1. కారు, లారీ సమాన ద్రవ్యవేగాలతో ప్రయాణిస్తు న్నాయి. వాటి మీద సమాన నిరోధ బలాన్ని ప్రయోగించినప్పుడు?
ఎ) కారు తక్కువ కాలంలో ఆగుతుంది
బి) లారీ తక్కువ కాలంలో ఆగుతుంది
సి) రెండు సమాన కాలంలో ఆగుతాయి
డి) దత్తాంశం సరిపోదు
2. ప్లాట్‌ఫాం అంచున వ్యక్తి నిలబడి ఉన్నాడు. రైలు అతడ్ని దాటి వేగంగా వెళ్తే ఆవ్యక్తి?
ఎ) రైలు వైపునకు ఆకర్షితుడవుతాడు
బి) ప్రభావం ఉండదు
సి) రైలుకు దూరంగా నెట్టబడతాడు
డి) సందిగ్ధ వేగం కంటే ఎక్కువగా ఉంటే అతడిపై ప్రభావం ఉంటుంది
3. ప్రామాణిక నిరోధాలను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థం?
ఎ) నిక్రోమ్ బి) రాగి సి) వెండి డి) మాంగనీస్
4. అమ్మీటర్ రేంజినిపెంచడానికి కింది వాటిలో దేనిని ఎలా కలుపుతారు?
ఎ) స్వల్ప నిరోధాన్ని సమాంతరంగా
బి) స్వల్ప నిరోధాన్ని శ్రేణిలో
సి) అధిక నిరోధాన్ని సమాంతరంగా
డి) అధిక నిరోధాన్ని శ్రేణిలో
5. తూర్పు నుంచి పడమరకు తిరిగే గ్రహం?
ఎ) వీనస్ బి) యురేనస్ సి) నెప్ట్యూన్ డి) 1,2
6. ఒక శబ్దం తీవ్రత 30 డెసిబల్స్ అయితే మనకు వినిపించే అతితక్కువ తీవ్రత ఉన్న ధ్వని కంటే ఇది ఎన్ని రెట్లు ఎక్కువ?
ఎ) 30 బి) 300 సి) 1000 డి) 3000
7. క్రీడాకారుడు లాంగ్‌జంప్ చేసేటప్పుడు దూరం నుంచి పరిగెత్తడానికి కారణం?
ఎ) పరుగెత్తడం వల్ల అతడికి కండర శక్తి పెరుగుతుంది
బి) ఇది క్రీడలో నియమం
సి) గమన జఢత్వం లాంగ్జంప్నకు సహకరిస్తుంది
డి) అతడి శక్తి సామర్థ్యాలు ప్రదర్శించడం
8. ద్రవం కేశనాళికలో పైకి వస్తున్నప్పుడు ఏ ప్రమేయంపై ఆధారపడదు?
ఎ) ద్రవ సాంద్రత బి) వాతావరణ పీడనం
సి) కేశనాళిక వ్యాసార్థం డి) స్పర్శకోణం
9. ఒక ద్రవం ఉష్ణోగ్రత పెరిగితే ఆ ద్రవపు తల తన్యత?
ఎ) మారదు బి) పెరుగుతుంది
సి) మొదట పెరిగి తర్వాత స్థిరంగా ఉంటుంది
డి) తగ్గుతుంది
10. శిలాజాల వయసును తెలుసుకునే పద్ధతిని 'రేడియో ధార్మిక డేటింగ్' అంటారు. ఈ ప్రక్రియ లో వినియోగించే రేడియో ఐసోటోపు?
ఎ) కార్బన్-14 బి) యురేనియం 235
సి) కోబాల్ట్ -60 డి) సోడియం 24
11. సూర్యుడి నుంచి భూమిని చేరే గరిష్టశక్తి దేని రూపంలో ఉంటుంది?
ఎ) ఎక్స్ కిరణాలు బి) ఆల్ఫ కిరణాలు
సి) అతినీలలోహిత కిరణాలు డి) పరారుణ కిరణాలు
12. ఒక కుంభాకార కటకం .. తెరపై ప్రతిబింబాన్ని ఏర్పరించింది. కటకం అర్ధభాగాన్ని అపారదర్శక కాగితంతో మూస్తే ?
ఎ) సగం ప్రతిబింబం మాయమవుతుంది
బి) పూర్తి ప్రతిబింబం ఏర్పడుతుంది
సి) అసల ప్రతిబింబం ఏర్పడదు
డి) ప్రతిబింబం తీవ్రత తగ్గుతుంది
13. విద్యుత్ కెపాసిటర్ దేన్ని నిల్వ చేస్తుంది?
