1. 'మ్యాన్‌కైండ్' అనే పత్రిక స్థాపించింది ఎవరు?
1) మంత్రి శ్రీనివాసరావు 2) ఎ. వేణుగోపాల్
3) మాడపాటి హనుమంతరావు
4) ప్రొ. కేశవరావు జాదవ్
2. 'నా జ్ఞాపకాలు' అనే ఆత్మకథను రచించింది ఎవరు?
1) మిట్ట యాదవరెడ్డి
2) కొండపల్లి శేషగిరిరావు
3) వెల్దుర్తి మాణిక్యరావు
4) కోదాటి నారాయణరావు
3. 'ఇక్కడి చెట్లగాలి' రచయిత ఎవరు?
1) నందిని సిధారెడ్డి
2) సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
3) సి. నారాయణ రెడ్డి
4) పొట్లపల్లి రామారావు
4. 'కౌడీ' అనగా నేమి?
1) అప్పు 2) నగదు 3) లాభం 4) నష్టం
5. ప్రపంచ మిమిక్రీ దినం?
1) డిసెంబర్ 28 2) జనవరి 18
3) ఏప్రిల్ 16 4) సెప్టెంబర్ 4
6. ఆంగ్లంలో 'వేణుమాధవ్ జీవిత చరిత్రను రచించిన వారు?
1) ఐ.వి. చలపతిరావు 2) వెలిచాల కొండలరావు
3) బి.ఎస్.రాములు 4) కె.జితేంద్రబాబు
7. తహజీబ్(సంస్కృతి) అనే సంస్థను నిర్మాణం చేసినవారు?
1) కాళోజీ నారాయణరావు 2) గద్దర్
3) కేశవరావు జాదవ్ 4) జయశంకర్
8. సి. నారాయణ రెడ్డి పొందని అవార్డు?
1) పద్మశ్రీ 2) పద్మభూషణ్
3) దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 4) జ్ఞానపీఠ్
9. 'మా భూమి' సినిమాకు దర్శకత్వం వహించిన వారు?
1) మృణాన్ సేన్ 2) కిషన్ చందర్
3) గౌతమ్ ఘోష్ 4) బి. నర్సింగరావు
10. 'మా భూమి' సినిమాలో ఏ గడిలో దాడిచేసే దృశ్యాన్ని తీశారు?
1) దొందిగడి 2) మంగళపర్తి గడి
3) దౌల్తాబాద్ గడి 4) ప్రజ్ఞాపూర్ గడి
11. పైడి జయరాజ్ హీరోగా నటించిన మొదటి చిత్రం?
1) జగ్మతీ జవానీ 2) మాయ
3) హమారీ బాత్ 4) రసీలిరాణి
12. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొలి తెలంగాణ నటుడు.
1) బి. నర్సింగరావు 2) పైడి జయరాజ్
3) బి.ఎస్. నారాయణ 4) టి.ఎల్. కాంతారావు
13. ఏ సంవత్సరంలో నిగార్ సుల్తానా 'హైదరాబాద్ కీ నాజ్నీస్' అనే సినిమాలో హీరోయిన్గా నటించారు?
1) 1938 2) 1952
3) 1968 4) 1942
14. నిగార్ సుల్తానా మొదటిసారిగా నటించిన చిత్రం?
1)ఆగ్ 2) మొఘల్ -ఏ-అజవమ్
3) రంగభూమి 4) హైదరాబాద్ కీ నాజ్నీస్
15. 'దాసి' సినిమాటోగ్రాఫర్ ఎవరు?
1) సుదర్శన్ 2) భూపాల్ రడ్డి
3) ఎ.కె. బీర్ 4) బి. నర్సింగరావు
16. కింది వాటిలో ఏ సినిమాలో పాటలుండవు, మాటలే ఉంటాయి?
1) మార్గదర్శి 2) మాంగల్యం
3) దాసి 4) మా భూమి
17. అంధత్వంలోనే ఒక సినిమాకు దర్శకత్వం నెరిపిన తొలి దర్శకుడు ఎవరు? ఇది ప్రపంచంలోనే ఒక రికార్డు, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో నమోదైంది.
