1. శివాజి ఎక్కడ జన్మించాడు?
ఎ. పురంధర్-క్రీ.శ 1625
బి. శివనేర్-1627
సి. రారుఘర్-క్రీ.శ 1627
డి. పూనా-క్రీ.శ 1625
2. కింది వారిలో శివాజీ సంరక్షుడిగా పేరుగాంచిన వారు ఎవరు?
ఎ. షాజీ బి. షాజీభోంస్లే
సి. రామదాసు డి. దాదాజి కొండదేవ్
3. తన తండ్రి నుంచి శివాజీ వారసత్వంగా పొందిన జాగీరు ఏది?
ఎ. పూనా బి. కొల్హాపూర్
సి. జావళి డి. తోరణ
4. శివాజీ జావళి కోటను ఎవరి నుంచి జయించాడు?
ఎ. నిజాంషాహీలు బి. జాదవ్ రావ్
సి. చంద్రరావు మోరే డి. ఆదిల్షాహీ
5. మొగలులపై శివాజి చేసిన మొట్టమొదటి దాడి ఏది?
ఎ. సూరత్పైదాడి
బి. షయిస్తాఖాన్పై దాడి
సి. అఫ్జల్ ఖాన్‌పై దాడి
డి. మొగల్ జిల్లాలైన ఆహ్మద్‌నగర్, జున్నార్లపై దాడి
6. సూరత్ పై శివాజీ మొదటిసారి దండయాత్ర ఎప్పుడు చేసెను?
ఎ. జనవరి 1664 బి.ఫిబ్రవరి 1664
సి. మార్చి 1665 డి.ఏప్రిల్ 1665
7. పురంధర్ సంధి ఏసంవత్సరంలో జరిగింది?
ఎ. 1666 బి.1665
సి.1664 డి.1663
8. పురంధర్ సంధి ఎవరెవరి మధ్య జరిగింది?
ఎ. శివాజీ- కారన్ వాలిస్
బి. శివాజీ- షయిస్తాఖాన్
సి. శివాజీ- రాజా జైసింగ్
డి. శివాజీ- డచ్చివారికి
9. బీజాపూర్ రాజ్యంలోని కర్నాటక ప్రాంతాలను ఆక్ర మించడానికి శివాజీ ఎవరితో ఒప్పదం కుదుర్చు కున్నాడు?
ఎ. ఆహ్మద్ నగర్- నిజాం షాహీ బి. మొగలులు
సి. పెనుగొండ-అరవీటి వంశం
డి. గోల్కొండ-కుతుబ్‌షాహీ
10. ''పర్వత రాజు''గా చరిత్రకారులు ఎవరిని పేర్కొంటారు?
ఎ. రాణాసంగా బి. శివాజీ
సి. పృధ్వీరాజ్ డి. మహారాణ ప్రతాప్
11. శివాజీ ఏ సంవత్సరంలో మరణించెను?
ఎ.1687 బి.1682
సి.1680 డి.1689
12. శాంతాజీ గోర్పోడే, ధనాజీ జాదవ్‌లు ఎవరి సేనానులు?
ఎ. రాజారాం బి. శివాజీ
సి. శాంభాజీ డి. సాహు
13. ఈ కింది వాటిలో సరికాని దానిని గుర్తించండి?
ఎ. ఇండోర్-హోల్కర్ బి. నాగ్‌పూర్-భోంస్లే
సి. గ్వాలియర్-గైక్వాడ్ డి. పూనా-పీష్వా
14. కింది వారిలో ''సేనాకర్తె'' అని ఎవరిని వ్యవహరి స్తారు?
ఎ. బాలాజీ విశ్వనాథ్ బి. బాజీరావు
సి. బాలాజీ బాజీరావు డి. మాధవరావు
15. రాజారాం పరిపాలనా కాలంలో మరాఠాల రాజధాని ఏది?
ఎ. పూనా బి. సతారా
సి.నాగ్‌పూర్ డి. ఇండోర్
16. నానాసాహెబ్ అని పిలిచిన మరాఠా పీష్వా ఎవరు?
ఎ. బాజీరావు-2
బి.నారాయణ రావు
సి. బాలాజీ విశ్వనాద్
డి. మాధవ నారాయణ రావు
17. మరాఠా పరిపాలనలో గ్రామాలలో న్యాయాధికారిని ఏమని పిలిచేవారు?
ఎ. రెడ్డి బి. పటేల్
సి.పట్వారీ డి.జగ్లా
18. పిష్వాల పరిపాలనా విధానంలో లెక్కలు లేదా అకౌంటింగ్ విభాగాన్ని ఏమని పిలిచేవారు?
ఎ. ఎల్ బెరీజ్ దఫ్తార్
బి. కొత్వాల్
సి. ఆల్ బరీద్
డి. ఎల్ సుల్తాన్ బెరీజ్
19. రాష్ట్రాలను శివాజీ ఏ విధంగా విభజించెను?
