శ్వాసించేందుకుకై భూమిపై నివసించే జీవులన్నిటికీ ఆక్సిజన్ తప్పనిసరి అన్నసంగతి తెలిసిందే కదా. సూర్యుడిలోనూ, మన భూమిలోనూ అత్యధిక పరిమాణంలో ఉన్న మూడవ మూలకం ఆక్సిజనే కావడం విశేషం. అంతేకాదు మన శరీరంలో మూడింట రెండు వంతుల పదార్థం, నీటి ద్రవ్యరాశిలో పదింట తొమ్మిది వంతుల భాగం, ఆక్సిజన్‌తోనే నిండి ఉంటుంది. ఆక్సిజన్ వాయువుకి రంగు, రుచి, వాసన ఉండనప్పటికీ దానిని ఘనస్థితిలోకి గాని, ద్రవ స్థితిలోకి గాని మార్చినప్పుడు అది లేత నీలి రంగులో కనిపిస్తుంది. శ్వాసక్రియకేగాక భూమిపై దహనక్రియకు కూడా ఆక్సిజన్ తప్పనిసరి. ఆక్సిజన్ అనేక మూలకాలతో కలిసి ఎన్నెన్నో సంయోగపదార్థాలలోను, అలాగే వేలాది సేంద్రియ పదార్థాలలోను ఒక భాగంగా ఉంటుంది. కార్బన్-నైట్రోజన్ చక్రంలో ఆక్సిజన్ కీలకమైన పాత్రను పోషిస్తుంది. సూర్యుడి అతినీలలోహిత కిరణాల నుంచి భూగోళాన్ని కాపాడే 'ఓజోను' ఆక్సిజన్‌తో రూపొందినదే. ప్రతి ఓజోను అణువు మూడు ఆక్సిజన్ పరమాణువులతో రూపొందుతుంది. ధ్రువ ప్రాంతపు వాతావరణంలోని ఆక్సిజన్ ఉత్తేజితమైనప్పుడు ఆకాశంలో ఎరుపు-పసుపు-ఆకుపచ్చ రంగులు ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తాయి. నేడు ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడేందుకే గాక, ఎన్నెన్నో పరిశ్రమల్లో ఆక్సిజన్ని విరివిగా వాడుతున్నారు. ఆక్సిజన్ అణు సంఖ్య 8 కాగా అణుభారం 15.9994. అలోహమైన ఈ మూలకం 54.8 డిగ్రీల కెల్విన్ల వద్ద కరిగితే, 90.19 డిగ్రీల కెల్విన్ల ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది.
Authorization