పిల్లలూ! ప్రపంచంలోనే ఎత్తయినది ఎవరెస్ట్ పర్వతం... ఇది ప్రకృతి సహజం. అందుకే మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటుంటాం...ఇదే గాక ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన ఎన్నో ఎత్తైన ప్రదేశాలు భారత్ సొంతం. మరి వాటి గురించి తెలుసుకుందామా!
సియాచిన్
'సియాచిన్ గ్లేసియర్' ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధభూమిగా ప్రసిద్ధి చెందింది. సముద్ర మట్టానికి 22 వేల అడుగులో ఎత్తులో ఉంటుంది. ఇక్కడ తరుచుగా మంచు తుపానులు సంభవిస్తాయి.
పోస్టాఫీసు
హిమాచల్‌ప్రదేశ్‌లోని హిక్కిమ్ నగరంలో 'హిక్కిమ్ పోస్టాఫీసు' ఉంది. 1983లో ఇది ప్రారంభమైంది. ఇది సముద్ర ఉపరితలానికి 15 వేల 550 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తయిన పోస్టాఫీసు ఇదే కావడం విశేషం. ఇది 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. విపరీతంగా మంచు కురుస్తుండటంతో మరో ఆరు నెలలు మూసి వేస్తారు.
తేయాకు తోటలు
కేరళలోని మున్నార్ పట్టణంలో 'కొలుక్కుమలై టీ ప్లాంటేషన్' తోటలు ఉన్నాయి. ఇక్కడి తేయాకు తోటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ప్రత్యేక పద్ధతుల్లో ఇక్కడ తేయాకు పండిస్తారు. సముద్ర మట్టానికి 7,900 అడుగుల ఎత్తులో ఈ తేయాకు తోటలున్నాయి.
ఖర్దంగుల రోడ్డు
జమ్మూకశ్మీర్‌లోని లడఖ్‌లో ఖర్దంగుల రోడ్డు మార్గం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినది. ఇది దాదాపు 18 వేల 380 అడుగుల ఎత్తులో ఉంది. సంవత్సరం పొడవునా ఈ మార్గం తెరిచే ఉంటుంది.
లడఖ్‌లో కాఫీ కేఫ్
రించెన కేఫ్టేరియా లడఖ్‌లో ఉంది. కల్నల్ చెవాంగ్ రించెన పేరు మీదుగా దీనికాపేరు పెట్టారు. బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, మ్యాగీ, మొమొలు ఈ కేఫ్‌లో లభించే ప్రత్యేక పదార్థాలు. ఈ కేఫ్ దాదాపు 18 వేల 380 అడుగుల ఎత్తులో ఉంది.
తొలితరం పెట్రోల్ పంప్
హిమాచల్ ప్రదేశంలోని స్పిటి వ్యాలీకి దగ్గరలో ఉన్న కాజా గ్రామంలో 'ఇండియన్ ఆయిల్ పెట్రోల్' పంపు ఉంది. ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశాల్లో ఉన్న పెట్రోల్ పంప్ ఇదే. ఇది తొలితరం నాటి పెట్రోల్ పంపు. ఈ పెట్రోల్ పంపు దాదాపు 12 వేల 270 అడుగుల ఎత్తులో ఉంది.
చైల్ క్రికెట్ మైదానం
హిమాచల్ ప్రదేశ్‌లోని సోలాన జిల్లాలో 'చైల్ క్రికెట్ మైదానం' ఉంది. దాదాపు 7 వేల 283 అడుగుల ఎత్తులో ఉంది. క్రికెట్ మైదానం కోసం పాటియాల మహారాజు భూపిందర్ సింగ్ అక్కడి నేలను 1983 సంవత్సరంలో చదును చేయించాడు. ప్రపంచంలోనే ఎత్తయిన క్రికెట్ గ్రౌండ్ ఇదే.
గోల్ఫ్‌కోర్స్.
సిక్కింలోని తెగు అనే కుగ్రామంలో యాక్సిస్ ఏటీఎమ్ ఉంది. సముద్ర మట్టానికి దాదాపు 13 వేల 200 అడుగుల ఎత్తులో ఇది ఉంది. దీన్ని 2003 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ప్రారంభించారు.
ఎనీ టైమ్ మనీ
సిక్కింలోని కుపుప్ వ్యాలీలో 'యాక్ గోల్ఫ్ కోర్సు' ఉంది. ఇది 13 వేల 25 అడుగులో ఎత్తులో ఉంది. దీన్ని 1973లో ప్రారంభించారు. ప్రపంచంలోనే ఎత్తులో ఉన్న గోల్ఫ్ కోర్టుగా గిన్నిస్‌బుక్‌లో స్థానం పొందింది.
Authorization