ఎ. ప్రాంతాలు బి. తరఫ్‌లు
సి. మౌజాలు డి. పైవన్నీ
20. శివాజీకి రెవిన్యూ సంస్కరణలు ప్రవేశపెట్టడంలో సహాయపడిన వారు ఎవరు?
ఎ. అన్నాజీ దత్తు బి. కొండదేవ్
సి. రాజామాన్‌సింగ్ డి.షేర్షా
21. ఎవరి సలహాపై శివాజీకి ఔరంగజేబు''రాజా''అను బిరుదును ఇచ్చెను?
ఎ. ముకరం ఖాన్ బి. జైసింగ్
సి.జస్వంత్‌సింగ్ డి. యశ్వంత్‌సింగ్
22. శివాజీ అష్ట ప్రధానులకు సంబంధించి సరైన జత ఏది?
ఎ. పండితరావు-న్యాయమూర్తి
బి. సుమంత్-ధానధర్మాల మంత్రి
సి. అమాత్య-ప్రధాన మంత్రి
డి. సేనాపతి-సైన్యాధ్యక్షుడు
23. ఛత్రపతి అనే బిరుదుతో శివాజీ పట్టాభిషేకం ఎక్కడ జరుపుకొనెను?
ఎ. పూనా బి. రారుఘడ్
సి. శివనేర్ డి. పురంధర్
24. 1761లో జరిగిన మూడవ పానిపట్టు యుద్ధంలో మహారాష్ట్రులు ఎవరి చేతిలో ఓడిపోయారు?
ఎ. మొగలులు బి. బ్రిటీష్‌లు
సి. ఆహ్మద్షా అబ్ధాలీ డి.షేర్ ఆఫ్ఘన్షా
25. శివాజీ పాలనా కాలంలో ప్రభుత్వంలో భూములను కొలవడానికి ఏ కొలబద్దను ఉపయోగించేవారు?
ఎ. కథీ బి. జరీ సి. దత్తీ డి. కడప
26. శివాజీ ఖడ్గం పేరేమిటి?
ఎ. మణిహార్ బి.చంద్రహాస్
సి. తల్వార్ డి. విహార్వాస్
27. హింద్ పద్పాద్ షాహీ ఆదర్శంను మొదటగా చాటిన పీష్వా ఎవరు?
ఎ. శివాజీ బి.బాలాజీ విశ్వనాద్
సి. బాలాజీ నారాయణ
డి.మొదటి బాజీరావు/బాజీరావు -1
28. శివాజీ పట్టాభిషేకానికి హాజరైన బ్రిటీష్ ప్రతినిధి ఎవరు?
ఎ. గర్గభట్టు బి. అలెన్ ఎలక్స్
సి.అక్సిండన్ డి.జాన్లారెన్
29. శివాజీ నౌకాదళం గల ప్రదేశం ఏది?
ఎ. పూనా బి. బాంద్రా
సి. జావళి డి. కొలాబా
30. శివాజీ గౌరవార్థం శత్రు రాజ్యాలు చెల్లించే పన్ను ఏది?
ఎ. చౌత్ బి. సర్థేశ్ ముఖి
సి. నఖాపాణి డి. ఆనెక్స్
31. అష్ట ప్రధానులకు అదనంగా''రాజాజ్ఞ'' అనే నూతన పదవిని ఏర్పాటు చేసిన వారు ఎవరు?
ఎ. మాధవరావు
బి. 2వ బాజీరావు
సి. బాలాజీ విశ్వనాథ్
డి. బాలాజీ బాజారావు
32. కింది వారిలో ''సూరత్ యుద్ధంలో నిజాం ఉల్ ముల్క్''ను ఓడించిన వారు ఎవరు?
ఎ. మొదటి బాజీరావు బి. బాలాజీ బాజీరావు
సి. బాలాజీ విశ్వనాథ్ డి. నారాయణ రావు
33. 3వ పానిపట్టు యుద్ధంలో క్షతగాత్రులైన సైనికుల ను రక్షించిన ఔట్ నాయకుడు ఎవరు?
ఎ. సూరజ్మల్ బి. షాఆలం
సి.తుర్రెబాజ్ డి. తోడర్మల్
34. క్షయ వ్యాధితో మరణించిన పీష్వా ఎవరు?
ఎ. 2వ మాధవరావు బి. మాధవరావు
సి. బాలాజీ నారాయణరావు డి. ఏదీకాదు
35. పీష్వా పదవిని రద్దు చేసిన బ్రటీష్ గవర్నర్ ఎవరు?
ఎ. విలియం బెంటింక్ బి. రాబర్ట్ క్లైవ్
సి. వెల్లస్లీ డి. లార్డ్ హెస్టింగ్స్
36. రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం ఎప్పుడు ప్రారంభం అయింది?
ఎ. 1809 బి.1803
సి.1775 డి.1817
37. కింది వాటిలో సాల్బేసంధికి సంబంధించి సరికానిది ఏది?
