డెడ్‌సీలో ఎలాంటి జీవులూ బతకవు. అందుకనే దానికాపేరు. నిజానికి డెడ్‌సీ జోర్డాన్, ఇజ్రాయెల్ మధ్య ఉండే ఒక పెద్ద ఉప్పునీటి సరస్సు. దీని పొడవు 77 కిలోమీటర్లు. వెడల్పు 5 నుంచి 8 కిలోమీటర్ల మేర ఉంటుంది. సముద్రాలలోకెల్లా ఈ సముద్రంలోతు తక్కువ. సముద్రమట్టంకన్నా 396 మీటర్లు తక్కువగా ఉంటుంది. ఈ సముద్రంలో జోర్డాన్ నది, మరి కొన్ని కాలువలు కలుస్తాయి. దీనిలోని నీరు సూర్యరశ్మిలోని ఉష్ణంతో ఆవిరవుతూ ఉంటుంది. దాంతో జోర్డాన్నది, మిగతా కాలువలు మోసుకువచ్చే లవణాలు, నీటిలో కరిగి ఉండే ఖనిజాల పరిమాణం, కాలం గడిచేకొలదీ ఎక్కువవుతూ ఉంటాయి. మామూలుగా అన్ని సముద్రాల్లో ఉప్పు 4 శాతం నుంచి 6 శాతం ఉంటే, డెడ్‌సీలో 23 నుంచి 25 శాతం వరకు ఉంటుంది. అందులో అధిక మోతాదులో మెగ్నీషియంక్లోరైడ్, పొటాష్, బ్రోమిన్, కాల్షియం క్లోరైడ్, కొన్ని మిలియన్ టన్నుల పొటాష్ కలిసి ఉంటాయి. ఈ నీటిని రుచి చూస్తే హాని కలిగే ప్రమాదముంది.