బైసన్ ..ఇది మన ఆవు, గేదెల్లాగే ఒక రకమైన మచ్చిక జంతువు. దీనిని అమెరికన్ బఫెలో అని కూడా అంటారు. మగ బైసన్ఎత్తు ఆరు నుంచి ఆరున్నర అడుగులు, పొడవు పది నుంచి పన్నెండున్నర అడుగులు ఉంటుంది. రెండు వేల పౌండ్ల బరువు ఉంటుంది. ఇంత భారీ దేహం ఉన్న ఈ జంతువు ఆహారం గడ్డి, ఆకులు మాత్రమే. ఉత్తర అమెరికాలో అత్యంత పెద్ద జంతువు ఇదే. అంత బరువు ఉన్నప్పటికీ గంటకు 40 మైళ్ల దూరం పరుగెత్తుతుంది. ఆరడుగుల ఎత్తు ఎగురుతుంది. ఏప్రిల్, మే నెలలు పునరుత్పత్తికి అనువైన కాలం. ఏడాదిలో పుట్టే దూడల్లో ఎక్కువ భాగం ఈ రెండు నెలల్లోనే ఉంటాయి. పుట్టినపుడు లేగదూడలు లేత గులాబి రంగులో ఉంటాయి, పెద్దయ్యేకొద్దీ ఒంటి రంగు చిక్కదనం సంతరించుకుని మందగా మారుతుంది. లేగదూడలు ఎనిమిది నెలలపాటు తల్లిచాటున పెరిగి ఏడాది నిండేసరికి స్వతంత్రంగా జీవించడం మొదలుపెడతాయి. వీటి జీవితకాలం 30 సంవత్సరాలు. ఇవి సాధు జంతువులుగానే ఉంటాయి. కానీ వాటిని రెచ్చగొడితే మాత్రం మనిషిమీద అమాంతం దాడి చేసి ప్రాణాలు తీస్తాయి.