వేసవిలో భూగర్భజలమట్టం పడిపోతుంది. దాంతో నీటి సరఫరా తగ్గిపోతుంది. అందుకని నీటిని జాగ్రత్తగా వాడాలి.. ఎలాగంటే.... మాటిమాటికీ నల్లా వదిలి ఉంచొద్దు. ఏ అవసరానికైనా నీటిని బకెట్లో పట్టుకుని చెంబుతోనో, మగ్తోనే వాడుకోవాలి. బ్రష్ చేసేటప్పుడు కుళాయి వదిలేసి ఆడుతుంటారు కదా! కానీ ఒక నిమిషం పాటు కుళాయిని తిప్పి వదిలేస్తే దాదాపుగా 5 లీటర్ల నీరు వృథా అవుతుంది. చూశారా ఎంత నీటిని వృథా చేస్తున్నామో! స్నానం చేసేటప్పుడు నీటిని అనవసరంగా పారబోసేస్తాం కదా! అట్లా చెయ్యొద్దు. వాష్ బేసిన్లలో నీళ్లు నెమ్మదిగా, తక్కువ పరిమాణంలో వచ్చేలా పంపుల్ని తిప్పాలి. బండ్లను పైపులతో కాకుండా బకెట్లోకి నీటిని పట్టుకుని మగ్లతో కడిగితే నీరు ఆదా.. వాహనాలు కడిగిన నీటిని మొక్కలకు వెళ్లేలా చూడటం మంచిది.