1) బి.ఎస్. నారాయణ 2) అజిత్
3) టి. మాధవరావు 4) ప్రభాకర్ రెడ్డి
18. 'పద్మశ్రీ' పొందిన హైదరాబాద్ నటి?
1) ఆదిత్రావ్ హైదరి 2) దియామిర్జా
3) తెలంగాణ శకుంతల 4) టబూ
19. తెలంగాణలో శ్యాం బెనగల్ నిర్మాతగా వ్యవహరిం చిన మొట్ట మొదటి సినిమా?
1) బాచీ 2) బజార్ 3) నిశాంత్ 4) అంకుర్
20. 'రామదాసు' జీవితం మొదటగా తెరపైకి ఎక్కిన సంవత్సరం?
1) 1933 2) 1964 3) 2009 4) 2011
21. 'గోలకొండ టు బాలీవుడ్' గా ప్రసిద్ధి చెందిన వారు?
1) పైడి జయరాజు 2) శంకర్‌సింగ్
3) అజీత్ హమీద్ అలీఖాన్ 4)) బి. నర్సింగరావు
22. అమెరికాలోని ఫిలిం టెక్నిషియన్స్ శిక్షణలో ఏ సినిమా ఒక పాఠ్యాంశంగా ఉండేది?
1) నిమజ్జనం 2) ఆదర్శం
3) దాసి 4) మా భూమి
23. 'కొమరం భీం' సినిమా దర్శకుడు?
1) టి. ప్రభాకర్ రావు 2) నారదాసు లక్ష్మణ రావు
3) అల్లాడి శ్రీధర్ 4) బి. నర్సింగ్ రావు
24. కింది వాటిలో 'మా భూమి' సినిమాకు రాని అవార్డు?
1) ద్వితీయ ఉత్తమ చిత్రం
2) జాతీయ అవార్డు
3) స్క్రీన్‌ప్లేకు నంది అవార్డు
4) ఇండియన్ పనోరమాకు ఎంపిక
25. 1940 లో హైదరాబాద్ నుండి వెలువడే ఉర్దూ పత్రిక 'సినిమా' లో 'మార్లిన్ డైట్రిచ్ ఆఫ్ ఇండియా సినిమా' అని ఎవరిని కీర్తించినది?
1) మిస్ జోహ్రజాన్ 2) నిగార్ సుల్తానా
3) మృణాళినీ దేవి 4) సునాళినీ దేవి
26. 'చిల్లర దేవుళ్లు' దర్శకుడు తిరునగరి మాధవరావు పూర్వ ఏ జిల్లాకు చెందినవారు?
1) కరీంనగర్ 2) హైదరాబాద్
3) వరంగల్ 4) నల్గొండ
27. తెలంగాణ ప్రాంతానికి చెందిన నిర్మాతగా తీసిన తొలి సినిమా ఏది?
1) ఆకలి 2) ఆదర్శం
3) ఆరాధన 4) చివరకు మిగిలేది
28. భారతీయ తొలిటాకీ 'ఆలంఆరా'లో హైదరాబాద్క చెందిన ఎవరు నాయికగా నటించారు?
1) మస్ జోహ్రజాన్ 2) జుబేదాబేగం
3) నిగార్ సుల్తానా 4) రజియా బేగం
29. 1969 తెలంగాణ ఉద్యమ కాలంలో సినిహీరో కత్తి కాంతారావు నిర్మించిన సినిమా
1) నాద స్వరం 2) తెలంగాణ స్వరం
3) సప్త స్వరాలు 4) భక్తి
30. 1925లోనే ఎం.ఎ. రహమాన్ బొంబాయి వెళ్ళి మూకీలను చేసిన పనితత్వం ఏమిటి?
1) బాలనటుడు 2) కెమెరామెన్
3) హీరో 4) సంగీతం
31. 'రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందా బాద్' అనే తెలుగు సినిమా పాటను రాసిన కవి?