ఎ) పొటెన్షియల్ ఆవేశం బి) ఆవేశం
సి) విద్యుత్ ప్రవాహం డి) అయస్కాంతత్వం
14. అంతరిక్షంలోని అన్ని గ్రహాల్లో ప్రకాశవంతమైన గ్రహం ఏది?
ఎ) శుక్రుడు బి) బుధుడు
సి) అంగారకుడు డి) శని
15. మొక్కల సెల్యులోజ్ నుంచి తయారు చేసే కృత్రిమ దారం?
ఎ) నైలాన్ బి) రేయాన్
సి) ఆక్రలిక్ డి) పాలిస్టర్
16. ఇంద్రధనస్సును ఏర్పరిచే దృగ్విషయంలో ఎక్కువ విచలనం చెందే రంగు ఏది?
ఎ) ఎరుపు బి) పసుపు
సి) ఉదా ఇ) గులాబీ
17. ఒక దండాయస్కాంతంలో అయస్కాంతత్వం ఎక్కడ కనిష్టంగా ఉంటుంది?
ఎ) చివర బి) మధ్యలో
సి) ధ్రువాల దగ్గర
డి) అన్ని చోట్ల ఏకరీతిగా ఉంటుంది
18. విద్యుత్ పొటెన్షియల్‌తో సరిపోల్చే భౌతిక రాశి ఏది?
ఎ) ఉష్ణోగ్రత బి) ఆవేశం
సి) కెపాసిటి డి) ఉష్ణరాశి
19. లోపల రాయి కలిగిన మంచు గడ్డ నీటి ఉపరి తలంపై తేలుతోంది. ఆ మంచుగడ్డ పూర్తిగా కరిగితే నీటి మట్టం?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) మారదు డి) మొదట తగ్గి తర్వాత పెరుగుతుంది
20. ఒక గాజు పలకపై వేడి నీటిని చల్లితూ అది పగలడానికి కారణం?
ఎ) గాజు అసమరీతి వ్యాకోచం
బి) గాజు ఏకరీతి సంకోచం
సి) గాజు అసమరీతి సంకోచం
డి) గాజు సున్నితమైంది
21. రైటు పట్టాలు వేసేటప్పుడు 'ఫిష్‌ప్లేట్ల'ను దీర్ఘవృత్తాకార రంద్రాల ద్వారా సంధానం చేయడానికి కారణం?
ఎ) శిలలు దీర్ఘవృత్తాకారంగా ఉండటం
బి) ఉష్ణోగ్రత వ్యత్యాసంతో రైలు పట్టాల పొడవులో కలిగే పెరుగుదల ఖాళీలోనికి అనుమతించడం
సి) బిగింపు సులభంగా, బిగుతుగా ఉండటం
డి) దీర్ఘ వృత్తాకార రంధ్రాలను ఏర్పరచడానికి మాత్రమే అవకాశ ఉండటం
22. ఒక ఇనుప గోళాన్ని వేడి చేసినప్పుడు కింది ఏ భౌతిక రాశుల్లో అధిక పెరుగుదల శాతం ఉంటుంది?
ఎ) వ్యాసం బి) ఉపరితల వైశాల్యం
సి) ఘన పరిమాణం డి) సాంద్రత
23. కారు హెడ్‌లైట్స్‌లో ఉపయోగించేవి?
ఎ) పుటకార దర్పణాలు బి) కుంభాకార దర్పణాలు
సి) కుంభాకార కటకాలు డి) పుటాకార కటకాలు
24. కంటిలోని కటకానికి రెటీనాకు మధ్య దూరం దాదాపుగా ఎంత?
ఎ) 2.5 మి.మీ బి) 2.5 సెం.మీ
సి) 0.25 సెం.మీ డి) 0.025 మి.మీ
25. మనదేశంలో జాతీయ సాంకేతిక విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని ఏటా మే 11నే ఎందుకు నిర్వహిస్తారు?
ఎ) సూపర్ కంప్యూటర్ పరమ్‌ను ఆ రోజునే ఆవిష్కరించారు
బి) ఇస్రో పీఎస్ఎల్వీ రాకెట్‌ను ప్రయోగించింది
సి) భారత దేశ న్యూక్లియర్ రియాక్టర్ మొదలైంది
డి) పొక్రాన్ వద్ద న్యూక్లియర్ పరీక్షలు విజయవంత మయ్యాయి
సమాధానాలు
1. సి 2.ఎ 3.ఎ 4ఎ 5.డి
6.సి 7.సి 8.బి 9.డి 10.ఎ
11.డి 12.బి 13.బి 14.ఎ 15.బి
16.సి 17.బి 18.ఎ 19.బి 20.ఎ
21.బి 22.సి 23.ఎ 24.బి 25.డి
Authorization