యూరేషియన్ స్పారో హాక్ ...చిన్న పక్షులను గాలిలో ఎగిరే సమయంలో ఉన్నట్టుండి వాటి తోకను పట్టి లాక్కెళ్లిపోతుంది. చాలాకాలం పొలాల్లో క్రిమిసంహారక మందుల వాడకం వల్ల ఇవి అంతరించే స్థితికి వచ్చింది. ఇవి ఎక్కువగా యూరప్, ఆఫ్రికా, ఉత్తర ఆసియా, తూర్పు జపాన్లలో కనపడుతుంది. చలికాలంలో దక్షిణ ప్రాంతాల్లోకి వెళ్లిపోతుంది. వెలుగు అంతగా లేని ప్రాంతాల్లో గుబుర్ల వెనుక ఉన్న వాటిని కూడా స్పష్టంగా చూడగలుగుతాయి. వీటి ముక్కు పొట్టిగా బలంగా వొంపుతిరిగి ఉంటుంది. మెడ కింది భాగం అంతా తెలుపు, ఎరుపు రంగులో, వీపు, రెక్కలు నలుపు బూడిద రంగులోనూ ఉంటాయి. సుమారు 1 ఔన్సుల బరువు, 15 అంగుళాల పొడవు ఉంటాయి. రెక్కలు 28 సెంటీమీటర్లు విస్తరిస్తాయి. ఏప్రిల్-జూన్ మాసాలలో గుడ్లు పెడతాయి. ఇవి ఎక్కువగా వీటికంటే చిన్న, మోస్తరు పెద్ద పక్షులను తింటాయి. చిన్న పక్షులను ఏడిపిస్తాయి.