నక్కలు గుంపులుగా జీవిస్తాయి.కానీ ఎక్కువభాగం ఒంటరిగానే జీవిస్తాయి. ఒంటరిగానే వేటాడుతాయి. నక్కల గుంపును 'స్కల్క్, లీష్' అంటారు. మగ నక్కను 'డాగ్ ఫాక్స్', ఆడనక్కను 'విక్సెన్' అంటారు. నక్క పిల్లలు పుట్టిన వెంటనే చూడలేవు. వినలేవు. నడవలేవు. అందుకే నక్కలు పిల్లలను జాగ్రత్తగా రక్షించుకుంటాయి. నేలను తవ్వి నేలమాళిగలో పిల్లలను దాస్తాయి. శత్రుజంతువుల నుంచి పిల్లలకు ప్రాణహాని కలగకుండా ఆ జాగ్రత్త. ఈ సమయంలో ఆడ నక్కలు నక్క కూనల సంరక్షణలో ఉంటే తండ్రి నక్క వాటికి ఆహారం సంపాదించి తెచ్చిపెడుతుంది. నక్కల కంటిపాపలు నిలువుగా ఉంటాయి. దాంతో చాలా దూరం నిశితంగా చూడగలుగుతాయి. చెవులు కూడా అంతే చురుగ్గా పనిచేస్తాయి. 40 గజాల దూరంలో చిన్న అలికిడిని కూడా స్పష్టంగా వినగలుగుతాయి. ఇవి నిర్మానుష్య ప్రదేశాలు, మైదానాలు, పర్వతాలు, అడవులు, ఎడారులు, గడ్డిభూములలో కూడా జీవిస్తాయి. నక్క అరుపును ''ఊళ'' అంటారు.