రిఫ్రిజిరేటర్ (ఫ్రిజ్)లో మంచు గడ్డలు తయారయ్యే భాగాన్ని 'ఫ్రీజర్' అంటారు. ఇది ఫ్రిజ్‌లో అన్ని భాగాలకంటే పైన ఉంటుంది. అయితే ఫ్రీజర్‌ను ఎక్కడో ఒక చోట అమర్చకుండా ఫైభాగంలోనే ఏర్పాటు చేయడానికి కారణంఉంది. ఫ్రిజ్ అంతటిలోనూ వేడిని తొలగించే భాగం ఫ్రీజర్‌లోనే ఉంటుంది. దీని చుట్టూ అమర్చిన గొట్టాలలో అమోనియా లేక ఫ్రియాన్ ద్రవం ఆవిరై, చల్లబడుతూ ఉంటుంది. ద్రవం ఏదైనా సరే, ఆవిరి అయినప్పుడు వేడిని పీల్చుకుంటుంది. ఈవిధంగా ఫ్రీజర్‌లో ఏర్పడిన చల్లదనం ఫ్రిజ్‌లోని తక్కిన భాగాలన్నిటికీ సరఫరా అవుతుంది. గాలి ప్రవాహాల వల్ల ఫ్రీజర్ దగ్గర ఉన్న గాలి చల్లబడుతుంది. చల్లని గాలి వేడిగాలి కన్నా బరువుగా ఉంటుంది. కాబట్టి కిందికి దిగుతుంది. కిందనున్న వేడిగాలి పైకి లేచి ఫ్రీజర్‌కు తగిలి, చల్లబడి బరువెక్కి మళ్లీ కిందకు దిగుతుంది. ఫ్రీజర్ అన్నిటికంటే పైన ఉండటం వల్లనే చల్లబడిన గాలి కిందకు దిగడం అనేది సాధ్యం అవుతుంది.