1) బాగ్లీహార్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు?
ఎ) రావి బి) బియాస్
సి) చీనాబ్ డి) సట్లేజ్
2) భగీరధి నదిపై నిర్మించిన ప్రాజెక్టు ఏది?
ఎ) ఫరక్కా బి) హీరాకుడు
సి) తెహ్రీడ్యాం డి) రిహాండ్
3) హీరాకుడ్ ఆనకట్టకు సంబంధించి సరికానిది?
ఎ) ఇది మహానదిపై కట్టారు
బి) దేశంలో అత్యంత పొడవైన ప్రాజెక్టు
సి) ఈ ఆనకట్ట ఒడిశా రాష్ట్రంలో కలదు
డి) దీని పొడవు 5.8కిలో మీటర్లు
4) చిప్కో ఉద్యమం ద్వారా ఏ ప్రాజెక్టు వ్యతిరేకించారు?
ఎ) బియాస్ ప్రాజెక్టు బి) భాక్రానంగల్
సి) తెహ్రీడాం డి) గండక్ ప్రాజెక్టు
5) 'బాగ్లీహార్' ఏ దేశాల మధ్య వివాదాస్పద ప్రాజెక్టు?
ఎ) భారత్-నేపాల్ బి) భారత్-పాకిస్థాన్
సి) భారత్ - బర్మా డి) భారత్- బంగ్లాదేశ్
6) గాంధీ, జవహర్ సాగర్, రాణాప్రతాప్ సాగర్ ఆన కట్టలు ఏ ప్రాజెక్టులో భాగం ?
ఎ) నర్మద ప్రాజెక్టు బి) చంబల్ ప్రాజెక్టు
సి) బలిమెల ప్రాజెక్టు డి) ఆల్మట్టి డాం
7) ప్రాజెక్టు నదులను జతచేయండి.
ప్రాజెక్టు నది
1. సలాల్ పి) సట్లేజ్
2. నాధ్పాజాక్రి క్యూ) చీనాబ్
3. ఆల్మట్టి ఆర్) గోదావరి
4. పోలవరం ఎస్) కృష్ణ
ఎ) 1-పి, 2-క్యూ, 3-ఎస్, 4-ఆర్
బి) 1-క్యూ, 2-పి, 3-ఎస్, 4-ఆర్
సి) 1-ఎస్, 2-ఆర్, 3-క్యూ, 4-పి
డి) 1-ఆర్, 2-క్యూ, 3-పి, 4-ఎస్
8) గంగానదిపై నిర్మించిన ప్రాజెక్టును గుర్తించండి?
ఎ) భాక్రానంగల్ ప్రాజెక్టు బి) చంబల్ ప్రాజెక్టు
సి) ఫరక్కా ప్రాజెక్టు డి) జయక్ ప్రాజెక్టు
9) జయక్ వాడీ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) ఉత్తరప్రదేశ్ బి) మహారాష్ట్ర
సి) గుజరాత్ డి) పంజాబ్
10) నాగార్జునాసాగర్ రెండు కాలువల పేర్లను గుర్తించండి?
1. కుడి కాలువపేరు జవహర్లాల్
2. ఎడమ కాలువ పేరు లాల్‌బహదూర్
3. కుడి కాలువ పేరు లాల్ బహదూర్
4. ఎడమ కాలువ పేరు జవహర్లాల్
ఎ) 1,3 బి) 2, 3
సి) 3,4 డి) 1,2
11) చంబల్ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల ఉమ్మడి పథకం
ఎ) రాజస్థాన్ - మధ్య ప్రదేశ్
బి) పంజాబ్ - హర్యానా
సి) ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక
డి) ఉత్తరప్రదేశ్ - మధ్యప్రదేశ్
12) దేశంలో అత్యంత పొడవైన కెనాల్?
ఎ) ఇందిరాగాంధీ కెనాల్
బి) జవహర్ లాల్ కెనాల్
సి) మయూరాక్షి కెనాల్
డి) శారదా కెనాల్
13) ఇందిరాగాంధీ కెనాల్‌కు గల మరో పేరు?
ఎ) రాజస్థాన్ కాలువ బి) గుజరాత్ కాలువ
సి) చంబల్ కాలువ డి) నర్మదా కాలువ
14) దేశంలోని కృత్రిమ సరస్సు జి.బి.పంత్ సాగర్ ఏ ప్రాజెక్టు వల్ల ఏర్పడింది?
ఎ) కోసి బి) ఫరక్కా
సి) హీరాకుడ్ డి) రిహాండ్
15) బీహార్, నేపాల్‌ల సంయుక్త ప్రాజెక్టు ?
