అరచేతిలో ఇమిడి ఆకుపచ్చ గుండ్రాన నిత్యం కనబడి రాత్రి పగలు తేడాలేక నాతో జతకూడి స్వీయ చిత్రాల దిగుబడి సమాచార సందేశాల రాబడి సమస్తలోకాన్ని సంకేళ్లులేని బందీ కాబడి చిలిపి చాటింగ్‌ల, చీకటి చీటింగ్ల వలపు వేటింగ్ల, వీడియోకాల్ల మీటింగ్‌ల ప్రతి ఒక్కరిలోకి చొరబడి వైఫ్‌ను మించిన వైఫై మొబైల్ డాటాల ఒడిచిన కలవర పడి అర్ధరాత్రి స్వాతంత్య్రం వరకు నీ సహవాసమే తెల్లవార్లు లేచి నీ దర్శనంతోనే మా ప్రయాణం, ప్రణయం వాట్సాప్ నీకు యాట్సాఫ్ -మంగళపల్లి చిరంజీవి, ఉపాధ్యాయులు మొగుళ్లపల్లి, జయశంకర్ 9000279697