ఒక గడియారములో రెండు ముళ్లు పోట్లాడుకుంటున్నాయి. ఇంతలో మూడవ ముల్లు కలుగజేసుకుని, అనవసరంగా పోట్లాడుకోకండ్రా, గడియారానికి మన ముగ్గురమూ ప్రాణమే అన్నది. అందుకు కొట్లాడుకుంటున్న ముళ్లలో ఒక ముల్లు ఇలా అన్నది. ''నువ్వా నాకు నీతులు చెప్పేది, నేను ఒక్క నిమిషములో చేసే కోణము నువ్వు 12 గంటల్లో కానీ చేయలేవు. నీ బోడి సలహా నాకు నచ్చదు అన్నది'' అయితే పోట్లాడుకున్న ముళ్లేవి? హితవు చెప్పిన ముల్లు ఏది? జవాబు: గడియారంలో సెకనుల ముల్లు, నిమిషముల ముల్లు, గంటల ముల్లు అని మూడు ముళ్లు ఉంటాయి కదా! సెకనుల ముల్లు ఒక నిముషంలో ఒక చుట్టు తిరుగుతుంది. అనగా 360 డిగ్రీల కోణం ఒక నిమిషంలో చేస్తుంది. నిమిషముల ముల్లు 1 గంట అనగా 60 నిమిషాలలో ఒక చుట్టు తిరుగుతుంది. అంటే 60నిమిషాలలో 360 డిగ్రీల కోణము చేస్తుంది. అంటే 60 నిమిషాలలో 360 డిగ్రీల కోణము చేస్తుంది. ఇక మిగిలిన గంటల ముల్లు 12 గంటలలో ఒక చుట్టు తిరుగుతుంది. అంటే 12 గంటలకు గాని 360 డిగ్రీల కోణము చేయలేదు. కనుక పోట్లాడుకుంటున్న ముళ్లు సెకనుల ముల్లు, నిమిషముల ముల్లు. హితవు చెప్పిన ముల్లు గంటల ముల్లు.