నవతెలంగాణ - ధూల్‌పేట్
ఆయన కలం పడితే సంకలనాలు జాలువారుతాయి. ఎంతో మంది సంకలన రచయితలో ఈ రేడియం ఓ ప్రధానం అని చెప్పవచ్చు. ఈ మద్య కాలంలో చాలా వరకు రచయితల పుస్తకాల్లో ఉండే ముందుమాట రేడియం కలం ఉంటుందంటే అతిశయోక్తి కాదు. గద్వాల ప్రాంతానికి చెందిన రేడియం గణిత బోధకుడు. బోధనలో తెలుగు పండితుడయ్యాడు. కవితా సంకలన రచయిత ప్రాచూర్యం సంపాదించాడు. రకరకాల కవిత్వాలుంటాయి. కాని పాఠకుడి మనసున పట్టి ఉంచేదే నిజమైన కవిత్వ భావమంటాడు. సాహిత్య ప్రయాణంలో ఎంత దూరం దాక నిలుస్తుందని నా తపన. జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను కాని ఆ లక్ష్యాన్ని చేరుకోలేక పోయాను. 'రేపు తన వెంట నడుస్తుందంటాడు విప్లవకారుడు' కవి కూడా నిలవాలని నా భావన. ఇది ఆయన ముందుమాటలోని వాక్యాలు. సాహిత్య రచనలు రాసినా వాటిని గుర్తించే వారు లేరు. కనీసం రాసిన కవితలను పుస్తక రూపంలోకి కూడా మార్చుకోలేని పరిస్థితులు. పేరుకే కవులను అంటున్న అసలు సాహిత్య కలా సంకలనకారులకు గుర్తింపు లేకుండా పోయేది. ఆయన రచించిన నది రేపటి గీతం..లోని కొన్ని సంకలనాలు.
నది రేపటి గీతం..
నది
ఈ నది
జీవనది..
నది తన ఇరు తీరాల భూజాల మీద
చరిత్రకందని సత్యాలను మోస్తున్నది..
నది నల్లని బండరాల్లను కరగదీస్తున్నది..
నది చెత్తా, కంపూ మెస్తూ
తెల్లని నురుగులు కక్కుతున్నది..
నదిలో
లోనదిలో
అగ్నిగుండం రగులుతున్నది..
పిల్ల కాలువలు తల్లి కాలువలు కదిలి రాగా
నది ఎర్రని నురుగులు కక్కుతున్నది..
ప్రాంతాలను విముక్తం చేసే జనవాహిని నది..
నది కదులుతున్నది
నది రేపటి గీతం..
నిట్టూర్పు సెగ..
పోలవరం
కొందరికి వరం
మరికొందరికి కలవరం
కాని
గిరిజనుల గుండెలపై
ఉప్పెన తాడవం...
మట్టి కోసం...
కలాలు సంకెళ్లు
తెంచుకొని
హలాల్లా సాగుతున్నాయి
పిడికెడు
మట్టికోసం
నినాదం..
ఎన్నో నినాదాల గోడలపై
అత్యున్నతమైనదేది
ఎన్నో వాగ్దానాల హోరు స్టేజీలపై
అత్యున్నతమైనదేది
చరిత్రలో నిలిచేది
చిరస్థాయిగా మిగిలేది..
ఆయన మాట..
రేపటికి రూపులేదంటాడు
వేదాంతి..
రేపటిలో ఆశను వెతుక్కుంటాడు
సామాన్యుడు..
రేపు తన వెంట నడుస్తుం
దంటాడు విప్లవకారుడు..
-- రేడియం (కొండన్న) కవిత సంకలనం --
Authorization