ఎత్తునుండి వస్తువులు నేలపై పడటానికి కారణం భూమికి గల గురుత్వాకర్షణ శక్తేనని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ కనుగొన్నాడు. ఈ బలం ఆ వస్తువు బరువుపై ఆధారపడి ఉంటుంది. తేలికైన వస్తువు కన్నా, బరువైన వస్తువుపైనే గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా పనిచేస్తుంది. భూమి వస్తువును తన వైపుకు ఆకర్షించే బలానికి వ్యతిరేక దిశలో వాతావరణంలో గాలివల్ల ఏర్పడే నిరోధక బలం వస్తువు ఉపరితల వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది. ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉంటే నిరోధక బలం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక ఎత్తు నుండి చీమలలాంటి తేలిక జీవుల విషయానికొస్తే వాటిపై పనిచేసే గురుత్వాకర్షణ బలం, గాలి నిరోధక శక్తి చాలా వరకు సమానంగా ఉండటం వల్ల అవి సమవేగంతో నేలను చేరుతాయి. అందువల్ల వాటికి దెబ్బ తగలదు. ఒక వేళ ఆ సమయంలో గాలి తీవ్రంగా వీస్తే చీమల్లాంటి కీటకాలు ఆ గాలివాలులో కొట్టుకుపోతాయి.