గోపాలం, వీర్రాజు మంచి మిత్రులు. ఇరుగు, పొరుగు ఇండ్లలో ఉంటారు. వాళ్ల పిల్లలు సురేష్, వినోద్‌లు ఒకే తరగతి చదువుతున్నారు. గోపాలం వాళ్ల అబ్బాయి సురేష్ నెమ్మదస్థుడు. వీర్రాజు కొడుకు వినోద్ అల్లరి వాడు.
వినోద్ అల్లరి గురించి వీర్రాజు, గోపాలం దగ్గర బాధపడేవాడు. వినోద్ ఇంకా చిన్నవాడనీ, ఎదిగాక అతనే మారతాడని చెప్పేవాడు గోపాలం. అయినా వీర్రాజు వినోద్‌ని, సురేష్‌తో పోల్చి 'ఇద్దరూ ఒక ఈడు వాళ్లే కదా! మరి సురేష్‌లో ఉన్న అణుకువా, నెమ్మదీ వినోద్‌కి అబ్బడం లేదెందుకు?' అనేవాడు.
పిల్లల్ని పెంచే విధానం వల్లనే వారికి అలవాట్లు అబ్బుతాయన్నది గోపాలం అభిప్రాయం. ఈ విషయం వీర్రాజుకి చెబుదామనుకున్నాడు. కానీ.. అనుభవ పూర్వకంగా తెలిస్తేనే ఫలితం ఉంటుందని ఊరుకున్నాడు. ఒకరోజు తండ్రులిద్దరికీ సురేష్, వినోద్ ఆడుకుంటూ కనిపించారు. సురేష్‌తో గోపాలం 'బాబూ! చీకటి పడకముందే ఇంటికొచ్చి చదువుకో సరేనా! అన్నాడు సౌమ్యంగా. అందుకు సురేష్ 'సరే నాన్నా' అంటూ ఆటలో మునిగిపోయాడు. కొడుకుని చూస్తూనే వీర్రాజు 'ఎంతసేపూ ఆటలేనట్రా? ఇలా ఆడుతూ చదువు మానేస్తే చెడిపోతావ్. ఇంటికి పద..! అని కోప్పడ్డాడు. వినోద్ కూడా అంతే చిరాగ్గా 'ఇంకాసేపు ఆడుకుని వస్తాలెండి' అని చెప్పి వెళ్లిపోయాడు.
'చూశావా గోపాలం వీడి పొగరు' అంటూ వీర్రాజు గోపాలంతో ఆ సమస్యను మొరపెట్టుకోబోయాడు. వీర్రాజులో మార్పు తీసుకురావడానికి ఈ సంఘటనే చాలు అనుకుంటూ గోపాలం 'వీర్రాజూ! వినోద్‌ని సరైన దారిలో పెట్టబోయే ముందు నీలో కూడా కొద్దిగా మార్పు రావాలి' అన్నాడు.
వీర్రాజుకి అర్థం కాక 'నువ్వేం చెబుతున్నావో అర్థం కావడం లేదు' అన్నాడు గోపాలంతో. వెంటనే గోపాలం 'చిన్న పిల్లల్ని మనంమందలించినపుడు మంచిని చెబుతూ కోప్పడాలి. చెడుని గుర్తుచేస్తూ ఏవగించుకోకూడదు. చక్కగా చదివితే గొప్పవాడివి అవుతావని బుజ్జగిస్తూ చెప్పాలి. అంతే తప్ప చదవకపోతే చెడిపోతావ్ అంటూ వాళ్ల మనసుల్ని కలుషితం చేయకూడదు' అన్నాడు. వీర్రాజు మౌనంగా వింటున్నాడు. 'నేను సురేష్‌ని 'చదువుకో' అంటూ నెమ్మదిగా చెప్పాను. కానీ నువ్వు 'చెడిపోతావ్' అంటూ చెడును ఉదహరించావు. దానివల్ల చెడు ముందుగా ఒంటబడుతుంది. అందుకే వాడు క్రమేపీ మొండివాడిగా తయారవుతున్నాడు. వినోద్‌లో మార్పు రావాలంటే ముందు తండ్రిగా నీలో మార్పు రావాలి. తిడుతూ ఏం చేయకూడదో చెప్పేకంటే.. సౌమ్యంగా చెప్పి చూడాలి. మన పెంపకం పైనే పసివాళ్ల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది.' అని అనునయంగా చెప్పాడు. ిాతుడి హితబోధకి వీర్రాజు 'గోపాలం! నాకు తెలియకుండా వినోద్‌లో మొండితనాన్ని ప్రేరేపిస్తున్నానని అనిపిస్తోంది. ఇక మీద నువ్వు చెప్పినట్టే నేను మారి, వినోద్కీ సత్ప్రవర్తన అలవాటు చేస్తాను' అన్నాడు. అన్నమాట ప్రకారం పరివర్తన కలిగిన వీర్రాజు పెంపకంలో వినోద్ కూడా సురేష్లాగే బుద్ధిమంతుడిగా మారాడు. ఆపై పిల్లలిద్దరూ ఇద్దరూ ఇద్దరే అనిపించుకున్నారు.
Authorization