1. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) 2016-17లో రాష్ట్రంలో అత్యధిక నికర సాగు విస్తీర్ణం నల్లగొండ జిల్లాలో ఉంది
బి) 2016-17లో నిజామాబాద్ జిల్లాలో సాంద్రత 1.25గా ఉంది
సి) 2016-17లో రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో నికర పంట సాగు విస్తీర్ణం 42.59% గా ఉంది
డి) 2016-17లో రాష్ట్రంలో స్థూల పంట సాగు విస్తీర్ణం 59.70 లక్షల హెక్టార్లు
2. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) 'రాజోలి బండ డైవర్షన్ స్కీం' తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల ఉమ్మడి పథకం
బి) లెండి ప్రాజెక్టు తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు
సి) దిగువ పెన్‌గంగ ప్రాజెక్టు తెలంగాణ, మహారాష్ట్రల ఉమ్మడి ప్రాజెక్టు
ఎ) 1, 2 బి) 2, 3 సి) 1, 3 డి) 1, 2, 3
3. కింది వాటిలో గోదావరి ఉపనది కానిది ఏది?
ఎ) లెండి బి) మూల
సి) ప్రవర డి) కౌలాసనాలా
4. కింది వాటిలో సరికాని జత ఏది?
ఎ) ఇక్కత్ ఫ్యాబ్రిక్ - గద్వాల
బి) వెండి పాత్రలు - కరీంనగర్
సి) ఇత్తడి పరిశ్రమ - పెంబర్తి
డి) గొల్లభామ చీరలు - సిద్ధిపేట
5. కింది వాటిని జత చేయండి
వన్యమృగ
సంరక్షణ కేంద్రం ప్రాంతం
1. శివ్వారం అ) నాగర్‌కర్నూల్, నల్లగొండ
2. పోచారం ఆ) కొత్తగూడెం
3. రాజీవ్‌గాంధీ ఇ) మంచిర్యాల, పెద్దపల్లి
4, కిన్నెరసాని ఈ) మెదక్, కామారెడ్డి
ఎ) 1-ఈ, 2-ఇ, 3-అ, 4-ఆ
బి) 1-ఈ, 2-ఇ, 3-ఆ, 4-అ
సి) 1-ఇ, 2-ఈ, 3-అ, 4-ఆ
డి) 1-ఇ, 2-ఆ, 3-ఈ, 4-ఇ
6. కింది వాటిలో సరైంది ఏది?
1.జేగురు మృత్తికలను మొదట మన దేశంలో కేరళలో గుర్తించారు
2. ఎర్ర నేలలు అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి
3. నల్లరేగడి సాధారణంగా గాలి పారేటట్లుగా ఉంటాయి
ఎ) 1, 2 బి) 1, 3 సి) 2, 3 డి) 1, 2, 3
7. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) భారతదేశంలో వేసవి కాలంలో కురిసే వర్షపాతం - సంవహన వర్షపాతం
బి) పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో వీచే వేడి గాలులను 'నార్వెస్టర్స్' అని పిలుస్తారు
సి) కర్ణాటక రాష్ట్రంలో కురిసే చిరుజల్లులను చెర్రీ బోసమ్స్ అంటారు
డి) 'లూ' అనేది భారతదేశంలో ఒక శిఖరం
8. కింది వాటిలో సరికాని జత ఏది?
ఎ) అష్టముడి సరస్సు - కేరళ
బి) చిలుక సరస్సు - పశ్చిమ బెంగాల్
సి) లోక్తక్ సరస్సు - మణిపూర్
డి) నాల్ సరస్సు - గుజరాత్
9. కింది వాటిని జతపరచండి
ప్రాజెక్టులు నదులు
1. తెహ్రీం డ్యాం అ) నర్మద
2. సర్దార్ సరోవర్ ఆ) భగీరథ
3. జయక్వాడి ఇ) జీలం
4. తల్బుల్ ఈ) గోదావరి
ఎ) 1-ఇ, 2-ఈ, 3-అ, 4-ఆ
బి) 1-ఇ, 2-అ, 3-ఈ, 4-ఆ
సి) 1-ఆ, 2-అ, 3-ఈ, 4-ఇ
డి) 1-ఈ, 2-ఇ, 3-ఆ, 4-అ
10. ప్రతిపాదన (ఎ) : పర్వత భూముల్లో తేయాకు అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది
కారణం (ఆర్) : హ్యూమస్ పదార్ధం అధికంగా ఉన్న మృత్తికలు ఈ పంటకు అత్యంత అనుకూలం
ఎ) ఎ, ఆర్లు సరైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ
బి) ఎ, ఆర్ లు సరైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
సి) ఎ సరైంది, ఆర్ సరైంది కాదు
డి) ఎ సరైంది కాదు, ఆర్ సరైంది
11. కింది వాటిలో సరైంది ఏది?
1) భారతదేశంలో 5 భూపరివేష్టిత రాష్ట్రాలున్నాయి
2) తెలంగాణ రాష్ట్రం విస్తీర్ణం పరంగా 9వ స్థానంలో ఉంది
3) భారత్ సుమారుగా 15,200 కి.మీల భూ సరిహద్దు కలిగి ఉంది
ఎ) 1, 2 బి) 1, 3 సి) 2, 3 డి) 1, 2, 3
12. కింది వాటిని జతచేయండి
జాబితా 1 జాబితా 2
1. జయంతియా కొండలు అ) అసోం
2. పాట్కారుభమ్ ఆ) మిజోరం
3. లుషాయి ఇ) అరుణాచల్‌ప్రదేశ్
4. మికిర్ ఈ) మేఘాలయ
ఎ) 1-ఇ, 2-అ, 3-ఈ, 4-ఆ
బి) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
సి) 1-ఇ, 2-ఈ, 3-అ, 4-ఆ
డి) 1-ఈ, 2-ఇ, 3-ఆ, 4-అ
13. కింది వాటిలో సరికానిదిఏది?
ఎ) హిమాలయాలు 'టెర్షియరీ' యుగంలో ఆవిర్భవించాయి
బి) హిమాలయాల్లో ఉత్తరంగా ఉన్న శ్రేణిని 'కారకోరం' పర్వత శ్రేణి అని పిలుస్తారు
సి) ద్వీపకల్ప ఫలక, యురేషియా ఫలక ఢ కొట్టడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి
డి) హిమాలయాలు సుమారు 5లక్షల చ.కి.మీ వైశాల్యం కలిగి ఉన్నాయి
14. కింది వాటిని జతపరచండి
బయోస్పియర్ ప్రాంతం
1. మానస అ) మేఘాలయ
2. సిమ్లిపాల్ ఆ) కేరళ
3. అగస్త్యమలై ఇ) ఒడిశా
4. నాక్రెక్ ఈ) అసోం
ఎ) 1-ఇ, 2-ఈ, 3-అ, 4-ఆ
బి) 1-ఆ, 2-అ, 3-ఈ, 4-ఇ
సి) 1-ఈ, 2-ఇ, 3-ఆ, 4-అ
డి) 1-ఈ, 2-అ, 3-ఆ, 4-ఇ
15. కింది వాటిలో సముద్ర పోటు ప్రాంతాల్లో పెరిగే ముఖ్యమైన వృక్షం ఏది?
ఎ) ఫర్ బి) టేకు
సి) సాల్ డి) సుందరి
16. కింది వాటిలో సరైంది ఏది?
1) దేశంలో మొట్టమొదటి ఉన్ని పరిశ్రమలను 'లాల్ ఇమ్లీ' వద్ద ఏర్పాటు చేశారు
2) శివకాశి అగ్గిపుల్లల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది
3) దేశంలో లక్కను అత్యధికంగా జార్ఖండ్ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది
ఎ) 1, 2 బి) 1, 3 సి) 2, 3 డి) 1, 2, 3
17. కింది వాటిని జతచేయండి
రైల్వే జోన్ ప్రధాన కేంద్రం
1. దక్షిణ రైల్వే అ) గోరఖ్‌పూర్
2. ఈశాన్య రైల్వే ఆ) కోల్‌కతా
3. తూర్పు కోస్తా రైల్వే ఇ) చెన్నై
4. ఆగేయ రైల్వే ఈ) భువనేశ్వర్
ఎ) 1-ఆ, 2-ఇ, 3-ఈ, 4-అ
బి) 1-ఇ, 2-అ, 3-ఈ, 4-ఆ
సి) 1-ఇ, 2-ఈ, 3-అ, 4-ఆ
డి) 1-ఆ, 2-ఈ, 3-అ, 4-ఇ
సమాధానాలు
1.బి 2.సి 3.బి 4.ఎ 5.సి
6.ఎ 7.డి 8.బి 9.సి 10.ఎ
11.బి 12.డి 13.బి 14.సి 15.డి
16.డి 17.బి
Authorization