మానవుడికి ఉన్న అమూల్యమైన శక్తి భాష మాట్లాడి, అర్థం చేసుకోగల్గడం. భాష మాట్లాడలేని మానవుడు లేనట్టే భాష మాట్లాడగలిగిన మానవేతర ప్రాణి కూడా ఏదీ లేదు. మెదడులో గానీ ముఖ యంత్రంలో గానీ లోపాలున్న కొద్దిమందికి తప్ప మిగిలిన మానవులందరికీ మాట్లాడే శక్తి ఉంది. మానవుడు తన మనస్సులోని అభిప్రాయాలని బహిర్గతం చెయ్యడానికి నోటి ద్వారా చేసే ధ్వనులే భాష.ౖౖయూజీసీ నిర్ణయించిన పాఠ్య ప్రణాళికలో మొదటి యూనిట్ సామాన్య భాషా విజ్ఞానంలో భాష నిర్వచనాలు, ప్రపంచ భాషలతో ముఖ్య కుటుంబాలు, ధ్వని శాస్త్రం, భాషాధ్వనుల వర్గీకరణం, వర్ణం- పద నిర్మాణం, ఉచ్చారణ విధానాలు- స్థాన కరణ ప్రయత్నాలు, అర్థకం- సార్థకం- భేదాలు- వాక్యం- నిర్మాణ సంబంధాలు, వాక్యనిర్మాణ రీతులు, ధ్వని/ అర్థ పరిణామాలు, భాషల ఆధాన ప్రధాన ప్రక్రియ- రీతులు, మాండలిక భాషలు మొదలైనవి. నెట్ పరీక్ష దృష్ట్యా అత్యంత ముఖ్యమైనవి. వీటి కొరకు తెలుగులో లభించే ప్రామాణిక గ్రంథాలు
1. ఆధునిక భాషా సిద్ధాంతాలు- పి.ఎన్ సుబ్రహ్మణ్యం
2. తెలుగు భాషా చరిత్ర- ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి
3. భాషా శాస్త్ర పరిచయం- డా|| బొడ్డుపల్లి పురుషోత్తం
4. తెలుగు భాషా చరిత్ర - స్పూర్తి శ్రీ
5. భాష- సమాజం- సంస్కృతి - ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి
1. కాత్యాయనుడు బలపరిచిన భాషోత్పత్తి వాదం?
ఎ) పూ-పూ వాదం బి) డింగ్‌డాంగ్ వాదం
సి) ధాతు వాదం డి) బౌ.వౌ.వాదం
2. భాషా శాస్త్రంలో పరివర్తన సిద్ధాంతం అనే పరిశోధక వ్యాసం రాసిన చేకూరి రామారావుకు ఆధారమైన వాదం?
ఎ) సంపాదన వాదం
బి) స్వతస్సిద్ధ వాదం (ఛామ్స్కీ)
సి) ధాతువాదం(యాస్కాచాఆర్యుడి)
డి) లాంగ్వేజ్ (బ్లూమ్ ఫీల్డు)
3. యావత్ ప్రపంచంలో మొట్టమొదటి వాజ్మయమనదగిన గ్రంథం?
ఎ) లాంగ్వేజ్ - బ్లూమ్ ఫీల్డ్
బి) రామాయణం- వాల్మీకి
సి) మహాభారతం-వ్యాసుడు
డి) రుగ్వేదం
4. పాణిని 'అష్టాధ్యాయి' (వ్యాకరణ గ్రంథం) కి ఆధారం ?
ఎ) నిరుక్తాలు బి) శిక్షలు
సి) ప్రాతిశాఖ్యలు డి) కల్పం
5. ''ప్రథమేహి విద్వాంసోవైయాకరణా:'' అనీ ఈ వేదాం గానికి పేరు?
ఎ) శిక్ష బి) ఛందస్సు
సి) వ్యాకరణం డి) నిరుక్తం
6. ఆధునిక భాషా శాస్త్ర పితామహుడు ఎవరు?
ఎ) పాణిని బి) బ్లూమ్ఫీల్డు
సి) నోమ్‌ఛామ్‌స్కీ
డి) భద్రిరాజు కృష్ణమూర్తి
7. పతంజలి 'మహాభాష్యం'...
ఎ) పాణిని సూత్రాలకు వ్యాఖ్యానం
బి) వేదాలకు వ్యాఖ్యానం
సి) ఇది ఒక యోగశాస్త్ర గ్రంథం
డి) గద్య ప్రబంథం
8. పద, వాక్య, సంకీర్ణ కాండలు అనీ మూడు భాగా లున్న ''వాక్యపదీయం'' గ్రంథకర్త?
ఎ) వామనుడు బి) అమరుడు
సి) భర్తృహరి డి) విష్ణుశర్మ
9. 1856లో ''ద్రావిడ భాషలకు తులనాత్మక వ్యాక రణం'' రచించిదెవరు?
ఎ) పి.ఎస్.సుబ్రహ్మాణ్యం
బి) ప్రాన్సిస్ వైట్ ఎలిస్
సి) రాస్మన్ క్రిస్టియన్ రాస్క్
డి) బిషప్ కాల్డ్వెల్
10. మొట్టమొదటగా 'ఇండో-యూరోపియన్ భాషా కుటుంబాన్ని' ఏర్పరిచినవారు?
