హారు... చిన్నారులూ... హోలీ వచ్చిందంటే చాలు రంగుల యుద్ధానికి సిద్ధమయిపోతారు. చిన్నా, పెద్దా అంతా కలిసి రంగుల్లో మునిగిపోతారు. అయితే నేడు కృత్రిమ రంగులు వాడి అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. అలా కాకుండా సంతోషంగా హోలీ వేడుక జరుపుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి...
- శీతాకాలం చివర్లో ఫిబ్రవరి-మారి ్చ నెలల మధ్య ఫాల్గుణ మాసంలో, పూర్ణిమ రోజున వచ్చేదే హోలీ పండుగ. క్రీ.పూ. 300 ఏండ్ల నాటి శిలాశాసనాల్లోనే 'హోలికోత్సవం' ప్రసక్తి కనిపిస్తుంది. ఆర్యుల కాలంలో ఈ పండగ ప్రాశస్త్యం ఉందని చరిత్రకారులు అంటున్నారు. ఆ కాలానికి చెందిన మందిరాలపై ఉన్న శిల్పాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి.
- ఈ పండుగను మనదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా ఇంకా మన భారతీయులు ఉండే అన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. ఒక్కో ప్రాంతంలో ఒకో రీతిలో వాళ్ల వాళ్ల నమ్మకం, సంప్రదాయం ప్రకారం ఈ పండగ జరుపుకుంటారు.
- హోలీ సమయంలో వాతావరణంలో మార్పులు జరగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే సహజమైన రంగులను చల్లుకోవడం వల్ల ఔషధంగా పనిచేస్తాయని ఆయుర్వేదం సూచిస్తోంది. ఈ రంగులను మోదుగుపూలు (అగ్నిపూలు), వేప, బిల్వపత్రాలు, పసుపు, కుంకుమలను నీళ్లలో కలిపి చల్లుకునేవాళ్లు. ఇవి పర్యావరణానికి కూడా మేలు చేసేవి. తయారు చేసుకోవడమూ సులువే. ఆకులు, పువ్వులు, గింజల్ని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. లేదంటే నీళ్లలో నానబెట్టి, ఉడకబెట్టి తయారుచేసుకోవచ్చు.
ఎరుపు రంగు: గంధం, ఎర్ర మందార పువ్వులు, మోదుగ పువ్వులు, గోగుపూలు, దానిమ్మ తొక్క, టమాటా, బీట్రూట్ దుంప, సున్నం (కాస్తంత), పసుపుల మిశ్రమం.
పసుపు రంగు: పసుపు, శనగపిండిల మిశ్రమం, బంతి, చామంతి పూలు.
ఆకుపచ్చరంగు: గోరింటాకు, గుల్మోహర్ ఆకులు, గోధుమ మొలకలు, పాలకూర, కొత్తిమీర, పుదీనా, టమాటా మొక్క ఆకులు.
నలుపు రంగు: ఉసిరికాయల్ని రుబ్బి తయారుచేయొచ్చు. ఇంకొన్ని రంగుల కోసం, టీ కాఫీ పొడులను మరగబెట్టిన నీళ్లు వాడుకోవచ్చు.
కృత్రిమ రంగులతో జాగ్రత్త
- నల్లరంగులో ఉండే లెడ్ ఆక్సైడ్ వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి.
- సిల్వర్-అల్యూమినియం క్యాన్సర్‌ను కలిగిస్తుంది.
- ఎరుపు-మెర్కూరీ సల్ఫేట్ వల్ల క్యాన్సరే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమిస్తాయి.
- నీలం-ప్రూషియన్ చర్మవ్యాధులను కలుగజేస్తుంది.
- ఆకుపచ్చ- కాపర్ సల్ఫేట్ కంటి దురదలు, ఉబ్బడం, అంధత్వానికి కూడా దారితీయవచ్చు
ఈ రంగుల్లో ముదురు వర్ణం కోసం వాడే ఆస్బెస్టాస్ పొడివల్ల ఆస్తమా, చర్మవ్యాధులు తాత్కాలిక అంధత్వం కలిగే ప్రమాదం ఉంది.
Authorization