1) ఒక తరగతిలో 30 మంది విద్యార్థుల సరాసరి వయస్సు 14 సం. టీచర్ వయస్సు కలుపుకుంటే సరాసరి 15 సం.లు అయితే టీచర్ వయస్సు ఎంత?
1) 45 సం. 2) 35 సం.
3) 40 సం. 4) 30 సం.
2) ముగ్గురు వ్యక్తుల సగటు వయస్సు 23 సం.లు నాలుగో వ్యక్తి వయస్సు కలిపినప్పటికి నలుగురి వయస్సు 23 సం.లు అయితే నాలుగవ వ్యక్తి వయస్సు ఎంత?
1)20 సం. 2)23 సం.
3)22 సం. 4)21 సం.
3)25 రాశుల సరాసరి 18. దీనిలో మొదటి 12 రాశుల సరాసరి 17.చివరి 12 రాశుల సరాసరి 14 .ఐన 13 వ రాశి విలువ ఎంత?
1) 78 2) 72 3) 74 4) 75
4) ఒక గరిష్ట సంఖ్యచే 77,147 మరియు 252 లను భాగించగా ప్రతిసారి శేషం సమానంగా వస్తే ఆ సంఖ్య ఏది?
1)35 2)70 3)25 4)45
5) ఒక మూడు అంకెల గరిష్ట సంఖ్యను 6,9,12 లచే భాగించినప్పుడు శేషం ప్రతి సారి 3 వచ్చిన ఆ గరిష్ట సంఖ్య ఎంత?
1) 996 2) 903 3) 975 4) 939
6) ఏ సంఖ్యను 24,32 మరియు 36 ల చే భాగించగా శేషం 19,27 మరియు 31 వచ్చే కనిష్ఠ సంఖ్య ఏది?
1) 280 2) 253
3) 263 4) 283
7) ఒక సంఖ్య చే 29,60 మరియు 103 ల ను భాగించగా వరుసగా శేషాలు 5,12 మరియు 7 వచ్చిన ఆ గరిష్ట సంఖ్య ఏది?
1) 23 2) 24 3) 25 4) 26
8) ఏ కనిష్ఠ నాలుగు అంకెల సంఖ్యను 5,6,8 మరియు 9 లచే భాగించినపుడు ప్రతిసారి శేషం 7 వచ్చే సంఖ్య ఏది?
1)1086 2)1087 3)1067 4)1085
9) చక్రవడ్డీకి పెట్టుబడిన సొమ్ము 2 సం.లలో 4840 రూ.లు గాను 3 సం.లలో 5324 రూ.లు వస్తే సంవత్సర వడ్డీ రేటు ఎంత?
1)10% 2)8% 3)4% 4)12%
10) కొంత సొమ్ము చక్రవడ్డీ చొప్పున లెక్కిస్తే 6 సం.లకు మూడు రెట్లు అయితే అదే వడ్డీ రేటుతో ఆ సొమ్ము 27 రెట్లు అవడానికి పట్టే కాలం ఎంత?
1)10 సం.లు 2)12 సం.లు
3)15 సం.లు 4)18 సం.లు
11) 24 మంది పనివారు ఒక పనిని రోజుకు 6 గం.ల వంతున పనిచేస్తే 14 రోజులలో పూర్తి చేయ గలరు.రోజుకు 7 గం.ల వంతున పనిచేస్తూ ఆ పనిని 8 రోజులలో పూర్తి చేయవలెనన్న కావలసిన పని వారి సంఖ్య ఎంత ?
1)24 2)32 3)36 4)40
12) సంవత్సరమునకు 6% చొప్పున 10,000 రూ.లకు 9 నెలల్లో ఎంత వడ్డీ వచ్చును?
1) 450 రూ.లు 2) 475 రూ.లు
3) 500 రూ.లు 4) 600 రూ.లు
13) ఒక వ్యక్తి రెండు సైకిళ్ళను ఒక్కొక్కటి 3000 రూ.లకు అమ్మెను.ఒక దాని ఫై 20% లాభం, రెండవ దాని పైన 20% నష్టం వచ్చెను.మొత్తం మీద అతనికి లాభ లేదా నష్ట శాతం?
1) 4% లాభం 2) 4%నష్టం
3) 5%లాభం 4) 5%నష్టం
14) 10 కలములు కొన్న వెల 9 కలములు అమ్మిన వెలకు సమానం అయిన లాభశాతం ఎంత?
1) 9% 2) 10%
3) 11% 4) 100/9
15) ఒక దుకాణదారుడు తన వస్తువుల ప్రకటన ధరను కొన్న వెల కన్నా 25% అధికముగా ప్రకటించెను. అతను ప్రతి వస్తువు పౖౖె 12% రుసుము ఇచ్చిన అతనికి వచ్చు లాభ శాతం ఎంత?
1) 5% 2) 10%
3) 15% 4) 20%
16) A ఒక వస్తువును 1000 రూ.లకు కొని ఆ వస్తువును B కి 20% లాభానికి అమ్మెను. అదే వస్తువును B 'C'కి 10% లాభానికి అమ్మితే C కొన్న వెల ఎంత?
1) 660 రూ.లు 2) 1320 రూ.లు
3) 1200 రూ.లు 4) 1220 రూ.లు
17) A ఒక వస్తువును 400 రూ.లకు కొనెను ఆ వస్తువును B కి 20% లాభానికి అమ్మెను. B అదే వస్తువును C కి 10% నష్టానికి అమ్మితే 'C' కొన్న వెల ఎంత (రూ.లలో)?
1) 440 2) 432
3) 400 4) 450
18) ఒక వ్యక్తి 1400 రూ.లకు ఒక సైకిల్ కొని 15% నష్టానికి అమ్మాడు.అయిన అతడు సైకిల్ అమ్మిన వెల ఎంత?
1) 1090 రూ.లు 2) 1160 రూ.లు
3) 1190 రూ.లు 4) 1202 రూ.లు
19) ఒక వ్యాపారి ఒక వస్తువును 400 రూ.లకు అమ్మితే 20% నష్టం వచ్చును. 10% లాభం రావాలంటే ఆ వస్తువును ఎంతకు అమ్మాలి?
1) 500 రూ.లు 2) 600 రూ.లు
3) 660 రూ.లు 4) 550 రూ.లు
సమాధానాలు
1.1 2.2 3.1 4.1 5.3
6.4 7.2 8.2 9.1 10.4
11.3 12.1 13.2 14.4 15.2
16.2 17.2 18.3 19.4
సి. ప్రకాశ్ రెడ్డి
మెదక్, ఫోన్: 9440783828