1. అజరు, విజరు వయస్సులు 3:4 నిష్పత్తిలో వున్నాయి. 5 సంవత్సరాల తరువాత వయస్సుల నిష్పత్తి 4:5 అయితే,విజరు ప్రస్తుత వయస్సు ఎంత?
1)15 2)18 3)20 4)24
2. రూ. 5,000లపై 10% సాలీనా వడ్డీరేటుతో 3 సంవత్స రాలకు బారువడ్డి, చక్ర వడ్డీల మధ్య తేడా ఎంత?
1)145 2)150 3)155 4)180
3. ఒక తండ్రి, కుమారుడి వయస్సుల మొత్తం 55 సంవత్సరాలు. 5సంవత్సరాలు క్రితం, వారి వయస్సుల లబ్దం 350. కుమారుడి ప్రస్తుత వయస్సు ఎంత?
1)15 2)10 3)12 4)13
4. ఒక కారు 108 కి.మీ./గ0. వేగంతో ప్రయాణిస్తుంది. ఆ కారు 15 సెకన్లలో ఎన్ని మీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది?
1)450 2)45 3)55 4)90
5.120 మీ. పొడవు గల రైలు, ప్లాట్ ఫాం ఫై నిల్చున్న ఒక వ్యక్తిని 10 సెకన్లలో దాటితే, ఆ రైలు వేగం ఎంత? (మీ/సె)
1)10 2)12 3)15 4)20
6. రెండు రైళ్ళ వేగాల నిష్పత్తి 7:8 రెండవ రైలు 4 గంటల్లో 400 కి.మీ. ప్రయాణిస్తే మొదటి రైలు వేగం ఎంత?
1) 75 2) 84 3) 87.5 4) 90
7. రామ్,శ్యాం, కమల్‌లు ఒక వ్యాపారాన్ని భాగాస్వా ములుగా ప్రారంభించారు. వారి పెట్టుబడులు 3:4:7 నిష్పత్తిలో వుంటే, సంవత్సరాంతమున వచ్చిన రూ.21,000లో కమల్‌కి వచ్చిన లాభం ఎంత?
1)12,500 2)10,500
3)15,000 4)10,000
8. ఒక వ్యక్తి టైపురైటర్ ని 5% నష్టానికి అమ్మెను. రూ.80 ఎక్కువ ధరకు అమ్మి వుంటే అతనికి 5% లాభం వచ్చి వుండేది. టైపు రైటర్ కొన్న వెల ఎంత?(రూ.లలో)
1)1600 2)1200 3)1000 4)800
9. ఒక వ్యాపారస్తుడు ఒక వస్తువుని రూ.1500 అమ్మడం ద్వారా 15% నష్టం పొందితే ఆ వస్తువు కొన్న వెల ఎంత?(రూ.లలో )
1)1650 2)1700 3)1750 4)1765
10. ఒక కిరాణాదారుడు ఒక వస్తువుని రూ.840 కి అమ్మి 20% లాభం పొందెను.30% లాభం పొంద వలనంటే ఆ వస్తువుని ఎంత ధరకి అమ్మ వలెను? (రూ.లలో)
1) 900 2) 960 3)910 4)920
11. ముగ్గురు వ్యక్తుల సగటు వయస్సు 23 సం.లు. నాల్గవ వ్యక్తి వయస్సు కలసినప్పటికి నలుగురి వయస్సు 23 సంవత్సలే అయితే, నాల్గవ వ్యక్తి వయస్సు ఎంత?
1)20 2)23 3)22 4)21
12. రెండు సంఖ్యల సగటు 27. మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో సగం అయితే రెండవ సంఖ్య ఎంత?
1)18 2)24 3)30 4)36
13. రెండు కుండల పరిమాణాలు 120 లీటర్లు, 56 లీటర్లు అయితే, ఆ రెండిటిలోని పదార్థాన్ని ఖచ్చితంగా కొలవడానికి ఎన్ని లీటర్ల పాత్ర కావాలి?
1) 7.5 2) 7.8 3)8 4) 9.5
14. రెండు సంఖ్యల లబ్దం 1320, వాటి గ.సా.బా. 6 అయితే, ఆ సంఖ్యల క.సా.గు. ఎంత?
1)220 2)260 3)120 4)230
15.7,10,15,21 మరియు 28లచే నిశేషంగా భాగించగలిగే ఐదు అంకెల గరిష్ట సంఖ్య ఏది?
1)99840 2)99900
3)99960 4)99990
16. నాలుగు వరుస సహజ సంఖ్యల మొత్తం 54. మొదటి, చివరి సంఖ్యల వర్గాల బేధం ఎంత?
1)69 2)75 3)81 4)87
17. 6 గంటల 15 నిముషాలకు గడియారంలోని రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత?
1) 87.5 2) 97.5 3) 75 4) 112.5
18. 36 మంది పురుషులు ఒక పనిని 18 రోజులలో పూర్తి చేస్తే అదే పనిని 27 మంది పురుషులు ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు?
1) 18 2) 20 3) 24 4) 26
19. 3 పంపులు రోజుకు 8 గంటల చొప్పున పని చేసిన ఒక ట్యాంక్‌ని 2 రోజుల్లో ఖాళీ చేయగలవు. నాలుగు పంపులు రోజుకు ఎన్ని గంటలు పనిచేసి ఒక రోజులో ఆ ట్యాంక్ ని ఖాళీ చేయగలవు?
