బేసిలిస్క్. ఇవి బల్లి జాతికి చెందినవి.నీటిమట్టం మీద అతివేగంగా పరుగెత్తగలవు. ఎక్కువగా చెరువులు, నదుల వద్దనే ఉంటాయి. ఇవి మధ్య అమెరికాలో దక్షిణ మెక్సికో నుంచి పనామా వరకూ ఉన్న ఉష్ణమండల వర్షాధార అడవుల్లోనే ఎక్కువగా ఉంటాయి. దాని తల మీద ఎత్తుగా కిరీటం లాగా ఉంటుంది. అందుకే దానికి 'కింగ్' అనే పేరు కూడా ఉంది. ఇవి ఆలివ్, గోధుమ రంగుల్లో ఉంటాయి. వీటి బలమంతా తోకలోనే ఉంటుంది. వీటికి పెద్ద నోరు, రంపం లాంటి పళ్లు ఉంటాయి. ఇవి ప్రమాదాన్ని గ్రహించి నేలలో దాక్కోగలవు లేదంటే అతి వేగంగా తప్పించుకోగలవు. ఈ బేసిలిస్కులు కీటకాలను, పాములను, కొన్ని పక్షులను, గుడ్లు, చేపలను ఆహారంగా తీసుకుంటాయి.Q