హాయ్ చిన్నారులూ..! మనకు కార్టూన్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఏదయినా హాస్య చిత్రమో లేదా వ్యంగ్య చిత్రమో. చిత్రం చిన్నదే ఐనప్పటికీ అందులో ఎన్నో విషయాలు దాగుంటాయి. కొన్ని చిత్రాలు నవ్వులు పండిస్తే, మరికొన్ని ఇప్పటి పండిస్తే,మరికొన్నిఇప్పటిపరిస్థితులను వివరిస్తూ ఉంటాయి. అందరినీ అప్రమత్తం చేస్తుంటాయి. అందుకే అంతటి విశేషమున్న ఈ కార్టూన్ చిత్రాలకు లండన్లో ఓ మ్యూజియం ఉంది. ఆ విశేషాలే ఈరోజు మనం తెలుసుకుందాం..
- వార్తా పత్రిక, టీవీ, చలనచిత్రం, యానిమేషన్ రంగాల్లో కార్టూన్లను చూస్తుంటాం. ఈ కార్టూన్లు భలే తమాషాగా ఉంటాయి. ఒకప్పుడు హాస్య కథలను సూచించడానికి వీటిని ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం అనేక రంగాల్లో వీటిని ఉపయోగిస్తున్నారు.
- కార్టూన్ చిత్రాలను చూడటానికి అందరూ ఇష్టపడతారు. వాటిని చూస్తూ చిరునవ్వులు చిందిస్తుంటారు. అంతటితో ఊరుకోకుండా ఆ చిత్రాల స్ఫూర్తితో స్కెచ్ చేతపట్టి స్నేహితుల వ్యంగ్య చిత్రాలు గీస్తూ ఎంజారు చేస్తుంటారు. మరి బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఇప్పటివరకు బోలెడు వ్యంగ్య, హాస్య కార్టూన్ చిత్రాలు చూడాలంటే లండన్లోని ది కార్టూన్ మ్యూజియానికి వెళ్లాల్సిందే.
-1988 తరానికి చెందిన కొంతమంది కార్టూనిస్టులు, కార్టూన్ ప్రియులు కలిసి 'ది కార్టూన్ ఆర్ట్ ట్రస్ట్'ను ప్రారంభించారు. అపూరూపమైన, అరుదైన, అద్వితీయమైన కార్టూన్ చిత్రాలను కలెక్ట్ చేయడంతో పాటు వాటిని భద్రపరచడానికి ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. అలా వారు కలెక్ట్ చేసిన కార్టూన్ చిత్రాలతో 2006లో కార్టూన్ మ్యూజియాన్ని లండన్లో ప్రారంభించారు.
- బ్రిటీష్ కార్టూనిస్టులకు చెందిన కార్టూన్లే ఇందులోఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలోనే మొదటి కార్టూన్ మ్యూజియం కూడా ఇదే కావడం విశేషం. ఈ మ్యూజియంలో ప్రధానంగా మూడు భాగాలున్నాయి. వీటితో పాటు కార్టూన్ బొమ్మలు, కామిక్స్, క్యారికేచర్లు, యానిమేషన్ కోసం గీసిన బొమ్మలు ఇలా వేటికవే ఆకట్టుకుంటాయి. దినపత్రిక, మ్యాగజైన్, వివిధ పుస్తకాల్లోని బోలెడు వ్యంగ్య, హాస్య చిత్రాలను ఇక్కడ చూడవచ్చు. ఎంతోమంది కార్టూనిస్టులు గీసిన 1700 కార్టూన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
- ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన కొన్ని వ్యంగ్య చిత్రాలను భారీ పరిమాణంలో తయారుచేసి ఇందులో ప్రదర్శనకు పెట్టారు.
- కామిక్, వ్యంగ్య, హాస్య పుస్తకాలతో కూడిన ఓ గ్రంథాలయం మ్యూజియం సొంతం. కార్టూన్ల చరిత్రతో పాటు, కార్టూన్ చిత్ర కళలో ఎలాంటి మార్పులు వచ్చాయి, వాటిని గీసే విధానం, సమాజంపై వాటి ప్రభావం వంటి అంశాలపై ఎన్నో పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. దాదాపు ఆరు వేలకు పైగా పుస్తకాలున్నాయి.
- ఉత్తమ కార్టూనిస్టుకు ప్రతి సంవత్సరం మ్యూజియం తరుపున క్యాట్ అవార్డునిచ్చి సత్కరిస్తారు. ప్రతి సంవత్సరం చిన్నారుల కోసం ప్రత్యేక వర్క్షాపు నిర్వహిస్తారు. ప్రముఖ కార్టూనిస్టులు కార్టూన్ గీయడంలో చిన్నారులకు మెలకువలు నేర్పిస్తారు.
Authorization