ఎ. 2వ మాధవరావు పీష్వాగా గుర్తింపు
బి. రఘోబాకు ఏటి 3లక్షల భరణం
సి. సాల్సెట్టి దీవి బ్రిటిష్ వారికి లభించడం
డి. మరాఠాలకు- బ్రిటీష్ వారికి మధ్య 10సంవత్స రాల శాంతి ఒప్పందం
38. మొదటి ఆంగ్లో- మరాఠా యుద్ధం కాలం నాటి పీష్వా ఎవరు?
ఎ. 2వ మాధవరావు
బి. 2వ నారాయణ రావు
సి. 2వ బాజీరావు
డి. బాలాజీ విశ్వనాథ్
39. 3వ ఆంగ్లో-మరాఠా యుద్ధానంతరం పీష్వాకు భరణంగా లభించిన ప్రాంతం?
ఎ. లాతూర్ బి. బితూర్
సి. సతారా డి. పూనే
40. సంగమేశ్వర్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
ఎ. క్రీ.శ 1680 బి.క్రీ.శ1682
సి. క్రీ.శ 1689 డి.క్రీ.శ1687
41. శివాజీ గుర్రం పేరేమిటి?
ఎ. కళ్యాణి బి. మణిహార్
సి. భవానీ డి. విజయ
42. శివాజీ సైన్యంలో అతి చిన్న యూనిట్ ఏమిటి?
ఎ. 15 మంది సైనికులు బృందం
బి.10 మంది సైనికుల బృందం
సి.8మంది సైనికులు బృందం
డి. 9 మంది సైనికుల బృందం
43. ''డోక్రా దమరో''అనే సంప్రదాయ లోహ తయారీ దారులు ఏరాష్ట్రంలో కలరు?
ఎ. మహారాష్ట్ర బి. పశ్చిమబెంగాల్
సి.కేరళ డి. ఢిల్లీ
44. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి?
ఎ. దాశరథి రంగాచార్య-జీవనయానం
బి. సామల సదాశివ-యాది
సి. గడియారం రామకృష్ణ శర్మ- శతపత్రము
డి. పైవన్నీ
45. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ. బొబ్బిలి యుద్ధం-1757
బి. తుమ్మపాళెం యుద్ధం-1756
సి. చందుర్తి యుద్ధం|1760
డి. కొండూర్ యుద్ధం -1759
46. కింది వాటిలో ''రంజన్ కుండల''రే ప్రసిద్ధి గాంచిన తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా ఏది?
ఎ. అదిలాబాద్ బి. నల్గగొండ
సి. నిజామాబాద్ డి.వరంగల్
47. కేంద్ర సాహిత్య అకాడమి''యువ'' పురస్కారంను సాధించిన తొలి తెలంగాణీయుడు ఎవరు?
ఎ. పసునూరి రవీందర్
బి. పసునూరి దయాకర్
సి. జూలూరి గౌరీశంకర్
డి. పసునూరి మహేందర్
48. కింది వాటిలో తెలంగాణ నిర్మాతల తొలి సినిమా ఏది?
ఎ. మూగ మనుషులు
బి. మా ఇంటి మహాలక్ష్మి
సి. భోజకాళిదాసు డి. ఆదర్శం
49. భారతదేశంలో మాతృభాషలో విద్యను బోధించాలని ఆజ్ఞాపించిన మొగల్ చక్రవర్తి ఎవరు?
ఎ. అక్బర్ బి. జహంగీర్
సి. ఔరంగజేబు డి.హుమాయూన్
50. ఉడ్స్ నివేదిక భారతీయ విద్యా విధానంలో మాగ్నా కార్టా లాంటిదని అభివర్ణించింది ఎవరు?
ఎ. హెచ్.ఆర్ జేమ్స్ బి. హెచ్.ఆర్ హుక్స్
సి. విలియం బెంటింక్ డి. జాన్ విక్లెప్
51. భారతదేశంలో ఇంజనీరింగ్ విద్యకు అత్యంత ప్రాముఖ్యం ఇచ్చిన ఇంజనీరింగ్ విద్యకై ఎంతో కృషి చేసిన ఆంగ్లేయుడు ఎవరు?
ఎ. జాన్ ఎరాస్మస్ బి. జార్విన్
సి. కెండీ డి. ఎర్విన్
సమాధానాలు
1.బి 2.డి 3.ఎ 4.సి 5.డి
6.ఎ 7.బి 8.సి 9.డి 10.బి
11.సి 12.ఎ 13.సి 14.ఎ 15.బి
16.ఎ 17.బి 18.ఎ 19.డి 20.ఎ
21.సి 22.డి 23.బి 24.సి 25.ఎ
26.బి 27.డి 28.సి 29.డి 30.బి
31.సి 32.ఎ 33.ఎ 34.బి 35.డి
36.బి 37.డి 38.ఎ 39.బి 40.సి
41.ఎ 42.డి 43.బి 44.డి 45.సి
46.ఎ 47.ఎ 48.డి 49.సి 50.ఎ
51.బి
- షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580
Authorization