1) పరస్థనీయ నదీ వ్యవస్థకు ఉదాహరణ ?
ఎ) గంగ బి) గోదావరి
సి) బ్రహ్మపుత్ర డి) సింధు
2) మొత్తం పొడవును పరిగణనలోకి తీసుకుంటే ఏ నది ఎక్కువ దూరం ప్రవహిస్తుంది?
ఎ) సింధు బి) బ్రహ్మపుత్ర
సి) గంగ డి) గోదావరి
3) సరైనవి గుర్తించండి.
ప్రవచనం 1: హిమాలయాల ఆవిర్భావం కన్నా ముందు ఉన్న నదులను పూర్వావర్తిత నదులు అంటారు.
ప్రవచనం 2 : పుర్వావర్తిత నదికి ఉదాహరణ గంగానది
ఎ) 1, 2 సరైనవి కావు బి) 2 మాత్రమే సరైనది
సి) 1, 2 సరైనవి డి) 1 మాత్రమే సరైనది
4) పుర్వావర్తిత నదికి ఉదాహరణ
ఎ) గంగ బి) యమున
సి) సింధు డి) చంబల్
5) కింది వాటిలో ఎక్సోటిక్ రివర్ కానిది?
ఎ) సింధు బి) ఆరంజ్
సి) నైలు డి) రైన్
6) నర్మద కవల, నర్మద చెలికత్తెగా ఏ నదిని పిలుస్తారు?
ఎ) మహి బి) సబర్మతి
సి) తపతి డి) కాళి
7) పశ్చిమ కనుమలలో మహాబలేశ్వరం వద్ద జన్మించే నది?
ఎ) కృష్ణ బి) కావేరి
సి) బ్రహ్మణి డి) నాగావళి
8) కృష్ణానది ఉపనదుల్లో అతి పెద్దది?
ఎ) మూసీ బి) తుంగభద్ర
సి) మలప్రభ డి) మున్నేరు
9) దేశంలో అత్యంత పెద్దదైన ద్వీపకల్ప నది?
ఎ) కృష్ణా బి) గోదావరి
సి) కావేరి డి) తుంగభద్ర
10) నైలునదికి మూలమైన వైట్‌నైల్, బ్లూనైల్ నదులకు పుట్టినిల్లు అయిన సరస్సులు?
×) విక్టోరియా సరస్సు ××) కరీబా సరస్సు
×××) ధానా సరస్సు ×V) ఛాద్ సరస్సు
ఎ) × , ×× బి) ××, ×××
సి) ×, ××× డి) ××, ×V
11) ఆరావళి పర్వతాల్లో పుట్టి గల్ఫ్ ఆఫ్ ఖంబాట్లో కలిసే నది ?
ఎ) ఘగ్లర్ బి) బెట్వా
సి) మాచ్‌ఖండ్ డి) సబర్మతి
12) గిల్లిట్, ష్యోక్ ఏ నది ఉపనదులు ?
ఎ) సింధు బి) సట్లైజ్
సి) కోసి డి) గండక్
13) ఆఫ్రికాలోని ఆశ్వాన్ డ్యాం ఏ నదిపై నిర్మించారు?
ఎ) కాంగో బి) ఆరెంజ్
సి) నైలు డి) నైగర్
14) విక్టోరియా జలపాతం ఏ నదిపై ఉంది?
ఎ) జైరె బి) జాంబెజీ
సి) నైగర్ డి) లింపోపో
15) భూ మధ్య రేఖను రెండు సార్లు ఖండిస్తూ దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసే నది?
ఎ) ఆరెంజ్ బి) లింపోపో
సి) కాంగో డి) నైగర్
16) ఆఫ్రికా ఖండంలో మకరరేఖను రెండు సార్లు ఖండిస్తున్న నది?
ఎ) జాంబెజీ బి) జైరె
సి) లింపోపో డి) నైలు
17) కింది వాటిని జత చేయండి
పట్టిక 1 పట్టిక 2
1) బ్లూరివర్ పి) యాంగ్ ట్సి కియాంగ్
2) రెడ్ రివర్ క్యూ) బ్రహ్మపుత్ర
3) ఎల్లో రివర్ ఆర్) హోయాంగ్ హో
ఎ) 1-క్యూ, 2-పి, 3-ఆర్
బి) 1-పి, 2-క్యూ, 3-ఆర్
సి) 1-ఆర్, 2-క్యూ, 3-పి
డి) 1-పి, 2-ఆర్, 3-క్యూ
18) ప్రపంచ ప్రముఖ నగరాలు ఏ నది ఒడ్డున ఉన్నాయి?