ఎ) అడెలంగ్
బి) లియోనార్డ్ బ్లూమ్ ఫీల్డు
సి) నైడా డి) కోపెన్ హాగన్
11. జర్మనిక్ భాషలకు తులనాత్మక వ్యాకరణం రచించి, భాషాశాస్త్రంలో ప్రసిద్ధ 'గ్రిమ్సులా'ను రూపొందించి నదెవరు?
ఎ) రాస్మన్ రాస్క్ బి) జాకోబ్ గ్రిమ్
సి) కారల్ బ్రగ్మన్ డి) గ్రియర్సన్
12. వర్గ సమీకరణానికి ఉదాహరణ?
ఎ) అగ్ని- అగ్గి బి) ఎన్ను-వెన్ను
సి) మొగము-మోము డి) ఉండడం- ఉండటం
13. అమహదేకవచన ప్రత్యయం మొక్క అత్యంత ప్రాచీన రూపం?
ఎ) వు బి) మ్ము
సి) ము డి) ఋ
14. తొలి తెలుగు పద్య శాసనం?
ఎ) విప్పర్తి శాసనం
బి) ఎర్రగుడిపాడు శాసనం
బి) కలమళ్ల శాసనం
డి) పండరంగని అద్దంకి శాసనం
15. ధ్వనికి దాని అర్థానికి అతీంద్రియమైన సంబంధం ఉందని తెలియజేసే భాషోత్పత్తి వాదం?
ఎ) బౌ వౌ వాదం బి) డింగ్ డాంగ్ వాదం
సి) అనుభవ వాదం డి) పూ-పూ వాదం
16. ధ్వనుల్ని ఉచ్చరించడానికి ఉపకరించే సాధనాలు?
ఎ) స్థాన -కరణాలు బి) ప్రయత్నాలు
సి) మెదడు డి) నాదతంత్రులు
17. సవరభాషపై విశేష పరిశోధన చేసి, సవరభాషకు వాచకాలు, నిఘంటువు, వ్యాకరణం రాసిన భాషవేత్త?
ఎ) భద్రిరాజు బి) పి.ఎస్.సుబ్రహ్మణ్యం
సి) బరో డి) గిడుగు
18. ప్రస్తుతం ద్రావిడ భాషలు ఎన్ని?
ఎ) 18 బి) 24 సి) 21 డి) 26
19. అచ్చూ దాని తర్వాత హల్లూ పరస్పరం స్థానం మార్చుకోవడాన్ని ఇలా పిలుస్తారు?
ఎ) తాలవ్యీకరణం బి) సన్నికర్ష
సి) వర్ణవ్యత్యాయం డి) వర్ణసామ్యం
20. ద్రావిడ భాషలో లిపి, సాహిత్యం గల భాషలు?
ఎ) 4 బి) 5 సి) 6 డి) 8
21. ప్రపంచంలో మొత్తం భాషా కుటుంబాలెన్ని?
ఎ) 12 బి) 10
సి) 15 డి) 20
22. తెలుగుభాషకు గల మొదటి వ్యాకరణ గ్రంథం?
ఎ) ఆంధ్రభాషా భూషణం బి) బాల వ్యాకరణం
సి) ఆంధ్ర శబ్ద చింతామణి డి) వికృతి వివేకం
23. యత్తదర్థక ప్రయోగం ఏ భాషా ప్రభావం వల్ల మన భాషలో ప్రవేశించింది?
ఎ) తమిళం బి) కన్నడం
సి) ఆంగ్లం డి) సంస్కృతం
24. అనుచిత విభాగంలో పేర్కొనేవి?
ఱ) ఈగలు, ఎలుకలు ఱఱ) దోమలు, చీమలు
ఱఱఱ) ఎండలు, వానలు ఱఙ) చిలకలు, ఏనుగులు
ఎ) ఱ, ఱఙ బి) ఱఱ, ఱఱఱ
సి) ఱఱ, ఱఙ డి) ఱఱఱ, ఱఙ
25. ఇంద్రదనస్సుకు తెలంగాణ మాండలిక పదం?
ఎ) హరివిల్లు బి) మత్తడి
సి) సింగిడి డి) పొక్కిలి
26. భాషాశాస్త్ర పరిభాషలో ఆంగ్లంలో 'వీశీతీజూష్ట్రశీ జూష్ట్రశీఅవఎఱషర' అనగా.
ఎ) సమాసం బి) సంధి
సి) అర్థకం డి) సార్థకం
27. తెలుగులో తాను:తాన, తాము:తమలలో జరిగిన మార్పు?
ఎ) శ్లథీకరణం బి) ధృఢకీరణం
సి) భేదకవ్యాప్తి డి) ఉదాత్తత
28. ఈ కింది వాటిలో సరైన వాక్యం...
ఎ) పెద్ద రెండు ఇళ్లు బి) రెండు పెద్ద ఇళ్లు
సి) కొన్ని అమ్మాయిలు
డి) మీ నేను చూశాను ఇల్లు
29. పాణిని అష్టాధ్యాయిలో నామాలు?
