బ్రిటన్ వాసులు ఎంతో ఇష్టపడే పక్షి యూరేషియన్ రాబిన్. ఇది అరిస్తే పాటపాడినట్టే ఉంటుందట. యూరప్‌లో అనేక ప్రాంతాల్లోని పార్కులు, తోటల్లో ఈ పక్షి కనపడుతుంది. నివాస స్థావరాన్ని కాపాడుకోవడంలో కొన్నిసార్లు గాయపడుతుంటుంది. షెట్లాండ్స్లో తప్ప బ్రిటన్ అంతటా కనపడుతుంది. అలాగే యూరప్ నుంచి మధ్య ప్రాచ్యం వరకూ పశ్చిమ సైబీరియాలో, అలాగే ఉత్తర ఆఫ్రికాలోనూ కనపడుతుంది. పొట్టి ముక్కు, కంఠం, పొట్టభాగమంతా ఎరుపు పసుపు, తెలుపు రంగులతో, మిగతా భాగమంతా బూడిద రంగులో ఉంటుంది. యూరప్ దేశాల్లో చాలా మంది వీటిని ఎంతో ముద్దుగా పెంచుకుంటుంటారు. 0.7 ఔన్సుల బరువు, 5.5 అంగుళాల పొడుగు ఉంటుంది. వీటి రెక్కలు 9 అంగుళాలు విస్తరిస్తాయి. మార్చి, జులై మధ్యకాలంలో సుమారు 6 గుడ్లు పెడుతాయి. ఇవి ఎక్కువగా గింజలు, బెర్రీలు తింటాయి.