరిగానే గడిపింది. 1951 లో వచ్చిన 'దో సితారె' వీరిరువురూ కలిసి నటించిన చివరి చిత్రం. దో సితారే సినిమా తరువాత ఎన్నడూ వారిద్దరూ కలసి నటించలేదు. 34 ఏళ్ల వయసుకే ప్రేమ వైఫల్యం కారణంగా సూరయ్య అర్ధాంతరంగా సినిమాల్లోంచి తప్పుకుని, జీవితాంతం ఒంటరిగా ఉన్న సూరయ్య తన 75వ ఏటా 2004 సంవత్సరంలో ముంబాయిలో కన్ను మూసింది.
పురస్కారాలు, గౌరవాలు
1946 లో అన్మోల్ ఘాడీ చిత్రానికి అవార్డు. 1954 లో మీర్జా గాలిబ్ చిత్రానికి ఉత్తమ జాతీయ చలన చిత్రంగా రాష్ట్రపతి బంగారు పతకం. ఈ పతకాన్ని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో అందుకుంది.
1956లో సూరయ్యను భారత దేశ ప్రతినిధిగా సోవియట్ యూనియన్‌కు పంపింది. ఈ బందంలో రాజ్‌కపూర్, నర్గీస్, కామిని కౌషల్ ఉన్నారు. అక్కడ సూరయ్య సినిమాలు ప్రదర్శించబడ్డాయి. 1996 లో సూరయ్యకు ''స్కీన్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు'' లభించింది. 1998లో, న్యూ డిల్లీలో మీర్జా గాలిబ్ ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సూరయ్య ప్రత్యేకంగా సత్కరించారు. 1999లో సాహిత్య అకాడమీ అవార్డ్ ఫర్ హర్ పార్టిసిపేషన్ ఇన్ మీర్జ గాలిబ్ బిమల్ రారు మెమోరియల్ అవార్డ్ అందుకుంది. 2003లో దాదా ఫాల్కే 134వ జయంతి సందర్భంగా జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సూరయ్యను దాదాసాహెబ్ ఫాల్కే అకాడమీ, స్క్రీన్ వరల్డ్ పబ్లికేషన్ వారు సత్కరించారు. 2013న '100 సంవత్సరాల భారతీయ సినిమా' ఉత్సవాల సందర్భంగా సూరయ్యను గౌరవిస్తూ భారత ప్రభుత్వం తపాలా స్టాంపును విడుదల చేసింది. 2013లో సురయ్య 'బెస్ట్ ఆన్ స్కీన్ బ్యూటీ విత్ మోస్ట్ ఎత్నిక్ లుక్' గా ఎంపికయింది.
(జూన్ 15 న సూరయ్య జయంతి)
-పొన్నం రవిచంద్ర, 9440077499