ఎ) ఆఖ్యాతాలు బి) తిజంతాలు
సి) సుబంతాలు డి) ఉపపదాలు
30. ''ఆయనకి మంచి చెడ్డలు తెలుసు'' - వాక్యంలో విశేషణ నామం/ నామాలు
ఎ) ఆయన బి) ఆయనకి
సి) తెలుసు డి) మంచి చెడ్డలు
31. భాష ధ్వనులను ఉచ్చరించేటప్పుడు గొంతుకలో గాని, నోటితో గాని, గాలిని నిరోధించే వ్యాపారం లో భేదం?
ఎ) ఉచ్చారణ ప్రయత్నం బి) స్పర్శం
సి) స్థానం డి) కరణం
32. భాష ధ్వనులను ఉచ్చరించేటప్పుడు ముఖయంత్రం లోని అవయవాలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో పరిశీలన చేసే ధ్వని శాఖ?
ఎ) తరంగాత్మక ధ్వని శాస్త్రం
బి) ఉచ్చాకణాత్మక ధ్వని శాస్త్రం
సి) శ్రవణాత్మక ధ్వని శాస్త్రం
డి) సౌందర్య శాస్త్రం
33. క-గ, ఛ-జ, ప-బ మొదలైన జంటలలో గల ఉచ్చరణ భేదం?
ఎ) స్పరశ-వ్యంజన బి) స్థాన- కరణ
సి) శ్వాస-నాద డి) దీర్ఘ- హ్రస్వ
34. జిహ్వోపాగ్రం తాలువు అగ్రభాగంలో కలియడం వల్ల కలిగే ధ్వనులు?
ఎ) దంతమూలీయాలు బి) తలవ్యాలు
సి) కంఠ్యాలు డి) మూర్ధన్యాలు
35. ఊపరితిత్తులలోనించి నోటిలోకి వచ్చిన గాలి సాధా రణంగా ఏదో ఒక చోట నిరోధించ బడుతుంది. ఈ నిరోధం ఏ ధ్వనుల ఉచ్చరణలో ఉంటుంది?
ఎ) అచ్చులు బి) హల్లులు
సి) స్వరాలు డి) కంఠ్యాచ్చులు
36. తెలుగు 'ళ' అనే వర్ణం...?
ఎ) తాడితం బి) కంపితం
సి) పార్శ్వికం డి) మూర్ధన్య పార్శ్వికం
37. జతపరచండి?
1. ఉన్నతాచ్చులు/ సంవృతాచ్చులు అ) అ, ఆ
2. మధ్యమాచ్చులు/ అర్థసంవృతాచ్చులు
బి) ఉ, ఊ, ఒ, ఓ
3. నిమ్నాచ్చులు/ వివృతాచ్చులు ఇ) ఇ, ఈ, ఎ, ఏ
4. ఆగ్రాచ్చులు ఈ) అ,ఆ
5. పశ్చిమాచ్చులు ఉ) ఎ, ఏ, ఒ, ఓ
6. కేంద్రాచ్చులు ఊ) ఇ, ఈ, ఉ, ఊ
1 2 3 4 5 6
ఎ) ఊ ఉ ఈ ఇ ఆ అ
బి) అ ఆ ఇ ఈ ఉ ఊ
సి) ఊ ఉ ఈ ఆ ఇ అ
డి) అ ఆ ఈ ఇ ఉ ఊ
38. అర్థవంతమైన అంతరాలు లేని అర్థవంతమైన అంశం?
ఎ) అర్థకం బి) పదం
సి) వాక్యం డి) సార్థకం
39. ధ్వనులు ప్రధానంగా గీసిన పటాలను ఏమని పిలుస్తారు?
ఎ) Word atla
బి) Phonetic atlas
సి) Grammatical atlas
డి) Morphology
40. ప్రపంచంలో అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే భాషలు ఏ భాషా కుటుంబానికి చెందినవి?
ఎ) ద్రావిడ భాషా కుటుంబం
బి) ఆస్ట్రిక్ భాషా కుటుంబం
సి) ఇండో-యూరోపియన్ భాషా కుటుంబం
డి) సైనోటిబేటిక్ భాషా కుటుంబం|
సమాధానాలు
1.సి 2.బి 3.డి 4.ఎ 5.సి
6.బి 7.ఎ 8.సి 9.డి 10.ఎ
11.బి 12.ఎ 13.సి 14.డి 15.బి
16.ఎ 17.డి 18.బి 19.సి 20.ఎ
21.బి 22.సి 23.డి 24.ఎ 25.సి
26.బి 27.ఎ 28.బి 29.సి 30.డి
31.ఎ 32.బి 33.సి 34.డి 35.బి
36.డి 37.ఎ 38.ఎ 39.బి 40.సి
- నానపురం నర్సింహులు
తెలుగు లెక్చరర్
ప్రభుత్వ జూనియర్ కళాశాల
పెద్దముల్, వికారాబాద్ జిల్లా
ఫోన్ : 9030057994
Authorization