మాలీఫౌల్... ఇవి పెద్ద ఎత్తున ఇసుకను గుట్టలు చేసి అందులో గుడ్లు పెడుతుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా వీటి సంఖ్య చాల తక్కువగా ఉంది. మొత్తం కలిపి 10 వేలకు మించి లేవు. ఎక్కువగా దక్షిణ ఆస్ట్రేలియాలోనే కనిపిస్తాయి. సంవత్సరానికి 300 టన్నుల ఇసుకను మేటవేయగలదట. దీని తల నీలం రంగులో ఉంటుంది. కండ్లు పెద్దగా, ముక్కు చిన్నగా నల్లగా ఉంటాయి. కంఠభాగం కొంత ఎరుపు రంగులో, ఆ కింద టై కట్టినట్టు నలుపు-తెలుపు ఈకలు ఉంటాయి. రెక్కలు కూడా నలుపు, తెలుపు రంగుల వరుసతో ఉంటాయి. తోక చాలా చిన్నగా ఉంటుంది. ఇవి సుమారు 150 గ్రాముల బరువు, 24 అంగుళాల పొడవు ఉంటాయి. వీటి రెక్కలు 13.5 అంగుళాల వరకు విస్తరిస్తాయి. జూన్, ఫిబ్రవరి మధ్య సుమారు 24 గుడ్లు పెడతాయి. ఈ పక్షులు విత్తనాలు, పువ్వులు, పండ్లనే తింటాయి.