హఠాత్తుగా శరీరానికి ఏం తగిలినా ఉలిక్కిపడి దులిపేసుకుంటాం. అదే అసంకల్పిత ప్రతీకార చర్య. చక్కిలిగింత కూడా అంతే! మన మెదడులోని సెరిబెల్లమ్ శరీరం మీద ఓ కన్నేసి ఉంచుతుంది. చర్మం కింద ఉన్న నరాల ద్వారా కదలికల్ని కనిపెడుతూ ఉంటుంది. ఎవరైనా చక్కిలిగింతలు పెట్టినపుడు అసంకల్పిత ప్రతీకార చర్యగా మన శరీరం స్పందించేలా ఆదేశిస్తుంది. అదే చక్కిలిగింత. తమాషా ఏంటంటే... మనకు మనం చక్కిలిగింతలు పెట్టుకోలేం. అవి మన చేతులే అని సెరిబెల్లానికి తెలుసుగా...!