యూరేషియన్ స్టార్లింగ్.. అమెరికాలో, యూరప్, ఆసియాల్లోని కొన్ని నగరాల్లో వీటిని దొంగ పక్షులు అంటారు. చాలా ధైర్యంగా తిరుగుతుంటాయి. చలికాలం పెద్ద గుంపుగా చేరి గోల చేస్తుంటాయి. ఇతర పక్షుల కూతలనూ అనుకరిస్తుంటాయి. వెక్కిరింపుగా అరుస్తుంటాయి. శబ్దాలు చేస్తుంటాయి. బ్రిటన్, యూరప్‌లలో ఉంటుంది. ఆసియాలో ఎక్కువ ప్రాంతాలలో కనబడుతుంది. ఉత్తర అమెరికా, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలోనూ కనబడుతుంది. ఆసియా ప్రాంతంలో మైనాను అనుకరిస్తాయి. అమెరికా చుట్టుపక్కల వేలాదిగాఉన్నాయి. పల్లెల్లో పెస్టిసైడ్స్ కారణంగా పట్టణాలలోకి వస్తున్నాయి. చూడ్డానికి ఇవి చిన్న కాకిలా ఉంటాయి. రెక్కలు నలుపు, గోధమ రంగులలో ఉంటాయి. సుమారు 3 ఔన్సుల బరువు, 9 అంగుళాల పొడవు ఉంటాయి. వీటి రెక్కలు 17 అంగుళాలు విస్తరిస్తాయి. ఇవి ఏప్రిల్, జూన్ మధ్యకాలంలో సుమారు 7 గుడ్లు పెడతాయి. ఇవి ఎక్కువగా కీటకాలు, పురుగులు, పండ్లు, విత్తనాలను తింటాయి.