మేకలకు ఆతృత ఎక్కువ! వింత వాసన వచ్చిందంటే, ఏదో కొత్తది దొరికిందని తినేస్తూనే ఉంటాయి. ప్లాస్టిక్ టిన్నులు, కార్డు బోర్డులతో సహా! అయితే ఎక్కువగా ఆకులు, దుంపలు మేస్తాయి. కాలి గిట్టల ప్రత్యేకతతో ఎలాంటి కొండిపాంతమైనా సరే దాటేస్తాయి. గుంపులుగుంపులుగా ఉన్నప్పుడు తప్పించకోవాలనే ఉద్దేశంతో కావాలనే చుట్టూ ఉన్న కంచెను పరీక్షిస్తాయి. ఒక్క మేక ముండ్ల కంచెను దాటేసిందా.. మిగతావన్నీ వెనకే బయటికి వెళ్లిపోతాయి. అలవాటైన మనుషులతో దొరక్కుండా ఆడుకోవడం వీటికి సరదా. గొర్రెలతో పోలిస్తే మాత్రం ఒకదాన్ని మరొకటి అడ్డదారిలో అనుసరించవు. ఇవి మనుషుల హావభావాలను పసిగట్టగలవు. కుక్కల మాదిరిగానే మచ్చికగా ఉండగలవు.