నీలి, పసుపు ఈకలతో గుర్తుపట్టగలిగేట్టు ఉండే సాధారణ పక్షి. పక్షులు పెంచే ప్రాంతాల్లోకి వచ్చి చిత్రవిన్యాసాలు ప్రదర్శిస్తుంది. ఇవి ఎక్కువగా యూరప్‌లో కనపడతాయి. అలాగే రష్యా, ఉక్రెయిన్, ఆఫ్రికా, మధ్య ప్రాచ్య సిరియా, టర్కీ నుంచి ఇరాక్ వరకూ కనపడుతాయి. టిట్ పొట్టిగా ఉండి చిన్న ముక్కుతో ఉంటుంది. తల నీలం, తెలుపు రంగుల్లోఉంటుంది. మెడ రెక్కలు, బూడిద, నీలం కలిపిన రంగులో, తోక నీలం రంగులో పొట్టభాగం పసుపు రంగులో ఉంటుంది. చెట్ల పల్చని బెరడును తొలిచి అందులోని పురుగుల్ని పట్టుకుంటాయి. చలికాలంలోనూ శ్రమిస్తుంటాయి. ఇవి 0.45 ఔన్సుల బరువు, 4.5 అంగుళాల పొడవు ఉంటాయి. వీటిరెక్కలు 8 అంగుళాలకు విస్తరిస్తాయి. ఏప్రిల్, జూన్ మధ్య కాలంలో సుమారు 16 గుడ్లు పెడతాయి. ఇవి ఎక్కువగా కీటకాలు, విత్తనాలు, గింజలు, పండ్లు తింటాయి.