హారు పిల్లలూ...! మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉందా..లేదంటే ఇప్పటి నుండే అలవాటు చేసుకోండి. పుస్తకం అంటే కొన్ని పుటల జోడింపో, కొన్ని పదాల కలయికనో, కొన్ని అక్షరాల మేళవింపో కాదు. అది చరిత్రను, వర్తమానాన్ని తనలో నిక్షిప్తం చేస్తున్న విజ్ఞాన భాండాగారం. గత చరిత్రను సజీవంగా మన ముందుంచే జ్ఞాపిక. విజ్ఞానాన్ని అందించే దీపిక. పుస్తకం సష్టించిన విప్లవం, మానవ సమాజంపై దాని ప్రభావం అంతా ఇంతా కాదు. సాధారణంగా మనకు సెలవులొస్తే ఊర్లకు... టూర్లకు వెళుతుంటాం. అదే అమెరికాలో అయితే... కుటుంబ సమేతంగా గ్రంథాలయాలకు వెళతారు. పిల్లలతో సహా పుస్తకాలు చదువుతారు. చదవడం అలవాటు చేస్తారు. ఇంత విలువైన పుస్తక పఠనం గురించి మన పెద్దవాళ్లు ఎంతో గొప్పగా చెప్పారు. అవేంటో తెలుసుకోవాలనుందా.. అయితే ఇవి చదవండి...