నెమలి రూపం.. ఆకట్టుకునే పింఛం.. మిమిక్రీ చేసే పక్షుల్లో .. ప్రపంచంలోనే సాటిలేనిదిగా అనిపించుకున్న ఈ పక్షి పేరు 'మెనురా సుపర్బా' .... అంతే కాదు పేరుకు దగ్గట్టే ఈ పక్షి కూడా ఎంతో సూపర్బ్... ఎన్నో విశేషాలు దీని సొంతం...అవేంటో తెలుసుకోవాలనుందా..? అయితే ఇది చదివేయండి.
మెనురా పక్షుల్లో రెండు జాతులు ఉంటాయి. మొదటిది మెనురా సుపర్బా. ఇవి ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్, ఆగేయ టాస్మానియా వర్షాధారా అడవుల్లో ఉంటాయి. రెండో రకం పక్షులు 'మెనుర ఆల్బర్ట్'. ఇవి క్వీన్స్‌ల్యాండ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో నివసిస్తాయి. ఈ పక్షికి క్వీన్ విక్టోరియా భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ గౌరవార్థం ఆ పేరు పెట్టారు.
- పక్షులు 150 ఏళ్ల కిందటే జీవించేవని పరిశోధకులు చెబుతున్నారు. ఆ కాలం నాటి లైర్ పక్షి శిలాజం తవ్వకాల్లో దొరికింది. దాన్ని ఆస్ట్రేలియా మ్యూజియంలో భద్రపరిచారు.
- పక్షులు నెమలి పిల్లల్లా కనిపిస్తున్నా శరీరమంతా నలుపు కలిసిన ముదురు ఎరుపు రంగుల్లో ఉంటాయి. బలమైన కాళ్లు, సన్నని, తెల్లని తీగలు తగిలించినట్లుండే అందమైన ఈకలతో పింఛం ఉంటుంది. పింఛానికి దిగువన పొడవాటి చేతుల్లా ఉంటాయి. నాట్యమాడేందుకు సహకరిస్తాయవి. తోక ఉన్నా 10 అడుగుల్ని మించి పైకి ఎగరలేవు
అయితే పొడవాటి తోకుండేది మాత్రం మగ లైర్కే. ఆడ పక్షి కనిపించేందుకు కాకిలా కాస్తపెద్దగా ఉంటుంది. ఈ పక్షులు ఎక్కువగా నీలగిరి చెట్లపై, నేలపై పొదల్లో కొమ్మల్ని పోగుల్లా పోసి గూడు నిర్మించుకుంటాయి.
వీటి జీవిత కాలం 30 నుంచి 35 ఏండ్లు. పుట్టిన ఎనిమిదేళ్లకు సంతానోత్పత్తి మొదలవుతుంది. ఆడ పక్షి ఒక విడతకు ఒక గుడ్డే పెడుతుంది. దాన్ని పొదల్లో పెట్టి 6 వారాలు పొదుగుతుంది. ఆ సమయంలో ఆహారాన్ని మగ పక్షి అందిస్తుంది. తరువాత ఆ పిల్లని తల్లే ఓ నాలుగు వారాల పాటు జాగ్రత్తగా పెంచి వదిలిపెట్టేస్తుంది.
సీతాకోక చిలుకలు, సాలెపురుగులు, వానపాములు, జెర్రులు, కప్పలు, నత్తలు, పురుగుల్లాంటివి వీటి ఆహారం. నేలను తవ్వి ఆహారాన్ని సేకరించుకుంటాయి. అప్పుడప్పుడు గింజల్ని కూడా ఏరుకుని తింటాయి.
- పక్షుల జీవన విధానంలో ఆసక్తి కలిగించే అంశం.. ధ్వని అనుకరణ. ఏ శబ్దాన్ని విన్నా వెంటనే పలికేస్తాయి. ఫైరింజన్, రైఫిల్, కెమెరా, కారు సౌండు వంటి శబ్దాలు, కుక్కలు, పిల్లులు ఎన్నో రకాల జంతువుల అరుపులు, సంగీతం, పిల్లల ఏడుపు, అలారం వంటి శబ్దాలను అవలీలగా అనుకరిస్తాయి.
ఏడాది పొడవునా పాటలు పాడే ఈ పక్షులు జూన్ నుంచి ఆగస్టు వరకు పగలంతా పాడుతూనే ఉంటాయి. వీటి రాగాలు వినసొంపుగా ఉంటాయి. ఇలా మగవే పాడతాయి. ఆడవాటికి ఆ సామర్థ్యం, అవసరం ఉండదు. ఎందుకంటే మగపక్షులు ఆడవాటిని ఆకర్షించేందుకు ఒకదాన్ని మించి ఒకటి గొంతెత్తి రాగాలాపన చేస్తాయి.
లైర్ అనే పురాతన గ్రీకు సంగీత పరికరం ఈ పక్షి పింఛాన్ని పోలి ఉంటుందట. అందువల్లే దీనికి ఆ పేరు పెట్టారని అంటారు.
ఇవి ఆపద సమయాల్లో ఈలవేసి ఒకదానికొకటి సంకేతాలు అందించుకుంటాయి. ఈ శబ్దం కిలోమీటరు వరకూ గట్టిగా వినిపిస్తుందట. అయితే ఈ పక్షులకు నక్కలు, పిల్లులు, కుక్కల వల్ల ముప్పు ఎక్కువ. ఈ జంతువుల దాడి వల్లే లైర్ పక్షులు అంతరించిపోతున్నాయి.
Authorization