కార్న్క్రేక్ .. ఈ పక్షి సంవత్సరంలో రెండు పర్యాయాలు సుదూర ప్రాంతాలకు వలస వెళ్తుంది. వ్యవసాయ విధానంలో మార్పులు, వేట కారణంగా ఈ పక్షులు అంతరించిపోతున్నాయి. ఇవి ఎక్కువగా పశ్చిమ యూరప్‌లో ఉంటాయి. అలాగే మధ్యాసియా నుంచి మధ్య నైజీరియా వరకూ కనపడుతాయి. చలికాలంలో ప్రధానంగా తూర్పు ఆఫ్రికాలో కనిపిస్తాయి. ఈ పక్షుల కూత గట్టిగా ఉండటం మూలాన ఎంతో దూరం వరకు వినపడుతుంది. బాగా పెరిగిన గడ్డిమొక్కలు, గుబురుల్లోనే పగలంతా దాక్కుంటాయి. అయితే ప్రస్తుతం వ్యవసాయంలో చేపట్టే మార్పుల కారణంగా వేరే ప్రాంతాలకు వెళ్తున్నాయి. గ్రీన్లాండ్, బెర్ముడా, ఆస్ట్రేలియా, అమెరికా ప్రాంతాల మధ్య సుదూర యాత్రలు చేస్తుంటాయి ఈ పక్షులు. ఇవి దాదాపు బూడిద లేదా గోధుమ రంగులో ఉంటూ ఈకల మీద నల్లని మచ్చలతో ఉంటాయి. 7.5 ఔన్సుల బరువుండే ఈ పక్షి 12 అంగుళాల పొడవు ఉంటుంది. ఇవి ఎక్కువగా కీటకాలు, ఆకుపచ్చని లేతకొమ్మలు, విత్తనాలు తింటూ జీవిస్తాయి.