దీని ముక్కు నీలిరంగులో, చూడ్డానికి చిన్న పడవలా ఉంటుంది. అందుకే ఆ పేరు వచ్చింది. ఇది ఒంటరి పక్షి. మనుషులకు, ఇతర పక్షులకు దూరంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా మధ్య, దక్షిణ అమెరికాలో, దక్షిణ మెక్సికో నుంచి బొలీవియా వరకూ; ఉత్తర అర్జెంటీనాలో కనిపిస్తాయి. వీటి పిల్లలకు పుట్టుక నుంచే రెండు చిన్ని పళ్లుంటాయి. కళ్లు పెద్దవి. నుదురు, చెంపలు మెడభాగం తెలుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది. జుత్తు వెనక్కి దువ్వినట్టు నల్లని ఈకలు పొడుగ్గా ఉంటాయి. పొట్టవరకూ తెల్లగడ్డంలా ఉంటుంది. పొట్ట, కాళ్లు గోధుమ రంగులో ఉంటాయి. రెక్కలు నీలి, నలుపు, బూడిద రంగులో ఉంటాయి. నిలబడితే తోకభాగం కిందివరకూ ఉంటుంది