సౌరకుటుంబంలో గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలలో ఒకటి రెండు నిత్య చందమామల్లా వెలిగిపోయేవీ ఉన్నాయి. అంటే అవి ఆ గ్రహం మీది ఒక ప్రదేశం నుంచి ఎప్పుడు చూసినా అదే చోట కనిపిస్తూ ఉంటాయన్నమాట. అలాంటి ఓ నిత్య చందమామే ప్లూటోకి ఉన్న చరోన్ అనే ఉపగ్రహం. ఇది తనచుట్టూ తాను తిరగడానికి 166 గంటల సమయం తీసుకుంటుంది. ప్లూటోని ఏదైనా ఒక ప్రదేశం నుంచి ఎప్పుడు చూసినా చరోన్ అదే స్థానంలో కనిపిస్తుందన్నమాట. ప్లూటో సూర్యుడికి 590 కోట్ల కిలోమీటర్ల దూరంలోఉన్నందువల్ల చరోన్నుంచి వెన్నెల కురిసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఒక వేళ కురిసినా అది ఏమంత ప్రకాశవంతంగా ఉండదు.