ఎ) రామ్‌గంగా ప్రాజెక్టు బి) గండక్ ప్రాజెక్టు
సి) కుందా ప్రాజెక్టు డి) కొయానా ప్రాజెక్టు
16) సర్దార్ సరోవర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
ఎ) గోదావరి బి) తపతి
సి) నర్మద డి) మహానది
17) దేశంలో అత్యంత ఎత్తైన బహుళార్థ సాధక ప్రాజెక్టు ?
ఎ) తెహ్రీ డాం
బి) సలాల్ ప్రాజెక్టు
సి) బాబ్లి ప్రాజెక్టు
డి) జయక్వాడీ ప్రాజెక్టు
18) దేశంలోని అతిపెద్ద నీటి పారుదల ప్రాజెక్టు ?
ఎ) బాగ్లీహార్ బి) భాక్రానంగల్
సి) బాబ్లి ప్రాజెక్టు డి) రామ్‌గంగా ప్రాజెక్టు
19) మలప్రభ, ఘటప్రభ ప్రాజెక్టులు ఏ రాష్ట్రానికి చెందినవి?
ఎ) మహారాష్ట్ర బి) కేరళ
సి) గోవా డి) కర్ణాటక
20) వివిధ రాష్ట్రాలలో ఉన్న ముఖ్య కాలువలను తెలుపండి?
రాష్ట్రం కాలువ పేరు
1. పంజాబ్ పి) సర్హింద్ కాలువ
2. ఉత్తర ప్రదేశ్ క్యూ) శారద కాలువ
3. రాజస్థాన్ ఆర్) ఘగ్గర్ కాలువ
4. బీహార్ ఎస్) సోన్ కాలువ
ఎ) 1-పి, 2-ఆర్, 3-ఎస్, 4-క్యూ
బి) 1-ఎస్, 2-పి, 3-క్యూ, 4-ఆర్
సి) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
డి) 1-ఆర్, 2-ఎస్, 3-క్యూ, 4-పి
21) ఏ ప్రాజెక్టు నిర్మాణం వల్ల గురుగోవింద్ సాగర్ అనే కృత్రిమ సాగర్ ఏర్పడింది?
ఎ) మాల్ హస్తి బి) భాక్రానంగల్ సి) ఇడుక్కి డి) ఆల్మట్టి
22) ఉకారు, కాక్రపార ప్రాజెక్టులు ఏ నదిపై కలవు?
ఎ) నర్మద బి) తపతి
సి) తావా డి) కోరునా
23) తెలుగు గంగ ప్రాజెక్టు ఏ నగరానికి తాగునీటి
సరఫరా చేస్తుంది?
ఎ) బెంగళూరు బి) చెన్నై
సి) నాగపూర్ డి) విశాఖపట్నం
24) కాలువల ద్వారా అత్యధిక వ్యవసాయం జరుగు రాష్ట్రం ఏది?
ఎ) మధ్యప్రదేశ్ బి) మహారాష్ట్ర
సి) హర్యానా డి) ఉత్తరప్రదేశ్
25) బావుల ఆధారంగా చేసే వ్యవసాయం ఏ రాష్ట్రంలో అధికం?
ఎ) మహారాష్ట్ర బి) కర్ణాటక
సి) ఉత్తరప్రదేశ్ డి) పంజాబ్
26) భారతదేశంలో అత్యధిక నీటిపారుదల వేటి ద్వారా జరుగుతుంది?
ఎ) బావులు బి) చెరువులు
సి) కాలువలు డి) బి,సి
27) మెట్టూరు ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదస్పదమైంది?
ఎ) కర్ణాటక - మహారాష్ట్ర
బి) తమిళనాడు - కర్ణాటక
సి) తమిళనాడు - కేరళ
డి) ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు
28) నాగార్జునాసాగర్ను ఏ సంవత్సరంలో జాతికి అంకితం చేశారు?
ఎ) 1952 బి) 1955
సి) 1967 డి) 1970
29) నాగార్జునా సాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి?
ఎ) 1948 బి) 1950
సి) 1955 డి) 1962
30) పారంబికులం ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల ఉమ్మడి పథకం?
ఎ) తమిళనాడు - కేరళ
బి) కర్ణాటక - తమిళనాడు
సి) కర్ణాటక - కేరళ
డి) కర్ణాటక - మహారాష్ట్ర
సమాధానాలు
1.సి 2.సి 3.డి 4.సి 5.బి
6.బి 7.బి 8.సి 9.బి 10.డి
11.ఎ 12.ఎ 13.ఎ 14.డి 15.బి
16 సి 17.ఎ 18.బి 19.డి 20.సి
21.బి 22.బి 23.బి 24.డి 25.సి
26.ఎ 27.బి 28.సి 29.సి 30.ఎ
- జి.ఉపేందర్
హైదరాబాద్
ఫోన్ : 9676669049
Authorization