మారథాన్ పరుగు ప్రపంచం యావత్తు ప్రేమించే పరుగు. అదంటే ఎందుకంత పిచ్చి ప్రేమో ఎవరికీ తెలియదు. లక్షల మంది ప్రపంచ మొత్తంలో ఈ పరుగులో పాల్గొంటారు. వందలాది మంది ఇతరులతో పోటీపడి, నలభై రెండు కిలోమీటర్లు అతి త్వరగా పరిగెత్తేందుకు ఉత్సుకత చూపిస్తారు. అందరిలో అతివేగంగా పరుగెత్తిన క్రీడాకారుడు ఆ దూరాన్ని రెండు గంటలకు కాస్త ఎక్కువ సమయంలో చేధించగలడు. ఇతరులు కొన్ని గంటల తరువాత గమ్యాన్ని చేరుకుంటారు. ప్రస్తుతం జరుగుతున్న మారథాన్లకు, పాత అలవాటుకు ఒక విషయంలో మాత్రమే పోలిక ఉంది. అది దూరం విషయం. మొట్టమొదట జరిగిన మారథాన్ ఒక పరుగు పందెం కాదు. ఒకే ఒక వ్యక్తి ఆ దూరం పరిగెత్తాడు. కాని గమ్యాన్ని చేరుకొని చనిపోయాడు. ఈ సంఘటన క్రీస్తు పూర్వం 490లో జరిగింది. ఆ సంవత్సరం గ్రీకులు ఒక ముఖ్యమైన యుద్ధాన్ని పర్షియన్ల మీద గెలిచారు. ఆ యుద్ధం మారథాన్ అనే ప్రదేశపు మైదానంలో జరిగింది. ఆ యుద్ధభూమి ఏథెన్స్ నగరానికి ఉత్తరంగా నలభై కిలోమీటర్ల దూరంలో ఉండింది. ఒక వ్యక్తి ఆ మంచి వార్తను ఏథెన్సు నగరానికి పరుగెత్తుకెళ్లి చేరవేశాడు. కానీ ఆయాసంతో కుప్పకూలి చనిపోయాడు. అప్పటి నుండి జరుగుతున్న మారథాన్ పరుగుపందాలలో ఆ దూత గొప్ప సాహస చర్యనే కాదు, ఆయన పట్టుదలను, ఆయన అమోఘమైన పాదపటిమను కూడా ప్రస్తుతిస్తారు.
Authorization