1)9 2)10 3)11 4)12
20. 15 సంవత్సరాల తరువాత ఒక వ్యక్తి వయస్సు, 15 సంవత్సరాల క్రితం అతని వయస్సుకు 4 రెట్లు వుంటే, అతని ప్రస్తుత వయస్సు ఎంత?
1) 35 2) 30 3) 20 4) 25
21. రెండు సంవ్సతరాల తరువాత 12% సాలీనా వడ్డీ రేటుతో చక్రవడ్డితో కలిపి 7840 రూపాయలు పొందాలంటే ఇప్పుడు ఎంత డబ్బు పొదుపు చేయాలి?
1) 6400 రూ. 2) 6500 రూ.
3) 6250 రూ. 4) 6300 రూ.
22. ఒక వ్యక్తి రూ.2550ని 4% సాలీనా వడ్డీ రేటుతో చక్రవడ్డికి తీసుకొని రెండు సంవ్సతరాలలో రెండు సమాన సాలీనా వాయీదాల్లో చెల్లించెను. ఒక్కో సాలీనా వాయీదాకు ఎంత మొత్తం చెల్లించెను? (రూ.లలో)
1) 1377 2) 1275 3) 1283 4) 1352
23.400 మంది వ్యక్తులు రోజుకు 9 గంటల చొప్పున పని చేసి ్ట వ వంతు పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరు. ఎంత మంది అదనపు వ్యక్తులతో కలిసి రోజుకు 8 గంటల చొప్పున పనిచేసి మిగలిన పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలరు.
1)75 2)675 3)250 4)225
24. ఉమ ఒక పరీక్షలో మొత్తం మార్కులో 35% మార్కులో పొంది మరియు 30 మార్కులతో ఫెయిల్ అయింది. అదే పరీక్ష రాసిన మహేష్ మొత్తం మార్కులో 60% పొంది, ఉత్తీర్ణతకు అవసరమైన మార్కులు కంటే 20 మర్కులు ఎక్కువ పొందాడు. ఆ పరీక్షలో ఉత్తీర్ణత పొందడానికి అవసరమైన మార్కులు ఎన్ని?
1)90 2)100 3)110 4)120
25. ఒక టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లో A టీం దీ టీం కంటే, మొత్తం పరుగుల్లో 10%పరుగులు ఎక్కువ చేసింది, దీ టీం 630 పరుగులు చేసినట్లయితే ఎన్ని పరుగుల తేడాతో దీ టీం మ్యాచ్ ఓడిపోయింది.
1)140 2)150 3)130 4)160
26) రెండు వరుస ప్రధాన సంఖ్యల లబ్దం 323.వాటి క.సా.గు. ఎంత?
1) 17 2) గ.సా.బా.కి సమానం
3) 13 4) 323
27) రెండు సంఖ్యల బేధం,పెద్ద సంఖ్యలో 20% సమానం. ఆ రెంటిలో చిన్న సంఖ్య 40. అయితే పెద్ద సంఖ్య ఎంత?
1) 40 2) 50 3) 60 4) 45
28) 3,7,11,15,......అనే శ్రేణిలో 40వ పదం ఎంత?
1)153 2)155 3)157 4)159
29. నాలుగు వరుస సహజ సంఖ్యల మొత్తం 54. మొదటి, చివరి సంఖ్యల వర్గాల బేధం ఎంత?
1) 69 2) 75 3) 81 4) 87
30. రెండు సఖ్యల మొత్తం 32, వాటి బేధం 8 అయితే ఆ రెండు సంఖ్య ల నిష్పత్తి ఎంత?
1) 5:3 2) 5:4 3) 8:3 4) 5:7
31.6,8,4,7 మరియు 9 లనుపయోగించి ఎన్ని '5' అంకెల సంఖ్యలను ఏర్పరచవచ్చు.?
1)60 2) 120 3) 240 4) 150
32. నలుగురు వ్యక్తులను ఒక పార్టీకి ఆహ్వనించినట్ల యితే, వారు ఆతిథ్యంనకు పిలిచిన వ్యక్తితో కలసి ఒక గుండ్రటి టేబుల్ చుట్టూ ఎన్ని రకాలుగా కూర్చొవచ్చు?
1) 24 2) 120 3) 96 4) 30
33. ఒక చతురస్త్రల చుట్టకొలతలు 40సెం.మీ., 32 సెం.మీ. ఈ రెండు చతురస్త్రముల వైశాల్యాల భేదంకు సమన వైశాల్యాలు గల మూడవ చతురస్త్రం చుట్టుకొలత ఎంత?
1) 24 2) 30 3) 16 4) 18
34. ఒక దీర్ఘ చతురస్రకారపు స్థలం యొక్క ఒక భుజం 15 మీ., ఒక కర్ణం 17 మీ. అయితే ఆ స్థలం యొక్క వైశాల్యం కనుగొనుము? (చ.మీ.లలో )
1) 100 2) 140 3) 120 3) 150
35. మోహన్ 3 గంటల్లో 10.2 కి.మీ. చేరగలడు. 5 గంటల్లో అతడు చేరిన దూరం?(కి.మీ.)
1) 15 2) 17 3) 19 4) 18
సమాధానాలు
1.3 2.1 3.3 4.1 5.2
6.3 7.2 8.4 9.4 10.3
11.2 12.4 13.3 14.1 15.3
16.3 17.2 18.3 19.4 20.4
21.3 22.4 23.2 24.2 25.1
26.4 27.2 28.4 29.3 30.1
31.2 32.1 33.1 34.3 35.2
- సి. ప్రకాశ్ రెడ్డి
మెదక్, ఫోన్: 9440783828
Authorization