మనం ఎప్పుడైనా పార్కులో నడుస్తున్నప్పుడు మొక్కల దగ్గరికి వెళ్లగానే వాటి పూల వాసన మన ముక్కు పుటలను పలకరిస్తుంది. అసలు పూలకు ఎందుకు ఆ పరిమళం ఉంటుంది? కారణం ఏమిటంటే ఒక్కో పూవు ఒక్కో తైలాన్ని స్రవిస్తుంది. ఈ తైలమే గాలిలో కలిసిపోయి ఆ చుట్టు పక్కల ప్రాంతంలో పరిమళంతో గుభాళిస్తుంది. మనం వాడే చాలా రకాల సెంటులను ఇటువంటి పూల నుంచే తయారు చేస్తున్నారు. పూలను కుండలో వేసి వేడి ఆవిరిలో మరగనిస్తారు. ఆవిరి నుంచి సువాసనను వేరు చేసి సీసాల్లో నింపుతారు. గులాబీ, మల్లె, చామంతి తదితర పూల నుంచి వీటిని సేకరిస్తారు. ఫ్రాన్స్ దేశం అత్యధికంగా సెంటు సీసాలను ఉత్పత్తి చేస్తోంది. 110 కిలోల గులాబీ పూల నుంచి పదహారు గ్రాముల సెంటు తీస్తారని తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల రకాల పూలు ఉన్నాయి.