గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు, చెట్లు ఎక్కువగా ఉండడంతో వాతావరణం చల్లగా ఉంటుది. మిగతా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 46 డిగ్రీల వరకు ఉంటుంది. రాత్రి సమయంలోనూ వేడితగ్గడం లేదు. ఇలాంటి స్థితిలో ఆటలు ఆడడంలో ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తప్పనిసరి. ఉదయం 9 లోపు, సాయంత్రం 5 గటల తర్వాత శిక్షణ తీసుకోవడం మంచిది.
దుస్తులు: క్రీడల్లో శిక్షణ పొందే క్రీడాకారులు మందంగా ఉండే దుస్తులు ఉపయోగించొద్దు. కాటన్లాగా ఉండే వాటినే వేసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళలో శిక్షణకు హాజరయ్యేవారు ఉదయం వేసుకున్న దస్తులను సాయంత్రం వేసుకోవద్దు. ఉతికిన తర్వాతే వేసుకోవాలి. షూలు వేసుకుని శిక్షణ తీసుకునేవారు సాక్సులు సైతం ఒకేపూటకు వేసుకోవాలి. షూలు జాలి ఉండేలా వేసుకుంటే మంచిది.
వాటర్: ఉదయం శిక్షణకు వెళ్లే క్రీడాకారులు తగినంత నీరు తాగాలి. తమ వెంట రెండు బాటిళ్లు తీసుకువెళ్లాలి. ఉదయం పూట అరటిపండు తింటే శరీరంలో విటమిన్ లోపం తలెత్తదు. శిక్షణ ముగిసే వరకు రోజూ పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి మంచిది. అందులో 90 శాతం నీరు ఉంటుంది.
గ్లూకోజ్: గ్లూకోజ్ పొడిని నీటిలో కలుపుకుని తాగడంలో శరీరానికి అదనపు శక్తి సమకూరుతుంది. దీంతో శరీరంలోని నీటిశాతం పెరగడమే కాకుండా ఎప్పుడూ తేమలాగా ఉంచుతుంది. గ్లాసెడు నీటిలో ఉదయం, సాయంత్రం ఒక చెంచా పొడిని కలిపి తాగితే సరిపోతుంది.
ఆహారం: శిక్షణ తీసుకుంటున్న కాలంలో ఆకుకూరలు, కూరగాయలు, మజ్జిగ రోజూ తీసుకోవాలి. వీటితోపాటు నీటిశాతం ఎక్కువగా ఉన్న పండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి.
Authorization