స్నోలెపర్డ్.. ఇవి హిమాలయాలు, టిబెట్ పీఠభూమి తో పాటు మధ్య ఆసియాలోని 12 దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఎత్తైన మంచు పర్వతాల మీద మూడు నుంచి నాలుగున్నర వేల మీటర్ల ఎత్తులో మాత్రమే నివసిస్తాయి. వీటి దేహం 3-4 అడుగుల పొడవు ఉంటుంది. బరువు సుమారుగా 50 కేజీలు. మంచు మీద నడవడానికి వీలుగా వాటి కాళ్లకు పాదరక్షల వంటి నిర్మాణం ఉంటుంది. పాదం మొత్తం వెడల్పుగా జుట్టు, పాదం మధ్యలో రంధ్రాలు ఉంటాయి. అవి బరువును సమతూకంగా ఒత్తిడిపడేటట్లు, మంచు నేరుగా దేహానికి తగలకుండా రక్షణగానూ పనిచేస్తాయి. వీటికి శత్రువుతో పోరాడే శక్తి అపారం. తమ దేహం బరువు కంటే మూడింతల బరువున్న జంతువుతో కూడా పోరాడి వాటిని చంపేస్తాయి. ఇవి ఒక్క గెంతులో 9 మీటర్ల దూరం వెళతాయి. ఐబెక్స్, నీలి గొర్రె హిమాలయాల్లో నివసించే థర్ జంతువులు స్నో లెపర్డ్ల ప్రధాన ఆహారం. ఈ చిరుతలు ఒక నీలి గొర్రెను పూర్తిగా తిన్న తర్వాత వారం రోజులు మరేమీ తినవు. వీటి ఒంటి మీద జుట్టు తెలుపు, లుపు, గోధుమ రంగుల్లో ఉంటుంది. ఏ రెండు చిరుత పులుల మచ్చలూ ఒకే ఆకారంలో ఉండనట్లే... దీని ఒంటిమీద మచ్చలు కూడా వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి..