1. రాజనీతి శాస్త్రాన్ని నిర్వచించి, ఆ శాస్త్ర పరిధిని వివరించండి?
1) రాజనీతి శాస్త్రం రాజ్యంతో ఆరంభమై రాజ్యంతోనే అంతమవుతుంది.- గార్నర్.
2) రాజనీతి శాస్త్ర మంటే ప్రభుత్వం గురించి అద్యయనం చేసే శాస్త్రం.- స్టీఫెన్ లీకాక్.
రాజనీతి శాస్త్ర పరిధి:
1) సమాజం: రాజ్యాలతో మానవునికి గల సంబంధాల అధ్య యనం: రాజనీతి శాస్త్రం మానవునికి, సమాజానికి మధ్య గల సంబంధాన్ని వివరిస్తుంది. సమాజం పుట్టుక, పరిణామం, ఉద్ధేశ్యాలను తెలుపుతుంది. మాన వుడు సంఘజీవి అని అరిస్టాటిల్ భావించాడు. సమా జంలో మానవుడు ఏవిదంగా సర్దుబాటు చేసుకోని జీవిస్తాడో రాజనీతి శాస్త్రం వివరిస్తుంది.
2) రాజ్య అధ్యయనం: పాల్ జానెట్, బ్లంట్ షిల్లీ, గార్నర్ రాజనీతి శాస్త్రాన్ని రాజ్య అధ్యయన శాస్త్రంగా పరిగ ణించారు. రాజ్యానికి పౌరులకి మధ్యగల సన్నిహిత సంబంధాన్ని ఈ శాస్త్రం తెలుపుతుంది. అలాగే రాజ్య అవతరణ సిద్దాంతాలను వివరిస్తుంది. రాజ్యం గతంలో ఎలా ఉండేది, వర్తమానంలో ఎలా ఉంది, భవిష్యత్ లో ఎలా ఉండబోతుంది అనే విషయాలను రాజనీతి శాస్త్రం విశ్లేషిస్తుంది.
3) ప్రభుత్వ అధ్యయనం: రాజనీతి శాస్త్రం ప్రభుత్వ అధ్యయ నానికి సంబందించిన శాస్త్రమని స్టీఫెన్ లీకాక్ మరియు సీలీలు పేర్కోన్నారు. ప్రభుత్వమనేది రాజ్యపు ప్రతినిథి అనీ, ప్రభుత్వం లేకుండా రాజ్యం ఉండదని వారు భావించారు. ప్రభుత్వం ద్వారానే రాజ్య ఆశయాలు నేరవేరతాయి. కొంత మంది వ్యక్తులు రాజ్యం తరపున అధికారాలు చెలాయించడాన్ని ప్రభుత్వం అంటారు. వివిద ప్రభుత్వాల పనితీరును గురించి అధ్యయనం చేస్తుంది.
4).సంఘాలు, సంస్థల అధ్యయనం: వ్యక్తి జీవనాన్ని ప్రభావితం చేసే అనేక సంఘాలు, సంస్థలు కలవు. ప్రతి వ్యక్తి రాజ్యంలోని భిన్న సంఘాలు, సంస్థలలో సభ్యుడిగా ఉంటాడు. ఈ సంఘాలు సంస్థలు వ్యక్తుల సంపూర్ణ వికాసానికి, అభివద్ధికి తోడ్పడుతాయి. రాజనీతి శాస్త్రం స్వచ్చంద సంస్థలు, ఉద్యోగబంద సంఘాలు మరియు ప్రభుత్వ అంగాలను గురించి అద్యయనం చేస్తుంది.
5). హక్కులు-బాధ్యతల అద్యయనం: రాజ్యంలో ప్రతి పౌరుడు వివిద రకాలైన హక్కులు మరియు బాధ్యతలను కలిగి ఉన్నారు.
ఉదాహరణ:- జీవించే హక్కు, స్వాతంత్య్రపు హక్కు, ఆస్తి హక్కు. భాధ్యతలలో పన్నుల చేల్లింపు, శాసన విధేయత లాంటివి ఉన్నాయి.
6). జాతీయ, అంతర్జాతీయ అంశాల అధ్యయనం: రాజనీతి శాస్త్రం 20వ శతాబ్ధం నుండి ప్రపంచంలోని వివిద దేశాల మధ్య సంబంధాలను చర్చిస్తుంది. ప్రచ్చన్న యుద్దం, ప్రాబల్యసమతౌల్యం, నిరాయుధికరణ, దౌత్యనీతి తదితర అంశాలను వివరిస్తుంది. ఆధునిక రాజ్యాలు ఒంటరి రాజ్యాలు కావు. వస్తు సేవల ఎగుమతి, దిగుమతి విషయంలో ఇతర రాజ్యాలపై ఆదారపడుతున్నాయి. UNO, NATOఉ లాంటి సంస్థ లను అధ్యయనం చేస్తుంది.
6).శక్తి అధ్యయనం: ప్రవర్తనా వాదులు 20వ శతాబ్దంలో రాజనీతి శాస్త్రాన్ని శక్తి అధ్యయన శాస్త్రంగా భావిం చారు. ఈ శాస్త్రం శక్తి ఏవిధంగా దక్కించుకోని వినియో గించబడుతుందనే విషయాన్ని అధ్యయనం చేస్తుంది. రాజకీయ సామాజీకీకరణ, రాజకీయ సంస్క తి గురించి ఈ శాస్త్రం అధ్యనం చేస్తుంది.
7). ప్రభుత్వ విధానాల అధ్యయనం: ఆధునిక రాజనీతి శాస్త్రవేత్తలైన డేవిడ్ ఈస్టన్, చార్లెస్ లిండ్ బామ్ లు రాజనీతి శాస్త్రాన్ని ప్రభుత్వ విధానాల రూపకల్పనలకు సంబందించిన శాస్త్రమని వివరించారు. రాజకీయ నిర్మితుడు, రాజకీయ వర్గాల పాత్రను ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది.
పైన తెలిపిన విధంగా రాజనీతి శాస్త్ర పరిధి ఇటివల కాలంలో భాగా విస్తరించింది.
2. రాజనీతి శాస్త్ర అధ్యయన ప్రాముఖ్యతను వివరించండి?
రాజనీతి శాస్త్ర అధ్యయనం ఏంతో ప్రయోజనకరమై నది మరియు విలువైనది. ఈ శాస్త్ర పరిజ్ఞానం పాల కులు, పాలితులు ఇరువురికి ఎంతగానో అవశ్యమైంది.
రాజనీతి శాస్త్ర ప్రాముఖ్యత:
1). రాజ్యం గురించి సమాచారం: రాజ్యానికి సంబందించిన పరిజ్ఞానాన్ని రాజనీతి శాస్త్రం అందిస్తుంది. రాజ్యం అవతరణ దాని స్వభావం మరియు విధుల గురించి రాజ్యనీతి శాస్త్రం అధ్యయనం చేస్తుంది. ప్రతిపౌరునికి రాజకీయ మరియు సామాజిక విషయాల అవగాహనను అందిస్తుంది.
2). ప్రభుత్వం-పరిపాలన పరిజ్ఞాణం: రాజ్యంలో ప్రభుత్వ పరిపాలన పటిష్టవంతంగా నిర్వహించేందుకు పాల కులకు రాజకీయ నాయకులకు రాజనీతి శాస్త్ర పరిజ్ఞానం ఎంతో అవసరం. పరిపాలన యంత్రాంగం, ప్రజాసంబందాల నిర్వహణ, స్థానిక సంస్థల నిర్వహణ తదితర అంశాలపై ఈ శాస్త్రం చక్కటి అవగాహన కల్పిస్తుంది.
3). ప్రజాస్వామ్య విలువల సమాచారం: రాజనీతి శాస్త్ర అధ్యయనం రాజ్యం, ప్రభుత్వం, జాతి, జాతీయత, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం మరియు కమ్యూనిజం లాంటి అనేక రాజకీయ భావనల సమా చారాన్ని అందిస్తుంది. రాజకీయ భావలైన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, హక్కుల పట్ల మంచి అవగాహన ఇస్తుంది.
4).హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన: రాజనీతి శాస్త్రం ప్రజలలో హక్కులు, బాధ్యతల పట్ల చక్కని అవగా హనను అందిస్తుంది. ప్రజాస్వామ్య విజయం హక్కులు, భాద్యతలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి పౌరుడు రాజ్యం, సమాజంలో బాధ్యతయుతమైన పాత్ర పోషించేటట్లు రాజనీతి శాస్త్ర అధ్యయనం దోహదపడుతుంది.
5). మంచి పౌరసత్వ గుణాల బోధన: రాజనీతి అధ్యయనం వల్ల వ్యక్తి మంచి పౌరుడిగా తీర్చిదిద్దబడతాడు. మంచి పౌరుడు చట్టాలు ఎలా రూపొందించబడుతాయి. ప్రభుత్వవిధానాల రూపకల్పన మరియు పనితీరు గురించి తెలుసుకోవడానికి, పౌరులను ఆదర్శ పౌరులు గా తీర్చిదిద్ది పౌరసత్వ గుణాలను అందిస్తుంది.
6). ప్రపంచ వ్యవహరాల పరిజ్ఞానం: రాజనీతి శాస్త్ర అధ్యయనం సమకాలీన ప్రపంచంలో జరిగే సంఘ టనల పరిజ్ఞానాన్ని అందిస్తుంది. తద్వారా అంతర్జా తీయ సమస్యల పట్ల అవగాహన పెరుగుతుంది.
7). అంతర్జాతీయ సంస్థల పరిజ్ఞానం: ఐక్యరాజ్యసమితి దాని అనుబంద సంస్థల పరిజ్ఞానాన్ని అందిస్తుంది. ప్రపంచ రాజ్యాల మధ్య గోడవలు వస్తే వాటిని ఎలా పరిష్కరించాలని, ఆయుదాలవల్ల ఏర్పడే ప్రమాదాలు, నిరాయుధీకరణ అవశ్యకతను, ప్రచ్ఛన్న యుద్దం, వలసవాదం, సామ్రాజ్యవాదం వల్ల ఏర్పడే ప్రమాధా లను తెలిపి, ప్రపంచ శాంతి అవశ్యకతను వివరిస్తుంది.
8). రాజకీయ అవగాహనను పెంపోందించడం: రాజ నీతి శాస్త్ర అధ్యయనం ద్వారా స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటీ రాజకీయ అంశాలకు సంబందించిన పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరు పొందవచ్చు. అలాగే ఫాసిజం, సామ్యవాదం, కమ్యూనిజం లాంటి భావజా లాల సమగ్రమైన అవగాహనను పొందవచ్చు. ఫలితం గా ప్రజలలో రాజకీయ చైతన్యం పెరుగుతుంది.
దారావత్ సైదులు నాయక్
సివిక్స్ లెక్చరర్
గవర్నమెంట్ జూనియర్ కాలేజ్
జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా
ఫోన్ 9908569970
Authorization