బుష్పిగ్ అనేది పందిజాతికి చెందిన క్షీరదం. వీటిలో ఆరు ఉపజాతులు ఉన్నాయి. ఇవి ఉత్తర, దక్షిణ ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తాయి. గడ్డిభూములు, నదీతీరంలో ఉండే అరణ్యాలు, చిత్తడినేలలు, రెల్లుగడ్డి నేలల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి రాత్రి సమయంలో చురుకుగా ఉంటాయి. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో ఇవి కేవలం శాకాహారం మాత్రమే తింటాయి. వీటిని వేటాడుతున్నప్పటికీ, వీటి సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. వీటి మనుగడకు ఎటువంటి ప్రమాదమూ లేదు. ఇవి 39-59 అంగుళాల వెడల్పు, 26-39 అంగుళాల ఎత్తు, 121-33- పౌండ్ల బరువులో ఉంటాయి. ఆడవాటి కంటె మగవి పెద్దవిగా ఉంటాయి. ఒళ్లంతా గరుకుగా ఉండే ఎరుపు, గోధుమరంగు, బూడిద రంగులు కలిసిన బొచ్చుతో కప్పబడి ఉంటుంది. వెన్ను నుంచి మెడభాగం వరకు తెల్లగాను, ముఖం లేత రంగు బొచ్చుతోను కప్పబడి ఉంటుంది. కండ్లు చిన్నవిగా ఉంటాయి. చెవులు పెద్దవిగా, మొనదేలి ఉంటాయి. శరీరం దృఢంగాను, కాళ్లు పొట్టిగాను ఉంటాయి. కింది పళ్లు పెద్దవిగాను, పై పళ్లు కనపడకుండాను ఉంటాయి. ఈ పళ్లతోనే శత్రువును ఎదుర్కొంటాయి. ఇవి రాత్రి సమయంలో చురుకుగా ఉంటాయి. ఇవి మాంసాహారం, శాకాహారం రెండూ తింటాయి. చెట్టు వేర్లు, పండ్లు, వానపాములు, పురుగుల లార్వాలు... తింటాయి. అప్పుడప్పుడు కోతులను అనుసరించి, అవి విడిచిపెట్టిన ఆహారాన్ని తింటాయి. ఇవి 4-10 వరకు గుంపులుగా నివసిస్తాయి. రకరకాల ధ్వనులతో సమాచారం అందించుకుంటాయి. పది అడుగుల వెడల్పు, మూడు అడుగుల ఎత్తులో గడ్డితో గూడు నిర్మిస్తాయి. నాలుగు నెలలు గర్భం ధరించాక 2-4 పిల్లల్ని ఈ గూళ్లలో పెడతాయి. పుట్టిన పిల్లలు కొన్ని రోజుల పాటు ఈ గూటిలోనే ఉంటాయి.
Authorization