వేగంగా పరుగెత్తే జీవి అనగానే మనకు ముందుగా చిరుత పులే గుర్తుకు వస్తుంది. ఇది భూమ్మీదున్న జీవులన్నింటిలో వేగంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. దీన్ని మించిన వేగం సాధ్యమా? అంటే అవుననే చెప్పొచ్చు. పెరెగ్రిన్ ఫాల్కన్ అనే పక్షి వేటాడేప్పుడు గంటకు 321 కిలోమీటర్ల వేగంతో శత్రు జీవిపై దూకేస్తుంది. ఈ విషయంలో మొత్తం జీవరాశులన్నింటిలో దీని వేగమే ఎక్కువన్నమాట. అందుకే అత్యంత వేగవంతమైన జీవిగా దీనికి పేరు.