చిన్నారులూ..! ఏవయినా వాటి సహజ రంగుల్లో ఉంటే ఎలాంటి ఆశ్చర్యం ఉండదు. కానీ ఎప్పుడూ చూస్తున్న రంగులకంటే విభిన్నంగా కనిపిస్తే మాత్రం వింతే... అలాంటివే ఈ నలుపు టమాటా..లిల్లీ.. ఉడుత.. ఇసుక.. మరి వీటి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా....
లిల్లీ:లిల్లీ పూలను చూస్తే చాలు ముగ్ధులమైపోతాం. వాటి సువాసన ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వీటిలోనూ నల్లటివి ఉన్నాయి తెలుసా? వీటిని అలంకరణకు కూడా ఉపయోగిస్తారు. ఇవి ప్రత్యేకంగా కనబడుతుండటం వల్ల అందరూ ఆకర్షితులౌతుంటారు. అబద్ధానికీ, చావుకీ ప్రతీకలుగా భావించే నలుపురంగు లిల్లీలను ప్రత్యేకంగా చూస్తారు పుష్పాలంకరణ ప్రియులు.
టమాట: టమాటా అంటే ఎరుపు, ఊదారంగులవే గుర్తొస్తాయి. కానీ నల్లటి టమాటాలు ఉన్నాయని తెలియదు కదూ! ఈ నల్ల టమాటాలు చాలా రుచిగా ఉంటాయట. శాస్త్రవేత్తలు ఊదా, ఎర్రరంగుల టమాటాల్ని సంకరం చేసి వీటిని తయారుచేశారు. ఈ నల్ల టమాటాలలో ఆరోగ్యానికి మేలు చేసే అంతో సైయానిస్ ఉందట. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తూ ఊబకాయానీ, మధుమేహాన్నీ ఎదుర్కొంటుందట.
నల్లసైకతం
బీచ్‌కి వెళితే చాలు, అక్కడ గోధుమ రంగులో మెరిసే ఇసుకలో ఆటలాడేస్తాం. సముద్రంలో స్నానాలు చేసేస్తాం. కానీ ఎప్పుడన్నా నల్లటి ఇసుకతో ఉన్న బీచ్ చూశారా. ఇది అమెరికాలోని హవారు నగరంలో ఉంది. పేరు 'పునలూ బీచ్ పార్క్'. పెట్రోల్ కలిసినట్టుండే ఈ సముద్రంలోని నీరు ఈత కొట్టటానికి పనికిరాదు. కానీ సముద్రం అడుగుభాగాన ఉండే నీరు మాత్రం చాలా పరిశుభ్రంగా ఉంటుందట.
ఉడుత
బూడిద రంగులో ఉన్న ఉడతలను మాత్రమే చూస్తుంటాం. ఎక్కడ చూసినా మనకు ఈ రంగులో ఉన్నవి కనిపిస్తాయి. కానీ కెనడా, అమెరికా అడవుల్లో ఉడతలు నలుపు రంగుల్లో ఉంటాయట. ఈ నల్లరంగు ఉడతలు పూర్వకాలంలోనూ ఉండేవనీ, కాలక్రమేణా వీటిలో చాలా శాతం బూడద రంగులోకి మారిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతారు.
Authorization