1) చంద్రబోస్ 2) అమ్మంగి వేణుగోపాల్
3) సి. నారాయణ రెడ్డి 4) దేశపతి శ్రీనివాస్
32. 1948లో వచ్చిన ఏ సినిమాలో మెడకు డోలు తగిలించుకోని హైదరాబాద్‌కు చెందిన శంకర్ సింగ్ రఘవంశీ డాన్స్ చేశారు?
1) బర్సాత్ 2) ప్యార్ కీ జీత్
3) సూరజ్ 4) చోరిచోరి
33. ఏ సంవత్సరంలో శంకర్ సింగ్‌కి పద్మశ్రీ పురస్కారం లభించింది?
1) 1959 2) 1969 3) 1979 4) 1989
34. కిందివాటిలో సరికానిది ఏది?
1) హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ శంకర్ సింగ్ వల్లే లతా మంగేష్కర్‌కు 'ఉత్తమ గాయని అవార్డులో చ్చాయి.
2) కె.ఏ. అబ్బాస్ వంటి ప్రసిద్ధ హిందీ దర్శకుడు 'మా భూమి' చిత్రాన్ని చూసి '' అసలు ఈ సినిమాకు సెన్సార్ ఎలా వచ్చిందని '' ఆశ్చర్య పోయారు.
3) అందెశ్రీని పాటల రచయితగా, ఉదయభానుని నటిగా, కెమెరామెన్‌గా సురేందర్ రెడ్డికి తొలిసారిగా 'ఆదర్శం' చిత్రంలో అవకాశం కల్పించారు.
4) తెలంగాణ సాయుధ పోరాటాన్ని వేదికగా చేసుకొని 'దాసి' సినిమా తీశారు.
35. 'బతుకమ్మ' సినిమా దర్శకుడు ఎవరు?
1) విశ్వేశ్వరరావు 2) ప్రభాకర్
3) ఉదయకుమార్ 4) అల్లాడి శ్రీధర్
36. సినిమాల ప్రదర్శన రంగంలో భారతదేశంలో ఎక్కడా జరగని ప్రక్రియ హైదరాబాద్‌లో జరిగింది అదేమిటి?
1) సినిమా బండి
2) మహమూద్‌మియా సినిమాబండి
3) రిక్షాబండి 4) తెరచాటు బండి
37. బాలీవుడ్లో హైదరాబాద్‌కు చెందిన తొలినటి?
1) టబు 2) నిగార్ సుల్తానా
3) జుబేదాబేగం 4) మిస్జోహ్రజాన్
38. 1968లో హైదరాబాద్‌కు చెందిన వెంకటనర్సయ్య, శంకరయ్యలతో కలసి రాజ్‌కపూర్ ఏ చిత్రాన్ని అమాయ కుడుగా తెలుగులో రిమేక్ చేద్దామని సిద్దపడ్డాడు?
1) నాడి 2) అనాడి 3) దమాక్ 4) పస్తూల్
39. ''పట్నంలో శాలిబండ పేరైనా గోలకొండ'' అనే పాట రచయిత ఎవరు?
1) దేశపతి శ్రీనివాస్ 2) సి. నారాయణరెడ్డి
3) చంద్రబోస్ 4) ఎ. వేణుగోపాల్
40. 'ఆలం ఆరా' అనగానేమి?
1) వ్యక్తి 2) శిశువు 3) దేశభక్తి 4) దేశం
41. 1931 వేసవిలో హైదరాబాద్‌లో విడుదలైన తొలి భారతీయ టాకీ చిత్రం?
1) షిరీన్ పరమాద్ 2) ఆలంఆరా
3) షికారీ 4) అనంగసేన
42. 'ది ఎమర్జెన్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ' రచయిత ఎవరు?
1) ప్రొ. నాగేశ్వరరావు 2) అల్లం నారాయణ
3) కె. రామచంద్రమూర్తి 4) కట్టా శేఖర్ రెడ్డి
43. అక్షరాయుధం పుస్తక రచయిత?