నగరం నది
1. వాషింగ్టన్ డీసీ పి) స్ప్రీ
2. రోమ్ క్యూ) సీన్
3. పారిస్ ఆర్) టైబర్
4. బెర్లిన్ ఎస్) పొటామక్
ఎ) 1-పి, 2-ఎస్, 3-క్యూ, 4-ఆర్
బి) 1-ఎస్, 2-ఆర్, 3-క్యూ, 4-పి
సి) 1-ఎస్, 2-క్యూ, 3-ఆర్, 4-పి
డి) 1-ఆర్, 2-పి, 3-క్యూ, 4-ఎస్
19) కింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
ఎ) దిండి నది - మీనాంబరం
బి) నాగావళి- లాంగుల్య
సి) పెన్నా నది - పినాకిని
డి) మూసి - వైతరణి
20) 'ఎరవాడి' నదిని ఏ దేశ జీవనాడిగా పేర్కొంటారు?
ఎ) మయన్మార్ బి) థాయిలాండ్
సి) బంగ్లాదేశ్ డి) నేపాల్
21) థార్ ఎడారిలో ప్రవహించే హిమాలయ నది?
ఎ) కోసి బి) యమున
సి) సింధు డి) గోమతి
22) ప్రపంచంలో అతిపెద్ద డెల్టాను ఏర్పరిచే నదులు?
ఎ) గంగా - సింధు బి) గంగా - బ్రహ్మపుత్ర
సి) రైన్ - డాన్యూబ్ డి) ట్రైగిస్ - యుఫ్రటిస్
23) దేశంలో అత్యధిక ప్రాజెక్టులు గల నది?
ఎ) నర్మద బి) చంబల్
సి) దామోదర్ డి) కోసి
24) భారతదేశంలో అతి పొడవైన ఉపనది?
ఎ) సట్లేజ్ బి) యమున సి) గండక్ డి) భీమ
25) టైగ్రిస్ - యుఫ్రటిస్ నదుల వద్ద అభివృద్ధి చెందిన నాగరికత?
ఎ) గ్రీకు నాగరికత బి) సింధు నాగరికత
సి) రోమన్ నాగరికత డి) పర్షియన్ నాగరికత
26) దేశంలో పెద్దదైన నదీ ఆధార దీవి 'మజూలీ' - ఏ నది వల్ల ఏర్పడింది?
ఎ) గంగ బి) బ్రహ్మపుత్ర
సి) తీస్తా డి) గాగ్రా
27) ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏంజెల్ ఏ నదిపై ఉంది?
ఎ) మిసిసిపి బి) కొలరాడో
సి) జాంబెజీ డి) ఒరినాకో
28) ప్రపంచంలో అతి పెద్ద అగాధ దరి 'గ్రాండ్ కానియన్' ఏ నదిపై కలదు?
ఎ) అమెజాన్ బి) కొలంబియా
సి) అమూర్ డి) కొలరాడో
29) అతి పెద్ద జలపాతమైన నయాగారా ఏ నదిపై ఉంది?
ఎ) సెయింట్ లారెన్స్ బి) సుమిద
సి) టైబర్ డి) సీన్
30) 'సుమిద' నది ఒడ్డున గల ప్రముఖ నగరం?
ఎ) స్టాలిన్ గ్రాడ్ బి) టోక్యో
సి) లిస్బన్ డి) బెర్లిన్
31) బంగ్లాదేశ్‌లో ప్రవేశించిన గంగానదిని ఏమంటారు?
ఎ) జమున బి) మేఘన
సి) పద్మా డి) యమున
32) బ్రహ్మపుత్ర నది ఏ పేరుతో బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది?
ఎ) భువన బి) జమున
సి) మేఘన డి) కల్పన
33) బ్రహ్మపుత్ర నది పద్మానదితో కలిసాక ఏ పేరుతో పిలుస్తున్నారు?
ఎ) మేఘన బి) భువన
సి) జమున డి) అర్చన
34) దాదాపు సంవత్సరమంతా గడ్డ కట్టి ఉండే నది?
ఎ) మెకాంక్ బి) లీనా
సి) టైబర్ డి) విస్తులా
35) ప్రపంచంలో లోతైన సరస్సు బైకాల్ ఏ నదికి జన్మస్థానం?
ఎ) ట్రైగిస్ బి) లీనా
సి) ఓల్గా డి) సికియాంగ్
సమాధానాలు
1.డి 2.బి 3.డి 4.సి 5.డి
6.సి 7.ఎ 8.బి 9.బి 10.సి
11.డి 12.ఎ 13.సి 14.బి 15.సి
16.సి 17.బి 18.బి 19.డి 20.ఎ
21.సి 22.బి 23.ఎ 24.బి 25.డి
26.బి 27.డి 28.డి 29.ఎ 30.బి
31.సి 32.బి 33.ఎ 34.బి 35.బి
- జి.ఉపేందర్
హైదరాబాద్
ఫోన్ : 9676669049
Authorization