1) ఆర్. సత్యనారాయణ 2) ఎమ్. వెంకటేశ్వరరావు
3) నందిని సిధారెడ్డి 4) మంత్రి శ్రీనివాసరావు
44. భారత్ చైనా యుద్ధ సమయంలో సైనికుల కోసం ముమావో పర్వత శ్రేణుల వద్దకు కూడా వెళ్ళి ప్రదర్శనలిచ్చి వారిలో నూతనోత్తేజాన్ని నింపినవారు?
1) ఎ. వేణుగోపాల్ 2) నేరెళ్ళ వేణుమాధవ్
3) కేశవరావు జాదవ్ 4) బి. ఎస్. నారాయణ
45. 'కొమురంభీం' సినిమా 2010లో విడుదల అయినది, కాని సినిమా ఏ సంవత్సరంలో పూర్తి అయినది?
1) 2008 2) 1990
3) 2002 4) 1996
46. 'భక్తరామదాసు' చిత్రం విడుదల అయిన సంవత్సరం?
1) 2007 2) 1964 3) 2003 4) 1976
47. 'బిల్వమంగళ్' మొదటి ప్రదర్శన హైదరాబాద్‌లోని ఏ టాకీస్‌లో ప్రారంభమైనది?
1) సెలెక్ట్ టాకీస్ 2) ఎస్టేట్ టాకీస్
3) జమ్రుద్ టాకీస్ 4) యమునా టాకీస్
48. 'ఆలంఆరా' దర్శక నిర్మాత ఎవరు?
1) జోషప్డేవిడ్ 2) అర్దేషిర్ ఇరానీ
3) ధన్రాజ్గిరి 4) ఆదీఇరానీ
49. 1979లో తెలుగు జాతీయ ఉత్తమ సినిమాగా ఎంపికైన 'నిమజ్జనం' దర్శకుడు బి.ఎస్. నారా యణ పూర్వ ఏ జిల్లాకు చెందిన వారు?
1) హైదరాబాద్ 2) కరీంనగర్
3) మెదక్ 4) నల్గొండ
50. మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రత్యేక ప్రదర్శన వేయించు కున్న పైడి జయరాజ్ సినిమా పేరు?
1. హతీంతాయి 2) హమారీబాత్
3) షికారీ 4) రసీలిరాణి
51. రాజ్‌కపూర్ దర్శక, నిర్మాతగా, హీరోగా తీసిన తొలి సినిమా 'ఆగ్'లో ముగ్గురు కథానాయికల్లో ఇద్దరు నర్గీస్, కామిని కౌషల్ కాగా మరో హిరోయిన్‌గా నటించిన హైదరాబాదీ ఎవరు?
1) జుబేదాబేగం 2) మిస్ జోహ్రాజాన్
3) నిగార్ సుల్తానా 4) టబు
52. తెలంగాణ చెందిన మాలవత్ పూర్ణ అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంపై ఒక హిందీ సినిమాను నిర్మించారు. ఆ సినిమా దర్శకులు ఎవరు?
1) రాహుల్ బోస్ 2) కబీర్ ఖాన్
2) సుజరుఘోష్ 4) సిద్ధికి
53. 'దాసి' చిత్రంలో నటించిన నాయకీ ఎవరు?
1) అర్చన 2) అనూష
3) విశాలాక్షి 4) సంద్య
సమాధానాలు
1.4 2.1 3.1 4.2 5.1 6.1 7.3 8.3 9.3 10.1 11.4 12.2 13.2 14.3 15.3 16.3 17.1 18.4 19.4 20.1 21.3 22.3 23.3 24.2 25.1 26.3 27.2 28.2 29.3 30.2 31.3 32.2 33.3 34.4 35.2 36.2 37.3 38.2 39.4 40.2 41.2 42.3 43.1 44.2 45.2 46.2 47.3 48.2 49.2 50.1 51.3 52.1 53.1